S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/24/2016 - 00:51

కనిగిరి రూరల్, జనవరి 23: వెనుకబడిన జిల్లాలు గణనీయంగా అభివృద్ధి చెందాలన్నదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు లక్ష్యం అని కేంద్రమంత్రి వర్యులు వై సుజనాచౌదరి అన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి ఎఎంసి ప్రాంగణంలో శనివారం జరిగిన ఎఎంసి చైర్మన్, వైస్ చైర్మన్లు దారపనేని చంద్రశేఖర్, ఐవి నారాయణ, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవ స్వీకారానికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

01/24/2016 - 00:50

విశాఖపట్నం, జనవరి 23: అవినీతికి పాల్పడుతున్న అధికారులకు శిక్షలు పడటంలో చోటుచేసుకుంటున్న జాప్యం కారణంగా ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందని చీఫ్ విజిలెన్స్ కమిషనర్ (సివిసి) కెవి చౌదరి అభిప్రాయపడ్డారు. విశాఖ ఎయులోని వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో శనివారం ఎథిక్స్ ఇన్ గవర్నెన్స్ అండ్ ప్రోబిటీ ఇన్ పబ్లిక్ లైఫ్ అంశంపై విద్యార్థులతో శనివారం నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.

01/24/2016 - 00:41

భద్రాచలం, జనవరి 23: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో శనివారం ప్రెషర్ బాంబ్ పేలి ఒక జవానుకు తీవ్రగాయాలయ్యాయి. దంతెవాడ జిల్లాలోని సామేలీ గ్రామం వద్ద రోడ్డు నిర్మాణం జరుగుతోంది. సీఆర్‌పీఎఫ్ 111 బెటాలియన్‌కు చెందిన జవాన్లు నిర్మాణానికి రక్షణగా వెళ్లారు. డ్యూటీలో ఉన్న జనార్ధన్ సోనావేని అనే జవాను మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబుపై దురదృష్టవశాత్తు అడుగేశాడు.

01/24/2016 - 00:40

కడప, జనవరి 23: మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు కడప జిల్లా అడ్డగా మారింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి గల్ప్ దేశాలకు వీటిని రవాణా చేసేందుకు అక్రమార్కులు కడప జిల్లాను కేంద్రంగా చేసుకున్నారు. చాలా కాలంగా ఈవ్యవసారం కొనసాగుతోంది. తాజాగా శనివారం జిల్లా పోలీసులు ఐదుగురు స్మగ్లర్లను అరెస్టు చేయడంతో మాదకద్రవ్యాల అక్రమ రవాణా వ్యవహారం బట్టబయలైంది.

01/24/2016 - 00:40

గుంటూరు, జనవరి 23: దేశం కోసం సరిహద్దుల్లో ప్రాణ త్యాగాలు చేస్తున్న భరతమాత ముద్దుబిడ్డలకు ఇవ్వని గౌరవం ఒక నకిలీ దళితుడికి ఇవ్వడం అవసరమా అని హిందూ ధర్మ పరిరక్షణ సమస్వయ సమితి గుంటూరు జిల్లా అధ్యక్షుడు దర్శనపు శ్రీనివాస్ ప్రశ్నించారు.

01/24/2016 - 00:39

హైదరాబాద్, జనవరి 23: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో క్రైస్తవ మతం ముసుగులో ఎస్సీలుగా చలామణి అవుతున్న వారిని గుర్తించాలని జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసింది.

01/24/2016 - 00:39

హైదరాబాద్/గచ్చిబౌలి, జనవరి 23: సెంట్రల్ వర్శిటీ ప్రాంగణంలో దీక్షలు చేస్తున్న విద్యార్థులకు పరామర్శల పరంపర కొనసాగుతోంది. శనివారంనాడు మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, జస్టిస్ సుదర్శన్ రెడ్డి, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎపిపిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి తదితరులు దీక్షాశిబిరాన్ని సందర్శించారు.

01/24/2016 - 00:38

హైదరాబాద్, జనవరి 23:సెంట్రల్ వర్శిటీ విద్యార్థి రోహిత్ మృతిపై ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. రోహిత్ ఆత్మహత్య దురదృష్టకరమని ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు వ్యాఖ్యానించారు. టిఆర్‌ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల కార్యక్రమం శనివారం తెలంగాణ భవన్‌లో జరిగింది.

01/24/2016 - 00:37

హైదరాబాద్, జనవరి 23: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (హెచ్‌సియు) విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయపై నమోదు చేసిన కేసును ఉపసంహరించుకోవాలని పలు బిసి, దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. విద్యార్థి ఆత్మహత్యకు దత్తాత్రేయకు ఎలాంటి సంబంధం లేదని ఆ సంఘాలు పేర్కొన్నాయి. బిసి వర్గానికి చెందిన దత్తాత్రేయను మంత్రి పదవి నుంచి తొలగించే కుట్ర జరుగుతోందని ఆ సంఘాలు ఆరోపించాయి.

01/24/2016 - 00:21

హైదరాబాద్, జనవరి 23: విశ్వనగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని తెరాస ఎన్నికల ప్రణాళికలో పేర్కొంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేకంగా రూపొందించిన మేనిఫెస్టోను తెలంగాణ భవన్‌లో శనివారం విడుదల చేశారు. తెరాస ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన పనులను పేర్కొంటూ, చేయబోయే వాటిని కలిసి ఐటి మంత్రి కెటిఆర్, పార్టీ నేతలు డి శ్రీనివాస్ తదితరులు మ్యానిఫెస్టో విడుదల చేశారు.

Pages