S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/01/2016 - 06:13

సరికొత్త ఆశల చిగుళ్లతో 2016 వచ్చేసింది. అంబరాన్ని తాకే సంబరాల స్వాగతాన్ని అందుకుంది. నూతన సంవత్సర ఆగమనం సందర్భంగా పాఠకులు, ప్రకటనకర్తలు, ఏజెంట్లకు శుభాకాంక్షలు.
-ఎడిటర్
(చిత్రం)పూలమొక్కలకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన కడియం నర్సరీలో చూడముచ్చటైన 2016 స్వాగత తోరణం

12/31/2015 - 16:57

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ పరిధిలోని నివాస గృహాల యజమానులకు సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రూ.1,200, ఆలోపు వార్షిక ఆస్తి పన్ను చెల్లిస్తున్న పేద, మధ్య తరగతి నివాస గృహాల యజమానుల నుంచి ఇకపై రూ.101 మాత్రమే కడితే సరిపోతుంది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ గడువును మరో నెల రోజుల పాటు ప్రభుత్వం పొడిగించింది.

12/31/2015 - 16:16

హైదరాబాద్ : నూతన సంవత్సర కానుకగా కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ వరాలు ప్రకటించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతే కాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని సర్కార్ నిర్ణయించింది. దీంతో 50 వేల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. డీఎస్సీ మార్గదర్శకాలు సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్...అధికారులను ఆదేశించారు.

12/31/2015 - 13:54

హైదరాబాద్ : ఉప్పల్ వెలిగుట్టలో మంచినీటి పైప్‌లైన్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో తెరాసా, బిజెపి, తెదెపా కార్యకర్తల మధ్య తోపులాట జరిగి ఘర్షణకు దారితీసింది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్రమంత్రి దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, పద్మారావు, స్థానిక ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్‌ తదితరులు హాజరయ్యారు.

12/31/2015 - 13:53

హైదరాబాద్‌: మంత్రులతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశమయ్యారు. ఎల్లుండి జరగనున్న మంత్రివర్గ సమావేశం అజెండా, గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రజలకు వరాలు తదితర అంశాలపై మంత్రులతో చర్చించారు.

12/31/2015 - 13:52

హైదరాబాద్‌: అనంతపురం జిల్లా డి.హిరేహాళ్‌ వద్ద టిప్పర్‌ లారీ కారును ఢీకొంది. ఈ సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు అక్కడిక్కడే మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు కర్ణాటకలోని కలబుర్గి జైలు వార్డెన్‌ పురుషోత్తమ్‌ దంపతులుగా గుర్తించారు.

12/31/2015 - 13:48

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రధాని మోదీ లేఖ రాశారు. అయుత చండీయాగం నిర్వహించటం సంతోషకరంగా ఉందని పేర్కొన్నారు. ఈ యాగం వల్ల ఆధ్యాత్మిక సంక్షేమం, లోక కళ్యాణం, విశ్వశాంతి చేకూరగలదని విశ్వసించారు.

12/31/2015 - 13:46

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ ఆస్తులను ఫిబ్రవరిలో వేలం వేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. గురువారంనాడు అగ్రిగోల్డ్ కేసు విచారణ సందర్భంగా ఆరు ఆస్తులను వేలం వేయాల్సిందిగా ఆదేశించింది. నిందితులను ఎందుకు అరెస్టు చేయటంలేదని ప్రశ్నించగా విచారణకు సహకరిస్తున్నారని సీఐడీ తెలిపింది.

12/31/2015 - 13:46

హైదరాబాద్ : నగరంలో మత్తు ఇంజెక్షన్లు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని సంతోష్‌నగర్‌లో విక్రయిస్తుండగా వీరిని పట్టుకున్నారు. పాతబస్తీ నుంచి ఈ ఇంజెక్షన్లు తెచ్చి న్యూ ఇయర్ సందర్భంగా విద్యార్థులకు విక్రయిస్తున్నారు. నలుగురుని అదుపులోకి తీసుకుని 160 ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.

12/31/2015 - 08:16

అనంతపురం కల్చరల్, డిసెంబర్ 30: నగరంలో 2015కు వీడ్కోలు పలికి, న్యూ ఇయర్ 2016కు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న సందర్భంగా నగరం సందడిగా కనిపిస్తోంది. న్యూ ఇయర్ వేడుకలను నిర్వహించేందుకు వివిధ కళాశాలలు, ప్రభుత్వ, ప్రైవేట్‌రంగాలకు చెందిన సంస్థలు తగిన ఏర్పాట్లతో సిద్ధమవుతున్నాయి.

Pages