S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

02/15/2016 - 01:03

భద్రాచలం, ఫిబ్రవరి 14: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని గజియాబంద్, దక్షిణ ఒడిశా సరిహద్దుల్లో ఆదివారం పోలీసులు భారీగా మావోయిస్టుల డంప్‌ను కనుగొన్నారు. రాయ్‌పూర్ ఐజీ సింహ్ సాహెబ్ కథనం ప్రకారం మావోయిస్టుల కదలికల నేపథ్యంలో బస్తర్ ప్రాంతంలో పోలీసులు భారీ ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. డిఆర్‌జీ, ఎస్టీఎఫ్ బలగాలు చందామెట్టా, తులసీడోంగ్రి మధ్య కొండలపై అణువణువూ తనిఖీలు నిర్వహించాయి.

02/15/2016 - 01:03

విజయవాడ, ఫిబ్రవరి 14: రాష్ట్ర రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణంపై సందిగ్ధత ఏర్పడింది. చదరపు అడుగుకు 3వేల రూపాయల ధరను ప్రభుత్వం నిర్ణయించగా టెక్నికల్ బిడ్‌లో ఆమోదం పొందిన ఎల్ అండ్ టి, షాపూర్జీ పల్లోంజీ కంపెనీలు 3,500 రూపాయలు పైగా ధరను కోట్ చేయడంతో టెండర్లను ఖరారు చేయకుండా ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచింది.

02/15/2016 - 01:03

విజయవాడ, ఫిబ్రవరి 14: బలహీన వర్గాలకు చెందిన ఓట్ల వల్లే టిడిపి అధికారంలోకి వచ్చిన మాట వాస్తవమే కాని గడచిన రెండేళ్లలో ఎన్నికల్లో ఇచ్చిన 196 హామీల్లో ఏ ఒక్కదాన్ని కూడా సక్రమంగా అమలుచేసిన దాఖలాలు లేవంటూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. బిసిల వలన గతంలో తాను అధికారానికి దూరమయ్యాననే విషయాన్ని కూడా ఎంత త్వరగా గుర్తిస్తే అంత మేలని అన్నారు.

02/15/2016 - 01:02

వింజమూరు/దుత్తలూరు/వరికుంటపాడు, ఫిబ్రవరి 14: నెల్లూరు జిల్లాలో పలుచోట్ల భూమి కంపించింది. వింజమూరు మండలంలోని చాకలికొండ, బత్తినవారిపల్లిలో ఆదివారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో మూడు సెకన్లపాటు భూమి కంపించడంతో ఆయా గ్రామాల్లోని ప్రజలు పరుగులు తీశారు. గతంలో ఇదేవిధంగా పలు పర్యాయాలు భూమి కంపించడంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళన చెందారు.

02/15/2016 - 01:01

గుంటూరు, ఫిబ్రవరి 14: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎస్సీ వర్గీకరణకు అనుకూలమో, కాదో 48 గంటల్లో చెప్పాలంటూ ఎంఆర్‌పిఎస్ అధినేత మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. గుంటూరులోని ఓ హోటల్‌లో ఎస్సీ వర్గీకరణ, భవిష్యత్ కార్యాచరణ, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యల నేపథ్యంలో ఆదివారం జరిగిన సమావేశానికి కృష్ణమాదిగ హాజరై మాట్లాడారు.

02/15/2016 - 01:01

గుత్తి, ఫిబ్రవరి 14: అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని చెర్లోపల్లి గ్రామ పంచాయతీలో వెలసిన శ్రీశ్రీశ్రీ సంత్‌సేవాలాల్ మహరాజ్ 277వ జయంత్యుత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సేవాలాల్ జయంత్యుత్సవాలను ఆలయ కమిటీ నిర్వాహకులు బోగ్ కార్యక్రమంతో ప్రారంభించారు.

02/15/2016 - 01:00

విజయవాడ, ఫిబ్రవరి 14: రోజురోజుకు పెరుగుతున్న వైద్యావసరాలను దృష్టిలో ఉంచుకుని త్వరలో 500 వైద్యుల పోస్టులు, 1000 నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేయనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ వెల్లడించారు.

02/15/2016 - 00:59

నాగార్జునసాగర్, ఫిబ్రవరి 14: నాగార్జునసాగర్ జలాశయం నుండి కృష్ణాడెల్టాకు సాగర్‌లోని ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా విడుదల చేస్తున్న నీటిని సోమవారంతో నిలిపివేయనున్నారు. శ్రీశైల జలాశయం నుండి 11 టిఎంసిల నీటిని సాగర్ జలాశయంకు శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటూ విడుదల చేస్తున్నారు. గత పదిరోజులుగా శ్రీశైలం నుండి సాగర్‌కు వస్తున్న నీరు ఆదివారంతో తగ్గుముఖం పట్టింది.

02/15/2016 - 00:32

హైదరాబాద్, ఫిబ్రవరి 14: ఆన్‌లైన్ పెళ్లిళ్ల పేరయ్యలుగా ముద్రపడిన మేట్రిమోనియల్ వెబ్‌సైట్ల ద్వారా వధూవరులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. మేట్రిమోనియల్ వెబ్‌సైట్లను అడ్డుపెట్టుకుని అమాయక యువతీ యువకులను వలలో వేసుకుని లక్షలు గడిస్తున్న మోసగాళ్లపై కుప్పలు తెప్పలుగా వస్తున్న ఫిర్యాదుల మేరకు ఈ సమస్య పరిష్కారానికి అడ్డుకట్ట వేయాలని కేంద్రం భావిస్తోంది.

02/15/2016 - 00:29

తిరుపతి, ఫిబ్రవరి 14: సూర్యజయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం తిరుమలలో నిర్వహిస్తున్న రథసప్తమి ఉత్సవాన్ని అత్యాధునిక కెమెరాలతో అనధికారికంగా చిత్రీకరిస్తున్న ముగ్గురు వ్యక్తులను టిటిడి విజిలెన్స్ సిబ్బంది గుర్తించి పోలీసులకు అప్పగించారు. వీరు చిత్రపరిశ్రమకు చెందిన టెక్నీషియన్లుగా గుర్తించారు.

Pages