S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/30/2015 - 05:09

చోడవరం, నవంబర్ 29: విశాఖ జిల్లా, చోడవరం మండలంలోని ముద్దుర్తి గ్రామ పురాతన తాటాకు ఇల్లు తొలగింపులో బ్రిటీష్ కాలం నాటి నాణేలు బయపడ్డాయి. సమాచారం తెలుసుకున్న తహశీల్దార్ రామునాయుడు ఆదివారం గ్రామానికి చేరుకుని ఆ కుటుంబ సభ్యులను విచారించి, నాణేలను స్వాధీనం చేసుకున్నారు. ముద్దుర్తి గ్రామానికి చెందిన డొంకాడ సన్యాశిరావుకు పెద్దల ఆస్తి పంపకాల్లో తన వాటాగా పాత తాటాకు ఇల్లు వచ్చింది.

11/30/2015 - 05:06

సత్యవేడు, నవంబర్ 29: చిత్తూరు జిల్లా సత్యవేడు మండల పరిధిలోని చెరివి గిరిజన కాలనీకి చెందిన 13 ఏళ్ల బాలికపై అదే మండలం రామచంద్రాపురం గిరిజన గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడినట్లు తమకు ఫిర్యాదు అందిందని ఎస్‌ఐ మల్లికార్జున తెలిపారు.

11/30/2015 - 04:59

హైదరాబాద్, నవంబర్ 29: దేశంలోని 19 ఐఐఎంలలో మేనేజిమెంట్ కోర్సుల్లో ప్రవేశానికి ఆదివారం నాడు నిర్వహించిన క్యాట్-2015 పరీక్ష అభ్యర్ధులను అయోమయానికి గురిచేసింది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (క్యూఎ), వెర్బల్ అబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్(విఎఆర్‌సి), డా టా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్ (డిఐఎల్‌ఆర్)లలో వచ్చిన ప్రశ్నలు అభ్యర్ధులను గందరగోళంలోకి నెట్టాయి.

11/30/2015 - 04:57

హైదరాబాద్, నవంబర్ 29 : హిందూమత రక్షణ, హిందూ సంస్కృతి పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మాజీ ఐఎఎస్ అధికారి, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ పివిఆర్‌కె ప్రసాద్ తెలిపారు. 2015 డిసెంబర్ 2 న తిరుమలలోని ‘సదస్సుహాల్’లో నిర్వహిస్తున్న ‘్ధర్మిక సదస్సు’ లక్ష్యాల గురించి ఆదివారం ఆయన ఆంధ్రభూమి ప్రతినిధికి వివరించారు.

11/30/2015 - 04:55

హైదరాబాద్, నవంబర్ 29: పట్టణాల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడిగిన దాని కంటే అధికంగా ఇచ్చామని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. రామగుండం, మహబూబ్‌నగర్, వరంగల్, సూర్యాపేట, మిర్యాలగూడ, నల్లగొండ, ఆదిలాబాద్ పట్టణాల అభివృద్ధికి 405 కోట్ల రూపాయలు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరితే కేంద్రం 415 కోట్ల రూపాయలు కేటాయించిందని ఆయన ఆదివారం విలేఖరుల సమావేశంలో తెలిపారు.

11/30/2015 - 04:55

విజయవాడ, నవంబర్ 29: ఓటుకు నోటు కేసులో తాను ఎలాంటి నేరాలకు, అక్రమాలకు పాల్పడలేదని, ఒకమాటగా చెప్పాలంటే అటు టిఆర్‌ఎస్, ఇటు తెలుగుదేశం ప్రభుత్వాలు పడిపోకుండా ఉండేందుకు మధ్యవర్తిత్వం వహించానని ఆ కేసులో ప్రధాన ముద్దాయి జెరూసలెం మత్తయ్య అన్నారు.

11/30/2015 - 04:54

హైదరాబాద్, నవంబర్ 29: రాష్ట్రంలో రెవిన్యూ రికార్డుల రూపకల్పన, డిజిటలైజేషన్, ల్యాండ్ సర్వే తదితర అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యాధునిక టెక్నాలజీని వినియోగించుకోనుంది. కొత్త రాష్ట్రం కావడంతో ప్రతి జిల్లాలో సర్వే పని ఎక్కువగా ఉండటం, ఉన్న రికార్డుల్లో లోపాలను సవరించడం, ఎలాంటి పొరపాట్లు లేని రికార్డులను డిజిటలైజ్ చేయడం వంటి చర్యలను ప్రారంభించింది.

11/30/2015 - 03:02

హైదరాబాద్, నవంబర్ 29: సంచలనాలకు స్వస్తి పలకాలని, ఎప్పుడూ విమర్శించడమే కాదు...సలహాలూ ఇవ్వాలని గవర్నర్ నరసింహన్ మీడియాకు హితవు పలికారు. ఆదివారం రవీంద్ర భారతిలో జరిగిన హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ స్వర్ణోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్రేకింగ్ న్యూస్ పేరిట సంచలనాలకు స్వస్తి పలకాలని, బాధ్యతతో మెలగాలని అన్నారు.

11/30/2015 - 02:57

విజయవాడ , నవంబర్ 29: రాష్ట్ర రాజధాని నగరంగా అభివృద్ధి చెందుతున్న విజయవాడలో 2019నాటికి అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు కార్పొరేషన్ ఎండి ఎన్ రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం నగరంలోని కౌన్సిల్ హాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులకు జరిగిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు.

11/30/2015 - 02:54

హైదరాబాద్, నవంబర్ 29: ఇటీవల భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హెచ్చరించింది. ఐఎండి హెచ్చరికతో అటు తమిళనాడు, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. అల్పపీడనానికి సంబంధించి ఐఎండి సైంటిస్ట్ ‘ఇ’ (ఎన్‌డబ్ల్యుఎఫ్‌సి) చరణ్‌సింగ్ ఆదివారం ఐఎండి వెబ్‌సైట్ ద్వారా వివరాలు వెల్లడించారు.

Pages