S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/25/2016 - 00:39

హైదరాబాద్, జనవరి 24: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో తెదేపా- భాజపాలను గెలిపిస్తే పూర్తిస్థాయిలో నగరంలో వైఫై ఏర్పాటు చేస్తామని, పైపు లైన్ల ద్వారా వంట గ్యాస్ అందిస్తామని, ప్రతి ఇంటికీ ఉచితంగా సెట్ టాప్ బాక్స్ ఇస్తామని, పేదలకు ఉచిత నల్లా కనెక్షన్ కల్పిస్తామని, శివారు ప్రాంతాలకు వౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెదేపా -్భజపా సంయుక్త ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నాయి.

01/25/2016 - 00:38

హైదరాబాద్, జనవరి 24: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ప్రతి ఇంటికీ తాగు నీరు ఉచితంగా అందిస్తామని, బిల్లు వసూలు చేసేదిలేదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రకటించింది. సీమాంధ్ర నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచీ వలస వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వారి రక్షణ బాధ్యత తమదేనని, సెటిలర్లు అనే పదాన్ని నిషేధిస్తామని పేర్కొంది.

01/25/2016 - 00:37

హైదరాబాద్, జనవరి 24: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కంటే ఎక్కువ ఉండేలా బడ్జెట్ ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి (2016-17) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే కనీసం పది లక్షలైనా ఎక్కువ ఉండేందుకు ఆర్థిక శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నట్టు అధికార వర్గాల సమాచారం. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.

01/25/2016 - 00:36

ప్రతి శుక్రవారం పాఠకులను అలరిస్తున్న వెనె్నల సినిమా ప్రత్యేక అనుబంధం ఇక (జనవరి 26) నుంచి ప్రతి మంగళవారం అందుతుంది. మంగళవారం రావాల్సిన యువ ప్రత్యేక పేజీ శుక్రవారం వెలువడుతుంది. పాఠకులు గమనించగలరు.
-ఎడిటర్

01/25/2016 - 00:35

హైదరాబాద్, జనవరి 24: ఆంధ్ర రాష్ట్ర మంత్రివర్గం సోమవారం సుదీర్ఘ భేటీకి సిద్ధమవుతోంది. విజయవాడలో సిఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే సమావేశంలో కీలకాంశాలపై చర్చించనున్నారు. సమావేశంలో మంత్రుల పనితీరునూ సిఎం సమీక్షించి హెచ్చరికలు జారీచేసే అవకాశం ఉందని సమాచారం.

01/25/2016 - 00:32

పెద్దాపురం, జనవరి 24: వ్యవసాయ శాఖలో ఏడు వేల పోస్టులను త్వరతో భర్తీ చేయనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఆదివారం ఆయన పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఆదర్శ రైతుల వ్యవస్థ తొలగించినట్టు తెలిపారు.

01/25/2016 - 00:35

హైదరాబాద్, జనవరి 24: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రోహిత్ ఆత్మహత్య ఘటనపై విద్యార్థులు మళ్లీ ఆమరణ దీక్ష చేపట్టారు. ఆదివారం అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏడుగురు విద్యార్థులు ఆమరణ దీక్షలో కూర్చుకున్నారు. విద్యార్థి సంఘాల జెఏసి దీక్షలకు సంఘీభావం తెలిపింది. హెచ్‌సియూ విద్యార్థులకు ఆందోళనకు ఉస్మానియా యూనివర్శిటీ జెఏసి మద్దతు ప్రకటించింది.

01/25/2016 - 00:32

పాయకరావుపేట, జనవరి 24: విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం రాజవరం సమీపంలోని డక్కన్ ఫైన్ కెమికల్స్ పరిశ్రమలో ఆదివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదంలో పరిశ్రమకు సుమారు 50కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు అంచనా. ప్రమాద స్థలంలో ఒకరు అస్వస్థతకు గురయ్యాడు. డక్కన్ ఫైన్ కెమికల్స్ పరిశ్రమ గోడౌన్‌లోని కోల్డ్ స్టోరేజ్‌లో షార్టు సర్క్యూట్ సంభవించి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

01/24/2016 - 02:38

హైదరాబాద్, జనవరి 23: కోర్టు ధిక్కారం కేసులో రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న రాహుల్ బొజ్జాకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గత ఏడాది జూన్‌లో కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించారని అప్పటి మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా, రెవెన్యూ అధికారులు దయానంద్, ఎమ్మార్వో మహిపాల్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు.

01/24/2016 - 02:37

ఉట్నూరు, జనవరి 23: మారుమూల ప్రాంతాలకు న్యాయస్థానాలు విస్తరించినప్పుడే అన్నివర్గాల వారికి సమన్యాయం దక్కే అవకాశం ఉందని ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బాబా సాహెబ్ భోస్లే అభిప్రాయపడ్డారు.

Pages