S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/24/2015 - 05:01

హైదరాబాద్, డిసెంబర్ 23: ఆంధ్ర అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావుపై అవిశ్వాసం తీర్మానం నోటీసులను వైకాపా ఎమ్మెల్యేలు బుధవారం అసెంబ్లీ కార్యదర్శికి అందచేశారు. ఈ నోటీసును వైకాపా శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యదర్శికి అందచేశారు.

12/24/2015 - 04:53

నూజివీడు, డిసెంబర్ 23: రాష్ట్రంలో నూతనంగా వస్తున్న ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో చదువుకోవాలనే ఆసక్తి ఉన్న పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వెల్లడించారు. ప్రైవేటు రంగంలో విశ్వవిద్యాలయాలను స్వాగతిస్తూ శాసనసభలో బిల్లు ఆమోదించామని, దీనికి అనుగుణంగా దేశంలో పేరొందిన పది ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఎపికి వస్తాయన్నారు.

12/23/2015 - 07:54

హైదరాబాద్, డిసెంబర్ 22: తెలుగు రాష్ట్రాలలోని ప్రతి పాఠశాలలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి పిల్లల్లో బాల్యం నుంచే పఠనాసక్తిని పెంపొందింపజేయాలని గవర్నర్ ఇఎల్‌ఎన్ నరసింహన్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచే పిల్లల్లో పఠనాసక్తి పెరిగే విధంగా పుస్తకాలను చదివించాలని సూచించారు.

12/23/2015 - 07:37

హైదరాబాద్, డిసెంబర్ 22: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ (ఉభయ సభలు) శీతాకాల సమావేశాలు మంగళవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ నెల 17న ఉభయ సభలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో ఐదు రోజుల్లో 26 గంటల ఎనిమిది నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చ జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు, కాల్‌మనీ, నీరు-ప్రగతి, బాక్సైట్ నిక్షేపాల తవ్వకాలు, ఇసుక అక్రమ రవాణాపై ప్రభుత్వం ప్రకటన చేసింది.

12/23/2015 - 07:34

హైదరాబాద్, డిసెంబర్ 22: చదువుకోవాలని వెడితే జీవితంలో మరచిపోలేని చేదు అనుభవాలను మూటగట్టుకుని...వెళ్లిన రెండు మూడు రోజుల్లోనే తిరిగి వచ్చారు కొందరు తెలుగు విద్యార్థులు. అమెరికాలో తమకు ఎదురైన భయానక అనుభవాలను తలచుకోవడానికి కూడా వారు భయంతో వణికి పోతున్నారంటే టార్చర్ ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉగ్రవాదులనే అనుమానంతో తమను చీకటి గదిలో బంధించి, తుపాకీ చూపించి బెదిరించారని వారు వాపోయారు.

12/23/2015 - 07:33

హైదరాబాద్, డిసెంబర్ 22: హైదరాబాద్ మెట్రోరైలు పనులు మరో అడుగు ముందుకు పడ్డాయి. సికిందరాబాద్ జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి ఆర్టీసి క్రాస్‌రోడ్డు, చిక్కడపల్లి, సుల్తాన్‌బజార్‌ల మీదుగా నిర్మించనున్న కారిడార్‌లో భాగంగా సుల్తాన్‌బజార్‌లో అలైన్‌మెంట్ మార్చాలంటూ డిమాండ్లు విన్పించిన సంగతి తెలిసిందే.

12/23/2015 - 07:33

హైదరాబాద్, డిసెంబర్ 22: ముఖ్యమంత్రి చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలను తనపైన ప్రయోగిస్తే అంతుచూసే వరకు ఊరుకోను అని ఏడాదిపాటు శాసనసభ నుంచి సస్పెండైన వైకాపా ఎమ్మెల్యే ఆర్‌కె రోజా అన్నారు. మంగళవారం ఆమె లోటస్‌పాండ్‌లో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో మహిళలంతా కంతతడి పెడుతున్నారని, ఇది చంద్రబాబు వంశానికి, కుటుంబానికి మంచిది కాదన్నారు. ఏపి అసెంబ్లీ ఎన్టీఆర్ భవన్‌లా తయారైందన్నారు.

12/23/2015 - 07:32

హైదరాబాద్, డిసెంబర్ 22: ఆంధ్రప్రదేశ్ 14వ శాసనసభ పూర్తికాలం పాటు శాసనసభ్యురాలు రోజాను సస్పెండ్ చేయాలని, ఆమెపై కఠిన చర్యలు చేపట్టాలని టిడిపి ఎమ్మెల్యేలు మంగళవారం నాడు శాసనసభలో డిమాండ్ చేశారు. జీరో అవర్ కింద టిడిపి ఎమ్మెల్యేలు రోజా వ్యవహార సరళిపై ప్రస్తావన తెస్తూ, ఆమెపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదుచేయాలని, పూర్తికాలం సభ నుండి బషిష్కరించాలని, మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని కోరారు.

12/23/2015 - 07:30

హైదరాబాద్, డిసెంబర్ 22: ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావుపై అవిశ్వాసతీర్మానం ఇవ్వాలని ప్రతిపక్ష పార్టీ వైకాపా నిర్ణయించింది. స్పీకర్ శాసనసభలో నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని, అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వైకాపా శాసనసభాపక్ష సమావేశం తీర్మానించింది. మంగళవారం ఇక్కడ లోటస్‌పాండ్ కార్యాలయంలో వైకాపా శాసనసభాపక్ష సమావేశం జరిగింది.

12/23/2015 - 07:59

రామచంద్రపురం, డిసెంబర్ 22: పంచారామ క్షేత్రం ద్రాక్షారామలో నిర్వహిస్తున్న అతిరుద్రం మహాయజ్ఞం మూడో రోజైన మంగళవారం వైభవంగా సాగింది. సంకల్పాలు నిత్యపారాయణలు, ఏకాదశ రుద్రాభిషేకాలు, సూర్య నమస్కారాలు జరిగాయి. గౌరీశంకర కలశారాధనతో ప్రారంభమైన ఈ కార్యక్రమాలు గురువందనం, వేదపారాయణం, గురు ప్రార్ధన, మహాన్యాసం, రుద్రాభిషేకం, వసోర్ధార, మహామంగళ హారతి కార్యక్రమాలు జరిగాయి.

Pages