S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/24/2016 - 02:37

నాగార్జునసాగర్, జనవరి 23: నాగార్జునసాగర్ ప్రాజెక్టు డ్యాం భద్రతలో తీసుకుంటున్న చర్యలను శనివారం స్పెషల్ ప్రొటెక్షన్‌ఫోర్స్ కమాండెంట్ అన్వర్‌పాషా ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. ప్రస్తుతం దేశంలో నెలకొని ఉన్న ఉగ్రవాద దాడుల దృష్ట్యా అన్ని రాష్ట్రాలలోనూ భద్రతపై ప్రభుత్వాలు కట్టుదిట్టం చేశాయి.

01/24/2016 - 02:36

వరంగల్, జనవరి 23: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం వరంగల్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆడిటోరియంలో రెండు రోజుల పాటు జరుగనున్న జాతీయ మహిళా సదస్సును ఆమె ప్రారంభించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం పోరాడుతామన్నారు.

01/24/2016 - 02:35

హైదరాబాద్, జనవరి 23: ప్రజలు కోరుకునే వౌలిక సదుపాయాలు కల్పించే విధంగా టిఆర్‌ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టో రూపొందించినట్టు కెటిఆర్ తెలిపారు. ఇంతకాలం మేయర్ పదవిని ఆధిష్టించిన వివిధ పార్టీలు చేసిందేమీ లేదని అన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కాగా నవశకానికి నాంది పలికే విధంగా మ్యానిఫెస్టో ఉందని రాజ్యసభ సభ్యులు కె కేశవరావు తెలిపారు.

01/24/2016 - 02:31

విశాఖపట్నం, జనవరి 23: లోక్‌నాయక్ ఫౌండేషన్ 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం రాత్రి విశాఖలో జరిగిన కార్యక్రమంలో సుప్రసిద్ధ అవధాని గరికపాటి నర్సింహరావుకు లోక్‌నాయక్ సాహిత్య పురస్కారంతోపాటు రూ.1.50 లక్షల నగదును, రైల్వే కార్మిక నేత చలసాని గాంధీకి జీవిత సాఫల్య పురస్కారంతోపాటు రూ.50 నగదును అందజేశారు.

01/24/2016 - 02:27

హైదరాబాద్, జనవరి 23: హైదరాబాద్‌లో నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజన్సీ అరెస్టు చేసిన నలుగురు ఉగ్రవాదులు జనూద్ ఉల్ ఖలీఫ్ ఇ హింద్‌కు చెందిన వారని పోలీసు వర్గాలు తెలిపాయి. జనూద్ ఉల్ ఖలీఫ్ ఇ హింద్ అంటే ఆర్మీ ఆఫ్ ఖలీఫ్ ఆఫ్ ఇండియా. వీరు ఐఎస్‌ఐస్ చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఏర్పాటు చేసిన ఈ సంస్ధలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

01/24/2016 - 02:26

హైదరాబాద్, జనవరి 23 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనలో ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) ని అడుగడుగునా వినియోగించుకునే ప్రణాళికలో భాగంగా ఈ నెల 29 న తిరుపతిలో ‘ఎలెట్స్ ఇ-గవ్’ పేరుతో ఐటిసి సింపోజియం ఏర్పాటు చేస్తున్నారు. జాతీయస్థాయి, అంతర్జాతీయ స్థాయిలో పేరుప్రఖ్యాతులున్న అనేక సంస్థలు పాల్గొంటున్నాయని రాష్ట్ర ఐటి సలహాదారు జె. సత్యనారాయణ తెలిపారు.

01/24/2016 - 00:58

విశాఖపట్నం, జనవరి 23: విశాఖ నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్)కు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

01/24/2016 - 00:57

ఖమ్మం, జనవరి 23: గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని జరుగుతున్న ఆటల పోటీల్లో అపృశృతి చోటు చేసుకుంది. ప్రైవేటు పాఠశాలలో నిర్వహించిన పోటీల్లో ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన ఖమ్మం జిల్లా జూలూరుపాడులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం జూలూరుపాడులోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఖోఖో ఆడుతుండగా ఇద్దరు తోటి ఆటగాళ్లు బలంగా తగలడంతో 7వ తరగతి విద్యార్థి భద్రాచలం స్పృహ తప్పి పడిపోయాడు.

01/24/2016 - 01:39

గుంటూరు, జనవరి 23: రాజధాని రైతులకు ఎలాంటి అన్యాయం జరగదని, వారంతా ఇచ్చిన సూచనలను తప్పక పరిగణనలోకి తీసుకుని సమస్యలు పరిష్కరిస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, సిఆర్‌డిఎ వైస్ చైర్మన్ పి నారాయణ స్పష్టం చేశారు. సిఆర్‌డిఎ కమిషనర్ శ్రీకాంత్‌తో కలిసి సింగపూర్‌లో రెండు రోజుల పర్యటనను శనివారం ఉదయం ప్రారంభించిన సందర్భంగా మంత్రి నారాయణ ఒక ప్రకటన విడుదల చేశారు.

01/24/2016 - 00:54

విశాఖపట్నం, జనవరి 23: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్‌ఆర్‌ఇఎస్) అమల్లో ఆంధ్రప్రదేశ్‌కు జాతీయ స్థాయిలో అవార్డు లభించింది. ఉపాధి పథకం అమల్లో పారదర్శకత, జవాబుదారీ తనంతో పాటు కూలీలకు సక్రమంగా వేతనాల చెల్లింపు, తదితర అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలకు సంతృప్తి చెందిన కేంద్రం జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డుకు ఎంపిక చేసింది.

Pages