S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/15/2015 - 03:28

గుంటూరు, డిసెంబర్ 14: తెలంగాణలోని తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించతలపెట్టిన అయుత చండీయాగానికి తప్పకుండా రావాలని ఆంధ్ర సిఎం చంద్రబాబును తెలంగాణ సిఎం కెసిఆర్ ఆహ్వానించారు. యాగానికి హాజరవుతానని చంద్రబాబు కెసిఆర్‌కు చెప్పారు. బాబుకు ఆహ్వానపత్రం అందించేందుకు సోమవారం స్వయంగా కెసిఆర్ విజయవాడ వచ్చారు.

12/15/2015 - 03:26

విజయవాడ, డిసెంబర్ 14: రాష్ట్రంలో ప్రస్తుతంవున్న వ్యవసాయ పంపుసెట్ల స్థానంలో మరింత నాణ్యత, సామర్థ్యంతో పనిచేసే కొత్త పంపుసెట్లు అమర్చనున్నట్టు సిఎం చంద్రబాబు చెప్పారు. కొత్త పంపుసెట్ల ద్వారా విద్యుత్ ఆదా కావడంతోపాటు నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవచ్చన్నారు.

12/15/2015 - 03:22

విజయవాడ, డిసెంబర్ 14: నూతనంగా ఏర్పాటైన రాజధాని ప్రాంతంలో ఇటీవల ఒకదాని వెంట ఒకటిగా వెలుగులోకొస్తున్న అకృత్యాల పట్ల సిఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. రెండురోజులు జరిగే కలెక్టర్ల సమావేశం సోమవారం ఉదయం నగరంలో ప్రారంభమైంది. వివిధ పథకాలపై సమీక్ష నిర్వహించిన అనంతరం చివరిగా పోలీసు శాఖ పనితీరును ఆయన అన్యాపదేశంగా ప్రస్తావించారు.

12/15/2015 - 03:17

సూళ్లూరుపేట, నవంబర్ 14: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో వాణిజ్య రంగ ప్రయోగానికి సిద్ధమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ నుండి 16న చేపట్టబోయే పిఎస్‌ఎల్‌వి-సి 29 రాకెట్ ప్రయోగానికి శాస్తవ్రేత్తలు సర్వం సిద్ధం చేశారు. ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ సోమవారం ఉదయం 7గంటలకు ప్రారంభమై నిర్విఘ్నంగా కొనసాగుతోంది.

12/15/2015 - 03:15

చిత్తూరు, డిసెంబర్ 14: చిత్తూరు నగర మేయర్ దంపతుల హత్యకు పథకం రచించింది, హత్య చేసింది తానేనని చంద్రశేఖర్ అలియాస్ చింటూ ఒప్పుకున్నట్లు జిల్లా ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ వెల్లడించారు. సోమవారం ఎస్పీ తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

12/15/2015 - 03:14

హైదరాబాద్, డిసెంబర్ 14: కేంద్రం పేదరిక నిర్మూలన, నీటి పారుదల, విద్యుత్ తదితర అంశాలపై ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్సులతో ఏపీలోని ఏడు మిషన్లు సమన్వయపర్చి పనిచేయడం ద్వారా పేదరికంలేని రాష్ట్రంగా ఆంధ్రను తీర్చిదిద్దాలని సిఎం చంద్రబాబు సూచించారు. జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షలో ఏడు మిషన్ల వ్యవహారాన్ని ఆయన ప్రస్తావించారు.

12/15/2015 - 03:14

హైదరాబాద్, డిసెంబర్ 14: ఆంధ్రలో భూ రికార్డులన్నీ ఆన్‌లైన్ చేయాలని, వ్యవహారాలన్నీ ఆన్‌లైన్‌లోనే జరగాలని సిఎం చంద్రబాబు ఆదేశించారు. సర్ట్ఫికెట్లు సైతం ఆన్‌లైన్‌లో జారీచేస్తే పేదలు ఇబ్బందులు లేకుండా కార్యకలాపాలు కొనసాగిస్తారని అన్నారు. భూ రికార్డులను టెలిఫోన్, ఆధార్ నెంబర్లతో అనుసంధానించాలని, మీ ఇంటికి మీ భూమి రికార్డుల్లో లోపాలు సరిదిద్దాలని సూచించారు.

12/14/2015 - 18:22

హైదరాబాద్ : నల్గొండ జిల్లా చౌటుప్పల్ శ్రీని రసాయన పరిశ్రమలో మంటలు చోటుచేసుకున్నాయి. రియాక్టర్ పేలటంతో ఈ ప్రమాదం సంభవించింది. దట్టంగా పొగలు అలుముకున్నాయి.

12/14/2015 - 18:21

శ్రీనగర్ : ఆహారభద్రత బిల్లుకు వ్యతిరేకంగా జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పోలీసులపై ఆందోళనకారులు రాళ్లురువ్వారు.

12/14/2015 - 18:20

హైదరాబాద్ : లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో జీహెచ్‌ఎంసీ అసిస్టెంట్ ప్లానింగ్ కమిషనర్ చిక్కాడు. నగరంలోని ఎల్బీ నగర్‌లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించగా, రామచంద్ర అనే ఉద్యోగి రూ.15వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.

Pages