S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/31/2015 - 08:08

హైదరాబాద్, డిసెంబర్ 30: జిహెచ్‌ఎంసి ఎన్నికల విధుల నిమిత్తం నియమితులై, శిక్షణ కార్యక్రమానికి తరుచూ గైర్హాజరవుతున్న 6511 మంది సిబ్బందిపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ నెల 28,29, 30 తేదీల్లో మొత్తం 20వేల 836 మంది ఉద్యోగులకు ఎన్నికల విధులపై శిక్షణ కార్యక్రమాలకు హజరుకావల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి.

12/31/2015 - 08:08

హైదరాబాద్, డిసెంబర్ 30: తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక వౌలిక వసతుల సంస్థ (టిఎస్‌ఐఐసి) మేనేజింగ్ డైరెక్టర్ ఇవి నరసింహారెడ్డి, ఆయన బృందం ‘ఉద్యోగ రత్న’ అవార్డు అందుకోవడం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అభినందనలు తెలియజేశారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎకనమిక్ స్టడీస్, న్యూఢిల్లీ వారి నుంచి ఢిల్లీలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును నరసింహారెడ్డి స్వీకరించారు.

12/31/2015 - 08:02

విజయవాడ, డిసెంబర్ 30: రైతాంగానికి సాగు, తాగునీరు అందించేందుకు చేపట్టిన నదుల అనుసంధానం, ప్రాజెక్టుల నిర్మాణం పనులు శరవేగంగా జరగటం శుభపరిణామమని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా అన్నారు.

12/31/2015 - 08:02

హైదరాబాద్, డిసెంబర్ 30: ఆంద్రప్రదేశ్‌లో పౌరసరఫరాల వ్యవస్థను అవకతవకలకు ఆస్కారం లేకుండా ప్రజాపంపిణీ వ్యవస్థలోని ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్స్ (ఈపోస్) వద్ద నుంచి పూర్తి స్థాయి పర్యవేక్షణ చేసేందుకు గాను వివిధ స్థాయిల్లో కమిటీలను నియమిస్తూ ప్రభుత్వం జివో జారీ చేసింది. గ్రామపంచాయతీ, మున్సిపల్ వార్డు, మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ స్థాయిలో పర్యవేక్షక కమిటీలను ప్రభుత్వం నియమించింది.

12/31/2015 - 07:47

విజయవాడ (ఇంద్రకీలాద్రి), డిసెంబర్ 30: సంసార దుఃఖ సాగర తరుణోపాయం కోసం 41రోజులుపాటు అత్యంత కఠిన నియమ నిష్ఠలను పాటించి భవానీలు గురువారం ఉదయం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో దీక్ష విరమణ చేయనున్నారు.

12/31/2015 - 07:47

రాజమండ్రి, డిసెంబర్ 30: గనుల శాఖ ఆధ్వర్యంలో టెండర్లు పిలవటం ద్వారా ఇసుక రీచ్‌లకు వేలం విధానాన్ని ఫిబ్రవరి 1నుండి అమలుచేయాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించిన నేపథ్యంలో అందరి దృష్టి పాత ఇసుక విధానంపై పడింది. ఈ విధానంలో రాష్ట్రప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం సక్రమంగా వసూలుకానప్పటికీ, వినియోగదారులు మాత్రం ఇప్పుడున్న ధర కన్నా తక్కువకే ఇసుకను కొనుగోలు చేయగలిగారు.

12/31/2015 - 07:45

తిరుమల, డిసెంబర్ 30 : శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు ఇంటర్నెట్‌లో 300 రూపాయల టిక్కెట్లను బుక్ చేసుకునే ప్రక్రియను మరింత సులభతరం చేసినట్టు టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్టర్ డి సాంబశివరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 300 రూపాయల టిక్కెట్లు బుక్ చేసుకునేందుకు ఆన్‌లైన్‌లో ఫోటో అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేకుండా మినహాయింపు ఇచ్చినట్టు వెల్లడించారు.

12/31/2015 - 07:36

హైదరాబాద్, డిసెంబర్ 30: దేశంలోని 22 రాష్ట్రాల రాజధాని నగరాలు, పది లక్షల కన్నా ఎక్కువ జనాభా కల్గిన మరో 53 నగరాల్లో స్వచ్ఛ భారత్‌పై జనవరి 5వ తేదీ నుంచి ప్రత్యేక సర్వే నిర్వహించనున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, స్వచ్ఛ భారత్ మిషన్ సంయుక్త కార్యదర్శి శుభా ఠాకూర్ వెల్లడించారు. ఈ మేరకు ఆమె బుధవారం జిహెచ్‌ఎంసిని సందర్శించి, వివిధ ప్రాంతాల్లో బల్దియా చేపడుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.

12/31/2015 - 07:35

హైదరాబాద్, డిసెంబర్ 30: తెలంగాణ రాష్ట్రంలో సెట్ టాప్ బాక్స్‌ల ఏర్పాటుకు రెండు నెలల గడువు పెంచుతూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతవరకు ఏ ఒక్కరికీ ప్రసారంలో అంతరాయం లేకుండా చూడాలని సంబంధిత అధికారులను హైకోర్టు జడ్జి జస్టిస్ అఫ్జుల్‌పుర్కర్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ఎంఎస్‌ఓల ఫెడరేషన్ దాఖలు చేసిన పిల్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది.

12/31/2015 - 07:35

హైదరాబాద్/బేగంపేట, డిసెంబర్ 30: తెలుగు రాష్ట్రాలలో ఆదరణ, పర్యవేక్షణ కరవై కళాహీనంగా మారిన దేవాలయాలతోపాటు నిత్య ధూప దీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాల పునరుద్ధరణకు పుష్పగిరి పీఠం శ్రీకారం చుట్టనున్నట్టు పీఠాధిపతి విద్యాశంకర భారతి మహాస్వామి తెలిపారు.

Pages