S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/23/2015 - 07:01

విజయవాడ, డిసెంబర్ 22: రెండున్నర దశాబ్దాలు పైగా పుస్తక పఠనాభిలాషను పెంపొందిస్తూ పుస్తక పఠనావశ్యకతను తెలియజేసేందుకు క్రమం తప్పకుండా ఏటా నూతన సంవత్సరం ఆరంభంలో మొదటి 11 రోజులపాటు జరిగే విజయవాడ పుస్తక మహోత్సవం 2016 జనవరి 1న ప్రారంభం కానుంది.

12/23/2015 - 07:00

ఒంగోలు, డిసెంబర్ 22: ప్రకాశం జిల్లాలో నకిలీ కరెన్సీ నోట్లను చెలామణి చేస్తున్న ఎనిమిదిమంది ముఠా సభ్యులను మంగళవారం కందుకూరు పట్టణ పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్‌పి సిహెచ్ శ్రీకాంత్ వెల్లడించారు. మంగళవారం విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన శంకర్ ఈ నకలీ కరెన్సీ నోట్ల చెలామణిలో ప్రధాన నిందితుడని, అతను పరారీలో ఉన్నట్లు తెలిపారు.

12/23/2015 - 06:59

ిశాఖపట్నం, డిసెంబర్ 22: పరవస్తు పద్యపీఠం, గోకుల్‌చంద్ర, రాహుల్ చంద్రట్రస్ట్ సంయుక్త నిర్వహణలో విశాఖలో గత మూడు రోజులుగా జరుగుతున్న తెలుగు తిరునాళ్ళు కార్యక్రమం మంగళవారం ఘనంగా ముగిసింది. ‘తెలుగు పద్యం రాజనీతి’ అనే అంశంపై నగరానికి చెందిన ప్రముఖుల పద్యాలాపన, మహా సహస్రావధాని డాక్టర్ గరికపాటి నరసింహరావు టీకా తాత్పర్య వివరణలతో చివరిరోజు కార్యక్రమం ఆధ్యంతం ఆసక్తికరంగా సాగింది.

12/23/2015 - 06:54

విశాఖపట్నం, డిసెంబర్ 22: మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, ఆయన ప్రధాన అనుచరుడు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. కొణతాల తన క్యాడర్‌తో సమావేశం ఏర్పాటు చేసుకుని, టిడిపిలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేయడమే తరువాయి. ఆ సమావేశం కూడా ఈనెలాఖరులో ఉంటుందని గండి బాబ్జీ చెప్పారు.

12/23/2015 - 06:33

రేణిగుంట, డిసెంబర్ 22: కాల్‌మనీ వ్యవహారంతో రాష్ట్ర ప్రభుత్వం గట్టిచర్యలు చేపట్టడంతో చిత్తూరు జిల్లా రేణిగుంట పట్టణంలో స్థానిక రాజరాజేశ్వరి కాలనీ సమీపంలో కల్వర్టు కింద గుట్టలకొద్దీ మార్టుగేజు, ఖాళీ చెక్కులు, దస్తావేజులు, 100 రూపాయల ఖాళీ బాండ్లు దగ్ధం చేసిన సంఘటన మంగళవారం ఉదయం రేణిగుంటలో చోటుచేసుకుంది.

12/23/2015 - 06:33

హైదరాబాద్, డిసెంబర్ 22: ప్రపంచవ్యాప్తంగా వైద్య చికిత్సల్లో అమలుచేస్తన్న ఉత్తమ విధానాలను ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో ఉచితంగా అందించడానికి ఒక అంతర్జాతీయ బృందం ముందుకు వచ్చింది. దీనిని ప్రయోగాత్మకంగా అనంతపురం జిల్లాలో అమలుచేయాలని మధ్యాహ్నం సిఎం చంద్రబాబునాయుడు మెక్సికో బృందానికి సూచించారు. రాష్టశ్రాసనసభలో తన కార్యాలయంలో కలిసిన న్యూ మెక్సికో వర్శిటీ వైద్య నిపుణుల బృందంతో సిఎం మాట్లాడారు.

12/23/2015 - 06:31

హైదరాబాద్, డిసెంబర్ 22: తిరుమల తిరుపతి దేవస్థానంపై ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఐదోరోజైన మంగళవారం దుమారం చేలరెగింది.టిటిడి అధికారుల వ్యవహర శైలి ప్రజలకు, ప్రజాప్రతినిధులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తోందని అన్ని పార్టీల సభ్యులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు.

12/23/2015 - 06:30

హైదరాబాద్, డిసెంబర్ 22: వచ్చే ఏడాది మార్చి నాటికి పులిచింతల ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటించారు. మంగళవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఆయన బదులిస్తూ ఈ ప్రాజెక్టు నిర్మాణానికి తాజా అంచనా ప్రకారం రూ.1818.17 కోట్లు ఖర్చవుతుందన్నారు. ఇంతవరకు 97 శాతం పనులు పూర్తయ్యాయన్నారు.

12/23/2015 - 06:30

హైదరాబాద్, డిసెంబర్ 22:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలు ఉన్నాయని, కాని వివిధ శాఖల నుంచి వివరాలు అందాల్సి ఉందని ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభకు తెలిపారు. ప్రస్తుతానికి విద్య, పోలీసు తదితర శాఖల్లో 12,179 ఖాళీ పోస్టుల నియామకానికి అనుమతి ఇచ్చామన్నారు. ఏపిపిఎస్‌సి, డిఎస్‌సి ద్వారా నేరు నియామకం కోసం మరి కొన్ని ఖాళీ ఉద్యోగాల భర్తీ ప్రతిపాదన పరిశీలనలో ఉన్నాయన్నారు.

12/23/2015 - 06:29

హైదరాబాద్, డిసెంబర్ 22: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద రావుపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అసెంబ్లీలో తీర్మానం ఆమోదించుకునేంత బలం లేదని తెలిసినా ఆ పార్టీ ధైర్యం చేసింది. అందునా అసెంబ్లీ సమావేశాలు మంగళవారంతో నిరవధికంగా వాయిదా పడ్డాయి.

Pages