S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/30/2015 - 15:42

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా సీనియర్ పాత్రికేయులు వి. వాసుదేవ దీక్షితులు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగనున్నారు.

11/30/2015 - 14:13

న్యూఢిల్లీ : మకావు టోర్నీ గెలిచిన పీవీ సింధుకు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రూ.10 లక్షల నగదు నజరానా ప్రకటించింది. అంతర్జాతీయ శ్రేణిలో మరోసారి సింధు తన ప్రతిభను చాటిందని బ్యాడ్మింటన్ సంఘం పేర్కొంది.

11/30/2015 - 14:11

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు మళ్లీ వర్షాలు కురిసాయి. ఈ వర్షాల కారణంగా చెన్నై నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో పాఠశాలలను మూసివేసినట్లు అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా మరో 24గంటలపాటు తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

11/30/2015 - 05:41

రాజమండ్రి, నవంబర్ 29: ఇసుక విధానాన్ని పూర్తిగా మార్చి గతం మాదిరిగా బహిరంగ వేలం విధానాన్ని అమలుచేయాలని అధికశాతం మంది కోరుతున్నారు. ఇసుకపై శే్వతపత్రాన్ని విడుదలచేసిన సందర్భంగా జనవరి 1 నుండి కొత్త ఇసుక విధానాన్ని అమలుచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో బహిరంగ వేలం విధానమైతేనే ప్రజలకు ప్రయోజనం కలిగిస్తుందని అన్ని వర్గాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

11/30/2015 - 05:38

హైదరాబాద్, నవంబర్ 29: తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను లూటీ చేస్తోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్.కె.రోజా ఆరోపించారు. రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి పాలన సాగిస్తోందని ధ్వజమెత్తారు. ఆదివారం పార్టీ ప్రధానకార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రం 15 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.

11/30/2015 - 05:37

విజయవాడ, నవంబర్ 29: విభజనానంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగవంతమైన అభివృద్ధి, సంక్షేమంతోపాటు రెండంకెల వృద్ధి లక్ష్యంగా పరుగులు తీస్తోంది. దీనిలో భాగంగానే రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి మిషన్ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ సంస్థ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ పేరుతో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ శాఖకు ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా ఉంటుంది.

11/30/2015 - 05:14

రాజమండ్రి, నవంబర్ 29: గోదావరి జిల్లాల్లో అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆదివారం మధ్యాహ్నం నుండి ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు సంభవించాయి. అప్పటి వరకు ఉన్న ఎండ మాయమై ఆకాశం మేఘావృతం కావటంతో పాటు, చలిగాలులు మొదలయ్యాయి. వాతావరణంలో సంభవించిన ఈ మార్పుతో గోదావరి జిల్లాల రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

11/30/2015 - 05:12

విశాఖపట్నం, నవంబర్ 29: నేడు ప్రపంచంలో ఉగ్రవాదం ఓ పెద్ద సవాల్‌గా పరిణమించిందని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఆదివారం వుడా పార్కులో జిమ్-2015 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి, మాట్లాడారు. వసుధైక కుటుంబం భారత లక్ష్యమని అన్నారు. ప్రపంచంలో మానవులంతా శాంతియుతంగా ఉండాలని మనం కోరుకుంటున్నామని గుర్తు చేశారు.

11/30/2015 - 05:11

విజయనగరం, నవంబర్ 29: పూర్వకాలంలో కఠిన దురాచారాలతో మహిళలు తీవ్ర అవస్థలు గురయ్యేవారని, గురజాడ అప్పారావు వంటి సంఘ సంస్కర్తల ప్రయత్నాలు, ప్రభుత్వాలు తీసుకున్న చర్యల ఫలితంగా ఆ పరిస్థితులను రూపుమాపగలిగామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి డాక్టర్ మృణాళిని అన్నారు.

11/30/2015 - 05:10

తిరుమల, నవంబర్ 29: శ్రీవారి ప్రసాదాల తయారీలో ఉపయోగించే నెయ్యి నాణ్యత లేకపోతేనే తిరస్కరిస్తుంటామని టిటిడి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ శర్మిష్ట అన్నారు. కర్ణాటక కేంద్రంగా దేశవ్యాప్తంగా నెయ్యి సరఫరా చేస్తున్న నందిని నెయ్యి ఉత్పత్తుల్లో కల్తీ జరుగుతున్న విషయం ఇటీవల వెలుగుచూసిన విషయం పాఠకులకు విదితమే. నందిని సంస్థ సరఫరా చేసే నెయ్యిని టిటిడి కూడా కొనుగోలు చేసి స్వామివారి ప్రసాదాలకు వినియోగిస్తోంది.

Pages