S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/04/2016 - 16:50

హైదరాబాద్ : ఖైరతాబాద్‌లోని ఇందిరానగర్‌లో డబుల్ బెడ్‌రూమ్ పథకానికి సోమవారంనాడు శంకుస్థాపన జరిగింది. కేంద్రమంత్రి దత్తాత్రేయ, మంత్రులు తలసాని, కేటీఆర్, ఉపముఖ్యమంత్రి మహమూద్ తదితరులు హాజరయ్యారు.

01/04/2016 - 16:49

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోకి ఇద్దరు జైష్ మహ్మద్ ఉగ్రవాదులు ప్రవేశించారని వదంతులు వెలువడ్డాయి. పోలీసులు ఈ వదంతులను కొట్టిపారేశారు. ఉగ్రదాడుల నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు విస్తత్ర తనిఖీలు నిర్వహించారు.

01/04/2016 - 16:38

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ లోక్‌సత్తా కమిటీ కార్యదర్శి గండవరపు వేణుగోపాలరావు సోమవారం టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

01/04/2016 - 14:08

రాయవరం : మరుగుదొడ్లు నాగరిక ప్రపంచానికి చిహ్నమని... అందువల్లే అన్ని గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మించడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ప్రకాశం జిల్లా రాయవరంలో నిర్వహించిన ‘జన్మభూమి-మావూరు’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధికి అందరూ చేయూతనివ్వాలని సీఎం కోరారు.

01/04/2016 - 13:21

మహానంది: కర్నూలు జిల్లా మహానందిలోని శ్రీ కామేశ్వరి దేవి సహిత మహా నందీశ్వరుడి ఆలయాన్ని తెలుగు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ సోమవారం ఉదయం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి చీర బహుకరించారు.

01/04/2016 - 12:51

హైదరాబాద్: తెలుగురాష్ట్రాల్లో రైతు ఆత్మహత్యలపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. రైతు ఆత్మహత్యల నివారణకు పూర్తిస్థాయి చర్యలు తసుకోవాలని, ఆరు వారాల్లో ఆత్మహత్యలపై సమగ్ర నివేదిక అందించాలని ఇరు రాష్ట్రాలకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

01/04/2016 - 08:48

విజయవాడ (ఇంద్రకీలాద్రి), జనవరి 3: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న ఆదిపరాశక్తి, శ్రీ జగన్మాత శ్రీకనకదుర్గమ్మ సన్నిధిలో ఆదివారం వేకువ జామున సుమారు లక్ష మంది భవానీలు భక్తిశ్రద్ధలతో దీక్ష విరమించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దీక్ష స్వీకరించిన భవానీలు 41 రోజుల పాటు నియమనిష్ఠలతో ఆచరించి శనివారం రాత్రి నగరానికి చేరుకున్నారు.

01/04/2016 - 08:46

అనకాపల్లిరూరల్, జనవరి 3: సినీహీరో పవన్‌కల్యాణ్ చొరవతోనే తమకు మంత్రి పదవులు వచ్చాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పి. మాణిక్యాలరావు స్పష్టం చేశారు. స్థానిక సత్యనారాయణమూర్తి దేవస్థానం వద్ద ఆదివారం జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడారు. టిడిపి విజయానికి పవన్‌కల్యాణ్ ఎంతో తోడ్పాటు అందజేశారని పేర్కొన్నారు.

01/04/2016 - 08:45

హిందూపురం, జనవరి 3: ఆంధ్ర, కర్నాటక రాష్ట్రాల నడుమ ఆర్టీసీ బస్సుల పర్మిట్ల రగడ చినికి చినికి గాలివానలా తయారైంది. అంతర్రాష్ట్ర పర్మిట్ల కాలపరిమితి మునిగినా రెన్యూవల్ చేసుకోకుండా కెఎస్‌ఆర్‌టిసి బస్సులను నడపడం పసిగట్టిన అనంతపురం ఆర్డీఏ అధికారులు కర్నాటక అధికారులకు సూచించారు. అయితీ దీన్ని అవమానంగా భావించిన కర్నాటక అధికారులను ఆంధ్ర బస్సులను సరిహద్దులో నిలివేస్తున్నారు.

01/04/2016 - 08:44

విశాఖపట్నం, జనవరి 3: రాష్ట్రంలో నూతన ఇసుక విధానాన్ని వచ్చే నెల 15 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్టు ఆర్థిక శాఖ మంత్రి, ఇసుక విధానంపై ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉపసంఘం అధ్యక్షుడు యనమల రామకృష్ణుడు వెల్లడించారు.

Pages