S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/17/2016 - 07:00

సూళ్లూరుపేట, జనవరి 16: భారత అంతరిక్ష ప్రయోగకేంద్రం ఇస్రో ప్రతిష్టాత్మకంగా నింగిలోకి పంపనున్న సతీష్ థావన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి పిఎస్‌ఎల్‌వి సి-31 రాకెట్ ప్రయోగం ఈనెల 20న జరగనుంది. నావిగేషన్ సేవలకు సంబంధించిన శ్రీహరికోట నుంచి నింగిలోకి పంపించేందుకు ఇస్రో ఈరాకెట్ ప్రయోగం చేస్తోంది. రాకెట్ ప్రయోగ ఏర్పాట్లకు సర్వం సిద్ధం చేసింది.

01/17/2016 - 06:35

విజయవాడ, జనవరి 16: సికింద్రాబాద్ మాజీ శాసనసభ్యురాలు, ప్రఖ్యాత సినీ నటి జయసుధ శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నివాస గృహంలో ఆయన సమక్షంలో తెలుగుదేశంలో చేరారు.

01/17/2016 - 06:02

హైదరాబాద్, జనవరి 16: ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా సంఘాల అజమాయిషీలో ఇసుక వేలం పద్ధతికి ప్రభుత్వం స్వస్తి పలికింది. సరికొత్తగా ఇసుక రీచ్ వేలానికి రంగం సిద్ధం చేసింది. మూడు దశల్లో ఇసుక రేవుల వేలంపాట నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్యూబిక్ మీటర్‌కు 550 రూపాయిలు మించకుండా విక్రయాలు చేయనుంది. 550 రూపాయిల లోపు ఉండేలా విక్రయించాలని, అలాంటివారే ఈ-బిడ్డింగ్‌లో పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశించింది.

01/17/2016 - 05:59

హైదరాబాద్, జనవరి 16: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోంది. ఇంతకాలం భూసేకరణ, భూమి చదును, భూమి పూజ, శంకుస్థాపన, తాత్కాలిక రోడ్ల నిర్మాణం, భూ సర్వే, గ్రామకంఠాల గుర్తింపు, సరిహద్దులు, క్యాపిటల్ రీజియన్ మాస్టర్ ప్లాన్, సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్, వౌలిక సదుపాయాలు వసతుల కల్పన అంశాలపై దృష్టిపెట్టిన ప్రభుత్వం, తాజాగా మరో అడుగు ముందుకేసింది.

01/16/2016 - 18:36

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)ఎన్నికలకు శనివారం ఒక్కరోజే 1003 నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. తెరాస 277, భాజపా 93, తెదేపా 187, కాంగ్రెస్‌ 200, స్వతంత్ర అభ్యర్థులు 249 నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇప్పటి వరకు 1097 నామపత్రాలు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

01/16/2016 - 13:53

హైదరాబాద్‌: రాష్ట్ర రాజధాని నగర పోలీసులు అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా ఆట కట్టించారు. సౌత్‌జోన్‌ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి 80 కేజీల గంజాయి సీజ్‌ చేశారు.

01/16/2016 - 13:48

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ-టీడీపీల మధ్య ఎన్నికల పొత్తు కుదిరింది. ఈమేరకు రెండు పార్టీలు అవగాహనకు వచ్చాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 150 డివిజన్లు ఉండగా బీజేపీ 60 స్థానాల్లో, టీడీపీ 90 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. రెండు పార్టీలు ఇవాళ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నాయి.

01/16/2016 - 13:36

హైదరాబాద్: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం జోరందుకుంది. రెండు రోజుల మాత్రమే మిగిలి ఉండటంతో శనివారం భారీగా నామినేషన్ల దాఖలయ్యాయి. ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. - బంజారాహిల్స్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థిగా రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు కుమార్తె విజయలక్ష్మీ నామినేషన్ వేశారు.

01/16/2016 - 13:17

కోల్‌కతా : పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. పామ్‌ అవెన్యూ ప్రాంతంలోని ఓ ఇంట్లో ముగ్గురి మృతదేహాలను స్థానికులు గుర్తించారు. ఓ మహిళ, ఆమె ఇద్దరు కుమారులు వారి సొంతింట్లోనే నిర్జీవంగా పడి ఉండగా.. మహిళ భర్త తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.

01/16/2016 - 13:13

హైదరాబాద్‌: విశాఖ ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మినుములూరులో 6, పాడేరులో 8డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలితీవ్రతకు ఏజెన్సీవాసులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. మరో వైపు ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు.

Pages