S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/25/2016 - 02:20

తిరుమల, జనవరి 24: తిరుమల మొదటి కనుమ రహదారిలో ఆదివారం గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ జింక మృతి చెందింది. తిరుమల నుంచి తిరుపతికి వెళుతున్న ఓ వాహనం మార్గమధ్యంలోని ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద రోడ్డుపైకి వచ్చిన జింకను వేగంగా ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ మూగజీవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

01/25/2016 - 02:19

కడప, జనవరి 24: ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతోనే రాయలసీమకు న్యాయం జరుగుతుందని రాయలసీమ పరిరక్షణ సమితి (ఆర్‌పిఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కోస్తా పక్షపాతిగా వ్యవహరిస్తూ సీమను నిర్లక్ష్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆంగ్లేయుల కంటే దారుణంగా అధికార పార్టీ నాయకులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు.

01/25/2016 - 02:19

విజయవాడ, జనవరి 24: కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం హంగు, ఆర్భాటం కలిగిన కాపులను బిసి జాబితాలో చేర్చటం వల్ల ప్రధానంగా స్థానిక సంస్థల్లో బిసిలకు ప్రాతినిధ్యం లేకుండా పోతుందని అందుకే కాపులను బిసి జాబితాలో చేరిస్తే పోరాటం తప్పదంటూ యాదవ మహాసభ జాతీయ అధ్యక్షుడు రామనంద యాదవ్, జాతీయ ఉపాధ్యక్షుడు అన్నా రామచంద్రయాదవ్, జాతీయ ప్రధాన కార్యదర్శి నత్తు నరేంద్రయాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్ హెచ్చరిం

01/25/2016 - 02:18

రామగిరి, జనవరి 24: దివంగత మాజీ మంత్రి పరిటాల రవీంద్ర చూపిన మార్గంలోనే తాము కూడా నడుస్తున్నామని ఆయన సతీమణి, పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. అనంతపురం జిల్లా రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో ఆదివారం పరిటాల రవీంద్ర 11వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు.

01/25/2016 - 02:17

కాకినాడ, జనవరి 24: రాష్ట్రంలో రానున్న ఐదు సంవత్సరాల్లో 10 లక్షల మంది రైతులతో 10 లక్షల ఎకరాల్లో పెట్టుబడి లేని సహజ ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టేలా ప్రోత్సహించనున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించారు. ఈ ఏడాది రాష్ట్రంలో 3 లక్షల 12 వేల ఎకరాలలో సహజ ప్రకృతి వ్యవసాయం సాగయ్యేలా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.

01/25/2016 - 02:17

కడప, జనవరి 24: కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బలగాలను నియమించి కూంబింగ్ నిర్వహిస్తున్నా కూలీలు మాత్రం శేషాచలం అడవుల్లోకి యథేచ్ఛగా చొరబడుతూనే ఉన్నారు. తమిళ ఎర్ర కూలీలు, స్మగ్లర్లు ఏకంగా తమిళనాడు, కర్ణాటక నుంచి బస్సులు, లారీల్లో శేషాచలం అడవుల్లోకి యథేచ్ఛగా ప్రవేశిస్తున్నారు.

01/25/2016 - 02:16

విశాఖపట్నం, జనవరి 24: మహిళలు సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో సమానత్వం కల్పించాలని అఖిల భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు) జాతీయ ప్రధాన కార్యదర్శి అనీరాజ డిమాండ్ చేశారు. ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ నెల 20 నుంచి 23 వరకు విశాఖలో నిర్వహించిన 20వ జాతీయ మహాసభలు విజయవంతమయ్యాయన్నారు.

01/25/2016 - 02:16

విజయవాడ, జనవరి 24: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం దళిత స్కాలర్ రోహిత్ ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ఎందరో జాతీయ నేతలు స్పందించి పరామర్శిస్తుంటే హైదరాబాద్‌లోనే ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఎందుకు పరామర్శించలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రశ్నించారు. ప్రధాని మోదీ అంటే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు భయమని, ఈ కారణంగానే వారు సరైన రీతిలో స్పందించడం లేదని ఆక్షేపించారు.

01/25/2016 - 02:15

విశాఖపట్నం, జనవరి 24: బాక్సైట్ తవ్వకాలను ఐక్య పోరాటాల ద్వారా తిప్పికొట్టాలని ఎపి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబూరావు పిలుపునిచ్చారు. ఆదివారం విశాఖలో ‘బాక్సైట్ తవ్వకాలు-గిరిజనుల భవితవ్యం’ అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బాక్సైట్ వ్యతిరేక ఉద్యమాన్ని మరింత విస్తృతపరిచేందుకు గిరిజనులంతా కదలి రావాలన్నారు.

01/25/2016 - 01:10

విజయవాడ, జనవరి 24: ఎన్నికల ప్రచారం సమయంలో తొలిసారిగా అన్ని ప్రధాన రాజకీయ పక్షాలు కాపులను బిసిలుగా గుర్తించేందుకు స్పష్టమైన హామీలు ఇచ్చినందునే ఇక ఏ మాత్రం జాప్యం లేకుండా ఆ హామీలను కార్యరూపం దాల్చేందుకు ఇదే తగిన సమయం అని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. ఈ విషయంలో ఇప్పటికే రెండేళ్లపాటు జాప్యం జరిగింది.

Pages