S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/25/2016 - 01:09

హైదరాబాద్, జనవరి 24: భారత చలనచిత్ర రంగానికి వస్తున్న ఆదాయంలో 45శాతం దక్షిణాదికి చెందిన నాలుగు రాష్ట్రాల చిత్ర పరిశ్రమనుంచే వస్తోందని, ఎందులోనూ మనం తక్కువ కాదని ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రఖ్యాత సినీసౌండ్ ఇంజనీర్ రసూల్ ఫూకుట్టి అభిప్రాయపడ్డారు. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా) అవార్డుల ప్రదానోత్సవం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం సాయంత్రం ప్రారంభమైంది.

01/25/2016 - 01:09

నిజామాబాద్, జనవరి 24: ఆడపిల్లలుగా పుట్టడమే వారి పాలిట శాపమైంది. తల్లి పొత్తిళ్లలో వెచ్చగా సేదదీరాల్సిన శిశువులు, అందరూ ఉండి కూడా అనాథలుగా మారారు. ఇద్దరు ఆడపిల్లలు కవల సంతానంగా జన్మించడంతో, సదరు చిన్నారులను వారి తల్లిదండ్రులు, కుటుంబీకులు ఆసుపత్రిలోనే వదిలేసి వెళ్లిపోయారు. నిజామాబాద్ నగరంలోని హమాల్‌వాడి ప్రాంతానికి చెందిన సునీత అనే మహిళకు జన్మించినట్టు ఆసుపత్రి వర్గాలు అనుమానిస్తున్నాయి.

01/25/2016 - 01:08

హైదరాబాద్, జనవరి 24: స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటివారికి రాజకీయాలను అంటడగట్టడం మానుకోవాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఎబివిపి) జాతీయ కార్యవర్గసభ్యుడు ఎం.రాఘవేందర్ హితవు పలికారు. కేంద్రప్రభుత్వం కోట్లాది మంది భారతీయుల ఆకాంక్ష మేరకు నేతాజీ మరణానికి సంబంధించిన రహస్య ఫైళ్లను బహిర్గతం చేస్తే దానికి రాజకీయం అంటగట్టడం విచారకరమని అన్నారు.

01/25/2016 - 01:07

హైదరాబాద్, జనవరి 24: గణతంత్ర దినోత్సవం సందర్భంగా నగరంలో పేలుళ్లకు కుట్ర పన్నిన ఐసిస్ సానుభతూతిపరులను ఎన్‌ఐఏ అధికారులు నాంపల్లి కోర్టులో హాజరు పరచి ఢిల్లీకి తీసుకెళ్లిన విషయం విదితమే. టోలిచౌకి ప్రాంతానికి చెందిన నఫీజ్‌ఖాన్, అబూ అమాస్, షరీఫ్ మోహియుద్దీన్, ఉబేదుల్లాను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్టు చేయడంతో నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది.

01/25/2016 - 01:06

హైదరాబాద్, జనవరి 24: హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ ఇన్‌చార్జీ వైస్ చాన్సలర్‌గా ప్రొఫెసర్ విపిన్ శ్రీవాత్సవను నియమించడంపై ఎస్సీ, ఎస్టీ విద్యార్ధి సంఘాలు, అధ్యాపక సంఘాలు మండిపడుతున్నాయి. తమిళనాడుకు చెందిన సెంథిల్‌కుమార్ అనే ఫిజిక్స్ పరిశోధన విద్యార్ధి 2008లో ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సమయంలో ఫిజిక్స్ డిపార్టుమెంట్ డీన్‌గా ప్రొఫెసర్ శ్రీవాత్సవ ఉన్నారని విద్యార్ధి సంఘాలు ఆరోపిస్తున్నాయి.

01/25/2016 - 01:05

హైదరాబాద్, జనవరి 24: ఆత్మహత్య చేసుకున్న సెంట్రల్ వర్శిటీ విద్యార్ధి రోహిత్ వేముల ఫేస్‌బుక్‌లో పేర్కొన్న అంశాలను విశే్లషిస్తే అతని అంతరంగంలో తలెత్తిన కల్లోలం, ఆటుపోట్లు, మానసిక సంఘర్షణ విదితమవుతాయి. 2013 మేలో ఫేస్‌బుక్‌లో రోహిత్ ఇలా రాశారు. ‘నా తల్లి పవిత్రమైన మాతృమూర్తి. నాకు జీవితమంటే విరక్తి పుట్టినప్పుడల్లా నా తల్లిని తలుచుకుంటాను. ఆమె జ్ఞాపకాలనుంచి స్ఫూర్తి పొందుతుంటాను.

01/25/2016 - 01:04

బంగారుపాళ్యం, జనవరి 24: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రత్యేక వాహనంలో బయలుదేరిన భక్త బృందం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం వద్ద ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ సంఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా నలుగురికి గాయాలయ్యాయి.

01/25/2016 - 01:03

మహబూబ్‌నగర్, జనవరి 24: అడవుల్లో నివసించే చెంచుల ఆరోగ్య పరిరక్షణకు తెలంగాణ రచయితల వేదిక నడుం బిగించింది. మహబూబ్‌నగర్ జిల్లా నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలోని అప్పాపూర్ చెంచుపెంటల్లో ఆదివారం వైద్య శిబిరం నిర్వహించి రెండు వందలమందికి పైగా ఆదివాసీలకు చికిత్స అందించింది.

01/25/2016 - 01:02

భద్రాచలం, జనవరి 24: ఖమ్మం జిల్లా భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి సన్నిధిలోని మిథిలా స్టేడియం సమీపాన స్వామి ఉత్తరద్వారంలో ఆదివారం తెలుగు రాష్ట్రాల చిన్నారులు భక్తరామదాసు కీర్తనలకు అనుగుణంగా రామయ్యకు నృత్యాభిషేకం చేసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు దక్కించుకున్నారు. గతంలో అన్నమయ్య కీర్తనలకు నృత్యాలు చేసిన చిన్నారులు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్సులో నమోదయ్యారు.

01/25/2016 - 01:01

సంగారెడ్డి, జనవరి 24: ఏటా సాహస బాలలకు ఇచ్చే ప్రతిష్ఠాత్మక గీతా చోప్రా అవార్డు దక్కించుకున్న మెదక్ జిల్లా బాలిక రుచిత కనబరచిన ధైర్య సాహసాలు నిరుపమానం. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల రుచిత కనబరిచిన తెగువ మరో ఇద్దరు బాలలకు ప్రాణభిక్ష పెట్టింది. ఇంతకీ రుచిత చేసిన సాహసమేమిటి?

Pages