S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/21/2015 - 02:09

తిరుపతి, నవంబర్ 20: చిత్తూరు మేయర్ అనూరాధ దంపతుల హత్యాకాండలో తాము ముందుగా అంచనా వేసినట్లుగా ప్రధాన నిందితుడు కఠారి మోహన్ మేనల్లుడు చింటూనేనని, అతనితోపాటు రెడ్డి అలియాస్ జయప్రకాష్‌రెడ్డి, మరో ముగ్గురు పాల్గొన్నారని వీరిలో చింటూ, వెంకటేష్ పారిపోగా జయప్రకాష్‌రెడ్డి, వెంకటాచలపతి, మంజునాథ్ పోలీసులకు లొంగిపోయారని చిత్తూరు ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు.

11/21/2015 - 02:06

బైరెడ్డిపల్లె, నవంబర్ 20: బంధువుల వివాహ మహోత్సవానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తూ ఐదు నిమిషాల్లో గమ్యం చేరనున్న నేపథ్యంలో చిత్తూరు నుండి కుప్పంకు వెళ్తున్న బస్సును, బైరెడ్డిపల్లె గ్రామంలోకి వెళ్తున్న కారు ఢీకొన్న సంఘటన శుక్రవారం ఉదయం జరిగింది. ఈరోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందడంతో మృతుల స్వగ్రామమైన మిట్టకురపల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

11/21/2015 - 02:04

విజయవాడ, నవంబర్ 20: ప్రపంచం మెచ్చే స్థాయిలో కొత్త రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయాల నిర్మాణాలు జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. దేశంలో తొలిసారి ప్రభుత్వ విభాగాలు, పథకాలు, కార్యక్రమాలన్నింటినీ ఆన్‌లైన్ చేసి ఆధునిక పరిపాలనకు రూపాంతరం చెందామని, కొత్త రాజధానిలో ప్రభుత్వ సముదాయాలు దానికి తగినట్టుగా అత్యంత ఆధునికంగా ఉండాలని సూచించారు.

11/21/2015 - 02:00

నెల్లూరు/ వెంకటగిరి/ కడప, నవంబర్ 20: భారీ వర్షాలకు నష్టపోయిన బాధితులు అధైర్యపడాల్సిన పని లేదని, అన్ని విధాలా ఆదుకుంటామని సిఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. శుక్రవారం కడప, నెల్లూరు జిల్లాల్లో పర్యటించారు. పండ్లతోటలకు ఎకరాకు పదివేలు, దెబ్బతిన్న చేనేత మగ్గాలకు తక్షణం పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాల్లో దెబ్బతిన్న ప్రాంతాలను యుద్ధప్రాతిపదికను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు.

06/24/2015 - 11:40

రాయదుర్గం, జూన్ 23: ఆవుదూడ బంధం గురించే మనకు తెలుసు. మనకు తెలీని మరోబంధం ఉంది అదే ఆవు వరాహ బంధం. ఓ ఆవు తనజాతి కాని పందిపిల్లలకు ప్రతిరోజూ పాలిస్తోంది. ఈ వింత అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణంలోని నేతాజీరోడ్డు పాత కరెంటు ఆఫీస్ వద్ద ఉదయం సాయంత్రం పూట ఓ ఆవు పందిపిల్లలకు పాలిస్తోంది. నిత్యం కనిపించే ఈ దృశ్యాన్ని చూసి స్థానికులు అచ్చెరువొందుతున్నారు.

06/24/2015 - 11:37

చాగల్లు, జూన్ 23: పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లులో నలుగురు యువకుల కిడ్నాప్‌నకు గురయ్యారు. కోల్‌కతాకు చెందిన ఒక ముఠా చాగల్లుకి చెందిన నలుగురు యువకులకు రైల్వేలో టిసి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి ఒక్కొక్కరి వద్ద నుండి రూ.18 లక్షలు వసూలు చేసినట్లు తెలిసింది. వారంరోజుల క్రితం కోల్‌కతా నలుగురు యువకులకు ఉద్యోగాలు వచ్చాయని, విధుల్లో చేరటానికి రావాలని ఫోన్లో తెలియజేశారు.

06/24/2015 - 10:36

హైదరాబాద్, జూన్ 23: ఇరవై సంవత్సరాల తర్వాత నీటి తీరువాను పెంచాలనే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు నీటి తీరువాను ఏమేరకు పెంచాలో ప్రతిపాదనలు సిద్ధమై ఆర్థిక శాఖకు చేరాయి. భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల కింద ఉండే ఆయకట్టు రైతుల నుంచి నీటి తీరువాను ప్రభుత్వం వసూలు చేస్తోంది. గతంలో 1996లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నీటి తీరువాను పెంచింది.

03/14/2015 - 10:55

హైదరాబాద్, మార్చి 13: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2015-16 ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన వ్యవసాయ బడ్జెట్‌ను శుక్రవారం విధాన మండలి ప్రవేశపెట్టింది. రాష్ట్ర కార్మిక, క్రీడా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

03/14/2015 - 10:53

తిరుపతి, మార్చి 13: వేసవికాలం నేపధ్యంలో శ్రీవారిని దర్శించుకోడానికి తిరుమలకు వచ్చే భక్తులకు వసతి పొందే సులభ సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు టిటిడి ఇఓ డాక్టర్ డి.సాంబశివరావు దృష్టి సారించారు. ఇందులో భాగంగా శనివారం నుంచి ముందస్తు వసతి సౌకర్యాలు పొందే సౌకర్యం కల్పిస్తున్నారు.

Pages