S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/05/2016 - 07:16

ఒంగోలు,జనవరి 4: రాష్ట్రాన్ని 2020 నాటికి భారతదేశంలో మూడవ రాష్ట్రంగాను, 2029నాటికి భారతదేశంలో నెంబర్‌వన్‌గాను, 2050నాటికి ప్రపంచంలోనే అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలుపుతానని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు వెల్లడించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం గ్రామంలో జన్మభూమి -మాఊరు కార్యక్రమం జరిగింది.

01/05/2016 - 07:15

కుకునూరు, జనవరి 4: పశ్చిమ గోదావరి జిల్లా కుకునూరు మండలం నమిలిపేటలో సోమవారం ఒక ఉన్మాది జరిపిన దాడిలో అతని భార్య సహా ఇద్దరు గాయపడ్డారు. అనంతరం ఉన్మాది కత్తితో తన పీక కోసుకున్నాడు. కుకునూరు ఎస్సై రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం నమిలిపేటకు చెందిన కంటిపల్లి అర్జున్ సోమవారం తన భార్య భద్రమ్మతో వాగ్వివాదానికి దిగాడు. ఆగ్రహంతో ఆమెపై కర్రతో దాడిచేసి గాయపరిచారు.

01/05/2016 - 07:14

తణుకు, జనవరి 4: సంక్రాంతికి భోగిమంటలో వేసే భోగి పిడకలతో ఒక వ్యక్తి రికార్డు సృష్టించాడు. 3.2 లక్షల భోగి పిడకలతో నాలుగు కిలోమీటర్ల పొడవైన దండను రూపొందించడం ద్వారా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. వివరాలిలావున్నాయి... పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన అనుకుల ప్రసాద్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం కోసం భోగి పిడకల దండను రూపొందించాడు.

01/05/2016 - 07:08

హైదరాబాద్, జనవరి 4: ఆంధ్రప్రదేశ్ రాజధానిలో కీలకమైన ప్రభుత్వ భవనాలను ఎక్కడ నిర్మించాలనే అంశంపై తర్జన భర్జన జరుగుతోంది. మంగళగిరి సమీపంలోని అమరావతి టౌన్‌షిప్‌లో తాత్కాలిక సచివాలయం నిర్మించాలని ప్రభుత్వం తొలుత భావించింది. ఆ మేరకు నిధులను కూడా మంజూరు చేయడం జరిగింది. అయితే తాజాగా సచివాలయాన్ని తుళ్లూరు పరిధిలో నిర్మించాలని యోచిస్తోంది.

01/05/2016 - 07:08

హైదరాబాద్/నార్సింగ్, జనవరి 4: ఆర్థిక ఇబ్బందులు ఓ కుటుంబాన్ని బలి తీసుకున్నాయి. చిరువ్యాపారంతో జీవనం సాగిస్తున్న ఓ యువకుడు వ్యాపారంలో నష్టపోయాడు. ఉపాధి కోసం రెండు నెలలుగా చేసిన ప్రయత్నం ఫలించలేదు. జీవితంపై విరక్తితో భార్య, పిల్లలకు విషమిచ్చి, తాను ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందిన హృదయ విదారక సంఘటన పాతబస్తీలోని సీతారాంబాగ్‌లో చోటుచేసుకుంది.

01/05/2016 - 07:07

హైదరాబాద్, జనవరి 4: తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం కోసం సుమారు 41 వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రాష్ట్రంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సోమవారం ఆయన హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

01/05/2016 - 07:06

హైదరాబాద్, జనవరి 4: వంద యూనిట్ల వరకు విద్యుత్‌ను వినియోగించే గృహ వినియోగ దారుల బకాయిలను రద్దు చేస్తూ సోమవారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని వల్ల ప్రభుత్వంపై 52.42 కోట్ల రూపాయల భారం పడుతుంది. వంద యూనిట్ల పైగా వినియోగించే వినియోగదారుల బకాయిలు వాస్తవ విద్యుత్ చార్జీలు మాత్రమే చెల్లించాలి. సర్ చార్జి రద్దు చేశారు. మార్చి 31 వరకు చెల్లించాలి.

01/05/2016 - 07:05

హైదరాబాద్, జనవరి 4: విద్యుత్ పొదుపు, సమర్థవంతంగా విద్యుత్ వినియోగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలుస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

01/05/2016 - 07:05

హైదరాబాద్, జనవరి 4: జంట నగరాల్లో ఆన్‌లైన్ ఔషధాల విక్రయాలు యధేచ్ఛగా సాగుతున్నాయి. సబ్‌స్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వరాదని, ఆన్‌లైన్ ద్వారా ఔషధాల విక్రయాలు జరుపొద్దంటూ డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా జారీ చేసిన ఆదేశాలు బేఖాతరవుతున్నాయనే విమర్శలు సర్వత్రా వస్తున్నాయి.

01/05/2016 - 07:03

హైదరాబాద్, జనవరి 4: ఉన్నత విద్యారంగంలో బోధన విధానంలో మార్పురానిదే విద్యావ్యవస్థ తీరు తెన్నులు మారవని సెంచూరియన్ విశ్వవిద్యాలయం మేనేజింగ్ ట్రస్టీ ప్రొఫెసర్ డి.ఎన్ రావు వ్యాఖ్యానించారు. ప్రతి విద్యార్థిలో తొలి రోజు నుండే నైపుణ్యాలు, కౌశలాలు, సామర్థ్యాలను పెంపొందించాల్సి ఉంటుందని, అప్పుడే నిరుద్యోగాన్ని నివారించగలుగుతామని పేర్కొన్నారు.

Pages