S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/30/2015 - 02:53

హైదరాబాద్, నవంబర్ 29: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఈనెల 25వరకూ 3565 దరఖాస్తులు రాగా, అందులో 3067 దరఖాస్తులకు 21రోజుల వ్యవధిలోనే ప్రభుత్వ ఆమోదం దక్కింది. ఏకగవాక్ష విధానంలో 16శాఖలకు సంబంధించిన 26 అనుమతులను ఈ పరిశ్రమలకు ఏకకాలంలో ప్రభుత్వమిచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను ప్రోత్సహించేందుకు లీ క్యాన్ యూ స్కూల్‌తో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం సత్ఫలితాలనే ఇస్తోంది.

11/30/2015 - 02:50

హైదరాబాద్, నవంబర్ 29: ఇంతకాలం బలహీనవర్గాల ఇళ్ల నిర్మాణానికే పరిమితమైన గృహ నిర్మాణ శాఖ తన స్వరూపాన్ని మార్చుకోనుంది. బడుగు, బలహీనవర్గాల వారికి సైతం ఇళ్ల నిర్మాణం చేపట్టినపుడు అందంగా ఆకర్షణీయమైన ఇళ్లను నిర్మించడంతోపాటు కొత్త రాజధానిలో ఉద్యోగులకు సైతం ప్రత్యేకించి గృహాల నిర్మాణాన్ని చేపట్టినపుడు ఆధునిక వసతులతో నిర్మించేందుకు సిద్ధమవుతోంది.

11/30/2015 - 02:49

విశాఖపట్నం, నవంబర్ 29: వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమలు చేయనున్న వస్తు సేవల పన్ను(జిఎస్టీ) విధానంతో దేశాభివృద్ధి జరుగుతుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఆదివారం ఇక్కడ వుడా పార్కులో ఏర్పాటు చేసిన గ్లోబల్ యూత్ మీట్ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. జిఎస్టీ వల్ల జాతీయాదాయం 2 నుంచి 2.5 శాతం పెరిగే అవకాశం ఉందని, ప్రపంచంలో 160 దేశాలు జిఎస్టీని అమలు చేస్తున్నాయన్నారు.

11/30/2015 - 02:48

హైదరాబాద్, నవంబర్ 29: రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలపాలని, వృద్ధిరేటు గణనీయంగా పెంచేందుకు కృషి చేయాలని సిఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపుమేరకు రాష్ట్ర మంత్రులు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. కేబినెట్ ఏర్పడిన తర్వాత జరిగిన సమావేశాల్లో శనివారం హైదరాబాద్‌లో చంద్రబాబు నేతృత్వంలో జరిగిన సమావేశం కీలకమైందని రాష్ట్ర మంత్రి ఒకరు చెప్పారు. ఆదివారం ఇక్కడ ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడారు.

11/29/2015 - 07:27

విశాఖపట్నం, నవంబర్ 28: కార్తీక మాసంలో అయ్యప్ప దీక్షను చేపట్టిన భక్తులు కఠిన నియమాలు పాటించడం వల్ల అయ్యప్ప అనుగ్రహానికి పాత్రులు కాగలరని విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. శనివారం విశాఖ మురళీనగరలో నిర్వహించిన ధర్మశాస్త్రానంద వారోత్సవ కార్యక్రమానికి ఆయన విచ్ఛేసారు.

11/29/2015 - 07:24

ఏడాది బాలుడు సహా
దంపతులు దుర్మరణం
విశాఖలో విషాదం

11/29/2015 - 07:23

రావులపాలెం, నవంబర్ 28: ఇండోనేషియా దేశంలోని ఈస్టు జావా మలాంగ్‌లో డిసెంబర్ ఒకటో తేదీ నుండి ఆరు వరకు జరిగే వరల్డ్ బ్యాడ్మింటన్ మాస్టర్స్ సూపర్ సిరీస్‌కు ఇండియా టీం మేనేజర్‌గా ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు, తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంనకు చెందిన తేతలి నారాయణరెడ్డి నియమితులయ్యారు.

11/29/2015 - 07:23

విశాఖపట్నం, నవంబర్ 28: బాల కార్మికుల కోసం అన్ని జిల్లాల్లో రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదించనున్నట్టు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాసనసభా కమిటీ చైర్‌పర్సన్ మీసాల గీత తెలిపారు. కమిటీ శుక్ర, శనివారాల్లో విశాఖ జిల్లాలోని ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో పర్యటించి అనేక అంశాలపై ఆరా తీసింది.

11/29/2015 - 07:23

125 గజాల కేటాయింపునకు ప్రతిపాదన
భూములిచ్చిన రైతులు 21,500 మంది

11/29/2015 - 07:22

కడప, నవంబర్ 28: కడప జిల్లాకు చెందిన 11 మంది మహిళలు నకిలీవీసాలతో గల్ఫ్‌దేశాలకు వెళ్తూ శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇమిగ్రేషన్ అధికారులకు చిక్కారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితులతో చిన్న, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళలు మూడు దశాబ్దాలుగా జిల్లా నుంచి సుమారు 50వేల మంది మహిళలు జీవనోపాధి నిమిత్తం గల్ఫ్ బాట పట్టారు.

Pages