S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/28/2016 - 16:22

పలామూ : జార్గండ్‌ రాష్ట్రం పలామూ జిల్లా ఛత్తర్‌పూర్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఆ ఘటనలో ఏడుగురు పోలీసులు దుర్మరణం చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గత రాత్రి పోలీసులు ఒక మినీ బస్‌లో ఆ ప్రాంతంలో ప్రయాణిస్తుండగా మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

01/28/2016 - 16:13

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో ఓటు వేసే ప్రజలు పార్టీల నిబద్ధతను పరిశీలించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఆయన గురువారంనాడు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ నగరంలోని ప్రతి ఇంటికి నల్లా నీటిని అందిస్తామని, శాస్ర్తియ పద్ధతులో నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఎవరికీ ఓటు వేస్తే మంచి ఫలితాలు వస్తాయో మేథావులు, విజ్ఞులు ఆలోచించాలని కోరారు. పండ్ల చెట్టు పెడితే పండ్లు వస్తాయి.

01/28/2016 - 14:13

హైదరాబాద్ : సెంట్రల్ యూనివర్శిటీలో ఉద్రిక్తత కొనసాగుతోంది. సైన్స్, ఆర్ట్స్ గ్రూపుల విద్యార్థుల మధ్య విభేదాలు తలెత్తాయి. తరగతులు ప్రారంభించాలంటూ సైన్స్ విద్యార్థులు ఆందోళన చేశారు. మరోపక్క తమకు న్యాయం చేయాలంటూ జేఏసీ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. దీంతో యూనివర్శిటీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

01/28/2016 - 07:46

కాకినాడ, జనవరి 27: ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడిసిన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎంసెట్ -2016) నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఉన్న త విద్యామండలి శుక్రవారం విడుదల చేయనున్నది. ఎంసెట్‌ను ఏప్రి ల్ 29న నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 3వ తేదీ నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. మార్చి 21వ తేదీ వరకు దరఖాస్తులు దాఖలు చేసుకునే అవకాశం ఉంది.

01/28/2016 - 07:45

కడప, జనవరి 27: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పుణ్యమా అని కాపుకులస్తుల పంట పండింది. కాపులను బీసీల్లో చేర్చాలంటూ 31న తుని సమీపంలో ముద్రగడ భారీ బహిరంగ సభను నిర్వహించనున్న తరుణంలో కాపులను బుజ్జగించేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కాపు కార్పొరేషన్ ఏర్పాటుచేసి, ఆ సంస్థ ద్వారా వందకోట్ల రూపాయల విడుదల చేసింది.

01/28/2016 - 08:01

విశాఖపట్నం, జనవరి 27: విశాఖలో వచ్చే నెల నాలుగో తేదీ నుంచి జరగనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్‌ఆర్)కి సంబంధించిన రిహార్సల్స్ బుధవారం నగరంలోని ఆర్‌కె బీచ్‌లో ప్రారంభమయ్యాయి. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ రిహార్సల్స్ జరిగాయి. సాయంత్రం 5.20 గంటల నుంచి ఆరు గంటల వరకూ ఆపరేషనల్ డెమో కొనసాగింది.

01/28/2016 - 07:16

హైదరాబాద్, జనవరి 27: గుంటూరు జిల్లా వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇందుకు సంబంధించి ముసాయిదా డాక్యుమెంట్లు సిద్ధమయ్యాయి. తాత్కాలిక సచివాలయం నిర్మాణంలో కొన్ని పనులను కాంట్రాక్టర్లకు అప్పగించి మిగిలిన పనులను రాష్ట్రప్రభుత్వమే చేపడుతుంది. ముఖ్యంగా ఉక్కు, ప్రీ ఫ్యాబ్రికేటెడ్ వాల్స్, ఆర్‌సిసి పనులను కాంట్రాక్టుకు ఇవ్వనుంది.

01/28/2016 - 07:15

తిరుపతి, జనవరి 27: నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగస్వామ్యులై జన్మభూమి రుణం తీర్చుకోవాలని ప్రవాస భారతీయులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

01/28/2016 - 05:15

హైదరాబాద్, జనవరి 27: హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడుకాదని తండ్రి మణికుమార్ అనుమానిస్తున్న నేపథ్యంలో, వ్యవహారంపై సమగ్ర న్యాయవిచారణ జరిపించాలని ఎబివిపి జాతీయ ప్రధాన కార్యదర్శి వినయ్ బిద్రే డిమాండ్ చేశారు. అతని మృతికి బాధ్యులను గుర్తించి క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు.

01/28/2016 - 05:09

రేణిగుంట, జనవరి 27 : భవిష్యత్తు శాస్త్ర సాంకేతిక రంగాలదేనని, ఆ దిశగా విద్యార్థులు దృష్టి సారించి దేశాన్ని ప్రపంచస్థాయిలో అగ్రస్థానానికి తీసుకెళ్ళాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. నవ్యాంధ్రప్రదేశ్ ఆవిర్భావం అనంతరం తొలిసారిగా తిరుపతిలో మూడు రోజులపాటు నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ సైన్స్ కాంగ్రెస్ అకాడమీని ముఖ్యమంత్రి బుధవారం ప్రారంభించారు.

Pages