S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/09/2015 - 07:10

విజయవాడ, డిసెంబర్ 8: విజయవాడ నగరంలోని స్వర్ణబార్ అండ్ రెస్టారెంట్‌లో కల్తీమద్యం సేవించి ఐదుగురు బలికావటం, మరో 28 మంది అస్వస్థతకు గురైన ఘటన క్రమేణ రాజకీయ ప్రకంపనలను సృష్టిస్తున్నది.

12/09/2015 - 07:02

విశాఖపట్నం, డిసెంబర్ 8: భవిష్యత్‌లో ఎటువంటి సవాళ్లనైనా కలిసే ఎదుర్కొంటామని భారత్, రష్యా నౌకాదళ అధికారులు స్పష్టం చేశారు. రెండేళ్లకు ఒకసారి జరిగే ఇండియా, రష్యా దేశాల సంయుక్త విన్యాసాలు విశాఖ తీరంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా యుద్ధ నౌక సహ్యాద్రిపై మంగళవారం భారత్, రష్యా నేవీ అధికారులు సంయుక్త విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

12/09/2015 - 07:01

హైదరాబాద్, డిసెంబర్ 8: దేశ భద్రతలో రాజీలేదని, అభివృద్ధికి విఘాతం కల్పించే తీవ్రవాద శక్తుల నుంచి వౌలిక సదుపాయాల వ్యవస్ధను పరిరక్షిస్తామని కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాల సంస్ధ (సిఐఎస్‌ఎఫ్) అదనపు డైరెక్టర్ జనరల్ రాజీవ్ రాయ్ భట్నాగర్ ప్రకటించారు. దేశ విద్రోహ శక్తుల పీచమణుస్తామని, అంతర్గత భద్రతకు కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాలు పునరంకితమై పనిచేస్తున్నాయన్నారు.

12/09/2015 - 07:01

తిరుచానూరు, డిసెంబర్ 8: పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజైన మంగళవారం రాత్రి అమ్మవారు పరమపద నాథుడి అవతారంలో చిన్నశేష వాహనం అధిష్ఠించి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తుల కోలాటాలు, గోవింద నామస్మరణలు, మంగళవాయిద్యాలు, మంత్రోచ్చారణల మధ్య అమ్మవారు చిద్విలాసంగా తిరుమాడ వీధుల్లో ఊరేగారు.

12/09/2015 - 07:00

హైదరాబాద్, డిసెంబర్ 8: కడుపుకాలే పేదలకు పట్టెడన్నం పెట్టేందుకు తమిళనాడు ప్రభుత్వం మూడేళ్ల క్రితం ప్రవేశపెట్టిన ‘అమ్మ భోజనం’ జయ ‘టీ’టిఫిన్ పథకాలు విజయవంతమవడంతో తెలంగాణ ప్రభుత్వం కూడా నిరుపేదలకు ఒక పూటైనా భోజనం పెట్టాలని సంకల్పించింది. శ్రామికులు, బడుగు జీవుల కడుపు నింపేందుకు మధ్యాహ్న భోజన పథకానికి శ్రీకారం చుట్టింది.

12/09/2015 - 06:59

విశాఖపట్నం, డిసెంబర్ 8: విశాఖలోని నేవల్ ఆర్మమెంట్ డిపో(ఎన్‌ఎడి)లో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈఘటనలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్మమెంట్ డిపోలో ప్రెజర్ హౌస్‌లోని సిబ్బంది గన్ పౌడర్ క్యాట్రిజ్‌లోని పౌడర్‌కు కాలం చెల్లడంతో దాన్ని తీసి కొత్త పౌడర్‌ను నింపుతున్నారు.

12/09/2015 - 06:58

హైదరాబాద్/తార్నాక/ నాచారం, డిసెంబర్ 8: ఓయులో బీఫ్ ఫెస్టివల్‌కు గడువు దగ్గర పడుతున్నకొద్దీ క్యాంపస్‌లో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంటోంది. కోర్టు యధావిధి పరిస్థితి కొనసాగించాలని ఆదేశించినా, పోలీసులు అనుమతులు లేవని ఇప్పటికే స్పష్టం చేసినా విద్యార్థులు మాత్రం తాము బీఫ్ ఫెస్టివల్ నిర్వహించి తీరుతామని అంటున్నారు.

12/09/2015 - 06:58

కర్నూలు, డిసెంబర్ 8: తెరమరుగైన ప్రాంతీయ అభివృద్ధి బోర్డులను తిరిగి ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి పనుల పర్యవేక్షణకు ప్రత్యేకంగా బోర్డులు ఉంటే వాటి ద్వారా కార్యక్రమాలను నిర్వహించవచ్చన్న ఆలోచన కేంద్రానికి ఉందని సమాచారం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరినట్లు సమాచారం.

12/09/2015 - 06:48

హైదరాబాద్, డిసెంబర్ 8: ఓ మహిళపై అత్యాచారం చేసి హత్య చేసిన ఇద్దరికి జీవిత ఖైదు, మరో ఇద్దరికి పదేళ్ల జైలుశిక్షతో పాటు రూ. 500 జరిమానా విధిస్తూ మంగళవారం ఐదవ, అదనపు మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి తీర్పు చెప్పారు.

12/09/2015 - 06:47

హైదరాబాద్, డిసెంబర్ 8: హైదరాబాద్‌లో మల్కాజిగిరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌లో నిధుల దుర్వినియోగం, తప్పుడు పద్ధతుల్లో నిధుల బదలాయింపు అభియోగాలపై సిబిఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. అల్విన్ లిమిటెడ్ వాచెస్ లిమిటెడ్‌కు చెందిన పిటిషనర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది.

Pages