S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/12/2015 - 16:44

హైదరాబాద్: మంత్రి కేటీఆర్‌ శనివారం విజయరామారావు నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విజయరామారావు మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత అయిన కె.విజయరామారావు శుక్రవారం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి న సంగతి తెలిసిందే.

12/12/2015 - 13:40

హైదరాబాద్‌ : ప్రజాస్వామ్య వాదులందరూ తెరాస ప్రభుత్వ తీరుపై గొంతు ఎత్తాలని తెలంగాణ సీఎల్పీనేత జానారెడ్డి కోరారు. సీఎల్పీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వంపై జానారెడ్డి విమర్శలు గుప్పించారు. శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌, మంత్రి, కేటీఆర్‌లపై మాట్లాడినందుకే తనను చంపుతామని కాల్స్‌ వస్తున్నాయని తెలిపారు.

12/12/2015 - 13:15

హైద‌రాబాద్ః ఫీజుల పేరుతో రోగులను ప్రైవేట్‌ కార్పొరేట్‌ ఆస్పత్రుల వైద్యులు పీడిస్తున్నారని గవర్నర్‌ నరసింహన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నగరంలో 13వ ఆలిండియా క్యాన్సర్‌ కేర్‌ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగులకు ప్రేమను కూడా పంచాల్సి బాధ్యత వైద్యులపై ఉందన్నారు. వైద్య రంగంలో ఎథిక్స్‌ పాటించాల్సిన అవసరం ఉందన్నారు.

12/12/2015 - 13:06

హైదరాబాద్‌ : ఈ నెల 14వ తేదీ నుంచి నిర్వహించనున్న ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కోర్సుల సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా వేయాలంటూ గేటు ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు. శుక్రవారం మద్యాహ్నం నుంచి రాత్రి వరకు ధర్నా నిర్వహించారు. విద్యార్థులతో ఓయూ రిజిస్ట్రార్‌ ప్రొ.ఇ.సురేష్‌కుమార్‌, ఏఏసీ డైరెక్టర్‌ ప్రొ.నాగేశ్వర్‌రావు తదితరులు చర్చలు జరిపారు.

12/12/2015 - 13:03

హైదరాబాద్‌ : పవిత్ర కార్తీకమాసం ముగింపు సందర్భంగా ఈరోజు తెల్లవారుజాము నుంచే వందలాది మంది భక్తులు పుణ్యనదుల్లో కార్తీక దీపాలు వదిలారు. శనివారం వేకువజాము నుంచే భక్తులు పవిత్ర కృష్ణా, గోదావరి, తుంగభద్ర, పెన్నా, స్వర్ణముఖి నదుల్లో పుణ్యస్నానాలాచరించి కార్తీక దీపాలు వదిలారు. కృష్ణాజిల్లా విజయవాడలోని దుర్గా ఘాట్‌ వద్ద పుణ్యస్నానాలాచరించారు. ఘాట్లన్నీ భక్తులతో కిటకిటలాడాయి.

12/12/2015 - 06:10

పోలవరం, డిసెంబర్ 11: పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం పట్టిసం ఎత్తిపోతల పథకం నుండి కృష్ణా డెల్టాకు నీటి తరలింపును శుక్రవారం నుండి నిలిపివేశారు. గోదావరిలో నీటిమట్టం తగ్గిపోవడంతో శుక్రవారం ఉదయం మోటార్లను నిలిపివేశారు. దీనితో డెలివరీ పాయింటు నుండి నీటి తరలింపు నిలిచిపోయింది.

12/12/2015 - 06:10

హైదరాబాద్, డిసెంబర్ 11: డిఎస్సీకి ముందే అంతర్ జిల్లాల బదిలీలు నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అలాగే 2016 నుండి మెడికల్ రీయింబర్స్‌మెంట్ అమలుచేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు కోరారు. ఓపెన్ కోటాలో స్థానికేతర జిల్లాల్లో నియామకమైన వారు భార్యభర్తలు వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న వారు గత నాలుగేళ్లుగా బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు.

12/12/2015 - 06:09

హైదరాబాద్, డిసెంబర్ 11: అమరావతి నిర్మాణంలో సింగపూర్ కంపెనీలను భాగస్వామం చేయడానికి సంబంధించి వివరాలను వెంటనే చంద్రబాబు ప్రభుత్వం బహిర్గతం చేయాలని వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. సింగపూర్ కంపెనీలకు మొత్తం భూములను కట్టబెట్టి రాష్ట్రప్రజల నోట్లో మట్టి కొడితే చూస్తూ ఊరుకోమన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం ఐదు కోట్ల ఆంధ్రులకు సంబంధించిన వ్యవహారం, పారదర్శకతతో వ్యవహరించాలన్నారు.

12/12/2015 - 06:08

విజయవాడ (పాయకాపురం), డిసెంబర్ 11: హైదరాబాద్‌లో తనదైన శైలిలో ప్రముఖులపై ఆరోపణలు చేసి వారి శృంగార దృశ్యాలను రహస్యంగా చిత్రీకరించి బ్లాక్‌మెయిల్ చేసిన ఆరోపణలు ఎదుర్కొన్న తారాచౌదరి తాజాగా బెజవాడలో మరో వివాదానికి తెరదీసింది.

12/12/2015 - 06:08

హైదరాబాద్, డిసెంబర్ 11: చింతపల్లి సభలో వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టిడిపి నేతలు శుక్రవారం నాడు మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పరస్పర ఆరోపణలు చేసుకున్నా శృతిమించి వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలుగు దేశం పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు, టిడిపి ఎస్సీ లెజిస్లేచర్ కమిటీ అధ్యక్షురాలు వంగలపూడి అనిత పేర్కొన్నారు. వారివురు వేర్వేరు ప్రకటనల్లో స్పందించారు.

Pages