S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/14/2015 - 08:41

నెల్లూరు, డిసెంబర్ 13: రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ సర్వే నెంబరు 994 ప్రాంతంలోని యనమలదినె్న కాలువను ఆక్రమించి మెడికల్ కాలేజీని నిర్మించారని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ తీవ్రంగా విమర్శించారు. ఆదివారం ఆయన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డితో కలసి మీడియా ప్రతినిధులను వెంటబెట్టుకొని చింతారెడ్డిపాళెం వద్దనున్న యనమలదినె్న కాలువ వద్దకు తీసుకువెళ్లారు.

12/14/2015 - 08:40

కడప, డిసెంబర్ 13: కాల్‌మనీ పేరిట విజయవాడలో మహిళలను లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన వెలుగుచూడగా కడప జిల్లాలో సైతం ఇటువంటి దందాలు బయల్పడుతున్నాయి. వైఎస్సార్ కడప జిల్లాలో సుమారు వెయ్యి మంది వరకూ చోటా మోటా నాయకులు తమ గాడ్ ఫాదర్లను అడ్డుపెట్టుకుని యథేచ్చగా కాల్‌మనీ దందాను కొనసాగిస్తున్నారు. రాజకీయనేతల అండదండలు ఉండటంతో వీరి జోలికి రావడానికి పోలీసు యంత్రాంగం సైతం జంకుతోంది.

12/14/2015 - 08:31

తిరుచానూరు, డిసెంబర్ 13: శ్రీహరిని, అమ్మవారిని నిత్యం సేవించే దాసుడు, రక్షణ బలుడైన పక్షీంద్రుడు ఆదివారం రాత్రి తనకిష్ణుడైన గరుడ వాహనంపై శ్రీ పద్మావతీ అమ్మవారి విహారం భక్తులకు నయనానందం కలిగించింది. బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవకు ఎంతో విశిష్టత ఉంది. గరుత్మంతుని రెండు రెక్కలు జ్ఞాన, వైరాగ్యాలకు నిదర్శనాలు. మానవుడి నిత్యజీవితాల్లో చోటుచేసుకునే పలు కష్ట సుఖాలను తొలగించేదే గరుడ మంత్రం.

12/14/2015 - 08:31

విజయవాడ, డిసెంబర్ 13: దివంగత నందమూరి తారక రామారావు మానస పుత్రిక పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంతో పాటు బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఆశాదీపమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాలను రాష్ట్రంలో ఏర్పాటు చేయడంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, అలాగే ఉన్నతాధికారులు ఎంతో ఉదాశీనం, నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారంటూ రాజ్యసభ మాజీ సభ్యుడు, హిందీ అకాడమీ మాజీ చైర్మన్

12/14/2015 - 06:52

హైదరాబాద్, డిసెంబర్ 13: కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల వరప్రదాయిని పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో రెండు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రాజెక్టుకు ఇంతవరకు ప్రభుత్వం ఖర్చుపెట్టిన రూ.2200 కోట్లను తిరిగి ఇచ్చేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. కానీ ఈ నిధులను రాష్ట్రానికి విడుదల చేయకుండా ప్రాజెక్టుకే రాష్ట్రం వాటాకింద ఖర్చుపెట్టి సర్దుబాటు చేస్తామని సంకేతాలు పంపింది.

12/14/2015 - 06:50

హైదరాబాద్, డిసెంబర్ 13: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు బృందం సోమవారం మధ్యాహ్నాం బేగంపేట విమానాశ్రయం నుంచి విజయవాడ వెళ్తోంది. అయుత చండీహోమంలో పాల్గొనాల్సిందిగా ఆంధ్ర సిఎం చంద్రబాబును ఆహ్వానించేందుకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు సిఎంలు చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో గంటన్నరపాటు చర్చలు జరపుతారు.

12/14/2015 - 06:48

గుంటూరు, డిసెంబర్ 13: నీటి ప్రవాహాలు ఉండే ప్రదేశంలో భవన నిర్మాణాలకు అధికారులు ఎంత ఒత్తిడితెచ్చినా అనుమతులు ఇవ్వొద్దని, వారికి అవసరమైన పక్షంలో అండగా నిలబడతానని గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా నరసరావుపేట పురపాలక శాఖ శతాబ్ది ఉత్సవాలకు ఆదివారం హాజరైన గవర్నర్ నరసింహన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

12/14/2015 - 06:46

విజయవాడ (క్రైం), డిసెంబర్ 13: రాష్టవ్య్రాప్తంగా సంచలనం సృష్టించిన బెజవాడ కాల్‌మనీ అకృత్యాల కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు విజయవాడ సిపి గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. నిందితుల అరెస్టుకు సంబంధించి పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లున్నట్టు జరుగుతోన్న ప్రచారాన్ని ఖండించారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు గ్యాంగ్‌తో ప్రమేయం ఉన్నట్టు విచారణలో తేలితే వదిలేదిలేదని సీపీ స్పష్టం చేశారు.

12/14/2015 - 06:36

సూళ్లూరుపేట, డిసెంబర్ 13: భాతర అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తలపెట్టిన పిఎస్‌ఎల్‌వి- సి 29 రాకెట్ ప్రయోగానికి ఏర్పాట్లను శాస్తవ్రేత్తలు పూర్తిచేశారు. ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభంకానుంది. నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ నుంచి 16న సాయంత్రం 6 గంటలకు పిఎస్‌ఎల్‌వి-సి 29 రాకెట్ ప్రయోగం జరగనుంది.

12/14/2015 - 06:32

విజయవాడ, డిసెంబర్ 13: ఆంధ్రలో సాలీనా పదివేల మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సిఎం చంద్రబాబు ప్రకటించారు. ఆదా, అందరికీ విద్యుత్ పథకాల్లో దేశానికి ఆదర్శంగా నిలవాలని, నిధుల కొరత లేదని ప్రకటించారు. సోమవారం నుంచి జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం రాష్ట్రంలోని విద్యుత్ ఇంజనీర్లు, ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

Pages