S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/21/2015 - 05:41

తిరుమల, నవంబర్ 20: తిరుమలలో శ్రీవారి ఆర్జిత సేవ టిక్కెట్ల ధరలు పెరిగే అవకాశం కన్పిస్తోంది. ఈమేరకు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవా టికెట్లు, లడ్డూ ప్రసాదం ధరలు, గదుల అద్దె పెంపు ప్రతిపాదనపై చర్చించేందుకు టిటిడి పాలక మండలి ఏర్పాటు చేసిన హేతుబద్ధీకరణ కమిటీ శుక్రవారం తిరుమల్లోని అన్నవయ్య భవనంలో తొలిసారిగా సమావేశమైంది.

11/21/2015 - 05:40

భీమవరం, నవంబర్ 20: తుపాన్ల వంటి ప్రకృతి వైపరీత్యాలను దృష్టిలో ఉంచుకుని వచ్చే సీజను నుండి ఖరీఫ్ పంట నవంబర్ నాటికి రైతు ఇంటికి చేరేలా ప్రణాళికలు సిద్ధం చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. నవంబర్, డిసెంబర్ మాసాల్లో తుపాన్ల ప్రభావం ఎక్కువగా ఉంటున్నందున అంతకంటే ముందుగానే పంట చేతికందేలా వ్యవసాయ ప్రణాళిక రూపొందిస్తామన్నారు.

11/21/2015 - 05:40

గుంటూరు, నవంబర్ 20: రాజధాని పరిధిలోని కృష్ణానది కరకట్టపై సిఎం ఉంటున్న నివాసం సక్రమమో.. అక్రమమో తేల్చిన తర్వాతే మత్య్సకారుల ఇళ్ల జోలికి రావాలని వైకాపా మంగళగిరి ఎమ్లెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. తాడేపల్లి మండలంలోని సీతానగరంలో శుక్రవారం రెవెన్యూ అధికారులు మత్య్సకారులకు చెందిన 32 ఇళ్లను తొలిగించేందుకు యత్నించారు.

11/21/2015 - 05:39

విశాఖపట్నం, నవంబర్ 20: బీమాను అన్ని రంగాలకు విస్తరింపజేయాలని రాష్ట్ర హోం మంత్రి చినరాజప్ప బీమా కంపెనీలను కోరారు. ప్రస్తుతం కొన్ని రంగాలకు మాత్రమే బీమాను వర్తింపజేయడంతో ప్రజలు ఎక్కువగా నష్టపోతున్నారన్నారు. బీమాపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలన్నారు.

11/21/2015 - 05:38

విజయవాడ, నవంబర్ 20: 2018 నాటికి పోలవరంతో పాటు రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులన్నింటిని త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు చేపట్టామని జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.

11/21/2015 - 05:29

హైదరాబాద్, నవంబర్ 20: హైదరాబాద్ వేదికగా వారం రోజులుగా జరిగిన 19వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం ముగింపుకార్యక్రమం ఆర్భాటంగా జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాలబాలికలు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. బాలబాలికల ప్రదర్శనలు, వివిధ ప్రాంతాలు, సంస్కృతీ సంప్రదాయాలను తెలియజేస్తూ చేసిన ప్రదర్శనలతో శిల్పకళావేదిక ఆడిటోరియం శుక్రవారం బాలల కేరింతలతో దద్దరిల్లింది.

11/21/2015 - 05:28

హైదరాబాద్, నవంబర్ 20: హైదరాబాద్‌లో ఎంఎంటిఎస్ రెండవ దశ రైలు మార్గం నిర్మాణం పనులు నిర్దేశించిన కాలపరిమితిలోగా పూర్తి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తా ప్రకటించారు. ఎంఎంటిఎస్ రెండవ దశ పనులు 103 కి.మీ పొడువునా విస్తరించి ఉన్నాయి. ఈ పనులు పూర్తి చేసేందుకు రూ.819 కోట్లు వ్యయమవుతుంది. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఈ పనులను చేపట్టంది.

11/21/2015 - 05:27

తిరుపతి, నవంబర్ 20: చిత్తూరు మేయర్ అనూరాధ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితులు చింటూ అలియాస్ చంద్రశేఖర్, రెడ్డి అలియాస్ జయప్రకాష్, వెంకటేష్‌ల ఆచూకి తెలిపిన వారికి లక్ష రూపాయలు బహుమానం ఇస్తామని, సమాచారం ఇచ్చిన వారి పేర్లను రహస్యంగా ఉంచుతామని రాయలసీమ అడిషనల్ డిజి ఠాకూర్ ప్రకటించారు. మేయర్ దంపతుల హత్య కేసు దర్యాప్తు పురోగతిని పరిశీలించడానికి శుక్రవారం ఉదయం ఆయన చిత్తూరుకు చేరుకున్నారు.

11/21/2015 - 05:24

హైదరాబాద్, నవంబర్ 20: రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ తలెత్తిన వామపక్ష తీవ్రవాద సమస్యకు చెక్ పెట్టేందుకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల డిజిపిలు త్వరలో సమావేశమై ఉమ్మడి వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. తాజాగా ఖమ్మం జిల్లా భద్రాచలం రెవెన్యూ డివిజన్‌లో ఆరుగురు టిఆర్‌ఎస్ నేతలను మావోయిస్టు పార్టీ నక్సలైట్లు కిడ్నాప్ చేశారు.

11/21/2015 - 05:23

హైదరాబాద్, నవంబర్ 20: సమస్యలపై పోరుకు జాతీయ స్థాయిలో మహిళా టీచర్లంతా ఒకే వేదికపైకి రాబోతున్నారు. జాతీయ స్థాయిలో 16 రాష్ట్రాల నుండి 20 సంస్థలకు చెందిన 500 మంది మహిళా టీచర్ల ప్రతినిధులు, వందలాది సభ్యులు హైదరాబాద్‌లో ఈనెల 22 నుండి నిర్వహించబోయే జాతీయ సమ్మేళనంలో పాల్గొనబోతున్నారు.

Pages