S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/04/2016 - 07:01

కలిగిరి, జనవరి 3: నెల్లూరు జిల్లాలో 170 కిలోమీటర్ల తీరప్రాంతం ఉందని, భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయని వీటితో సింహపురిని సింగపూర్‌గా తయారుచేస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సింగపూర్‌లో నీరు, మట్టి లేవని, వారు సంకల్పబలంతో వాటిని సృష్టించుకోగలిగారని అన్నారు. వనరులు ఉన్న సింహపురిని తయారుచేయడం పెద్ద విషయమేమీ కాదన్నారు.

01/04/2016 - 06:58

సూళ్లూరుపేట, జనవరి 3: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉగ్రవాదులు ప్రవేశించారని, దీంతో ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష కేంద్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. షార్‌లోని మొదటి, రెండో ప్రధాన గేట్ల వద్ద లోపలికి వాహనాలతోపాటు, వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీచేసి పంపుతున్నారు.

01/04/2016 - 06:51

హైదరాబాద్, జనవరి 3: ఉన్నత చదువులకు పెట్టింది పేరుగా భాసిల్లుతున్న హైదరాబాద్‌లోని సెంట్రల్ వర్శిటీలో దారుణం జరిగింది. వందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వర్శిటీ ఆవరణలోకి చొరబడిన ఓ జింకను ఓ ఉద్యోగి కాల్చి చంపి, హాయిగా మాంసం వండుకుని ఆరగించాడు. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో గత కొంతకాలంగా జింకల వేట యథేచ్ఛగా సాగుతున్నట్టు అధికారులకు ఫిర్యాదు వచ్చింది. దీంతో అధికారులు అప్రమత్తమై నిఘా పెట్టారు.

01/04/2016 - 06:46

హైదరాబాద్, జనవరి 3 : దేవాలయాల నిర్వహణకు సంబంధించి ‘్ధర్మిక పరిషత్’ ఏర్పాటుపై ఉభయ రాష్ట్రాల్లో ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేస్తారా లేదా అన్న చర్చ ప్రజల్లో ప్రారంభమైంది. ధార్మిక పరిషత్ ఏర్పాటు అయినట్టే అన్న భావన ఉభయ ప్రభుత్వాలు గత ఏడాది నుండి కల్పిస్తున్నాయి. రాష్ట్ర విభజన జరిగి ఏడాదిన్నర గడిచినప్పటికీ అధికారికంగా ఇందుకు సంబంధించి ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.

01/03/2016 - 08:22

జలాశయాల్లో తగ్గుతున్న నీటిమట్టం
జూరాలలో కేవలం 6 టిఎంసిలే
శ్రీశైలం ప్రాజెక్టులో 210 టిఎంసిలకుగాను 51 టిఎంసిల నీటిమట్టం
తాగునీటి అవసరాల కోసం మరో 20 టిఎంసిలకు కృష్ణా రివర్
బోర్డుకు ప్రతిపాదనలు

01/03/2016 - 08:20

కోర్టునుంచి అనుమతి తీసుకోండి
గ్రేటర్ రిజర్వేషన్లు అందలేదు
ఎన్నికల సంఘానికి విపక్షాల విన్నపం
రేపు కోర్టులో పిటిషన్: మర్రి

01/03/2016 - 08:18

సికింద్రాబాద్, జనవరి 2: తెలుగుదేశం పార్టీ గ్రేటర్ సమావేశంలో ఎన్టీఆర్ ఫొటో విషయంలో రభస జరిగింది. వేదిక వెనుక ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఫొటో ఏర్పాటు చేయకపోవడంపట్ల తెలుగు యువత నాయకుడు గంగాధర్‌గౌడ్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో గొడవకు దారితీసింది.

01/03/2016 - 08:12

వరదయ్యపాళెం/తడ, జనవరి 2 : చిత్తూరు,నెల్లూరు జిల్లాల సరిహద్దులో ఉన్న శ్రీసిటీ పారిశ్రామిక వాడలోని ఆల్ స్ట్రామ్ ట్రాన్స్‌పోర్ట్ పరిశ్రమలో కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్ మెట్రో ప్రాజెక్టు కోసం తయారు చేసిన రైల్వే కోచ్‌లను శనివారం ప్రత్యేక వాహనాల్లో తరలించారు. ఈ వాహనాలను కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు జెండా ఊపి ప్రారంభించారు.

01/03/2016 - 08:06

విశాఖ ఉత్సవ్‌లో సిఎం చంద్రబాబు ఎస్పీ బాలుకు స్వరకళా సామ్రాట్ బిరుదు ప్రదానం

01/03/2016 - 08:04

విజయవాడ , జనవరి 2: అమ్మవారి దీక్షల విరమణకు భవానీలకు కేవలం రెండురోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో శనివారం సాయంత్రం ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి పెద్దసంఖ్యలో భవానీలు ఇంద్రకీలాద్రికి పోటెత్తారు. ఉదయం భవానీల సంఖ్య స్వల్పంగా ఉన్నప్పటికీ సాయంత్రం 5గంటల నుండి వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది రాక ప్రారంభమైంది. రాత్రి 10.30 గంటల సమయానికి విపరీతమైన రద్దీ ఏర్పడింది.

Pages