S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/19/2020 - 05:49

తిరుపతి, మార్చి 18 : భక్తులు ఎంతో పవిత్రంగా భావించి పుణ్యస్నానాలచరించే తిరుమలలోని శ్రీవారి పుష్కరిణిని మూసివేస్తున్నట్లు టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి ఏవి ధర్మారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన శ్రీవారి పుష్కరిణి పరిశీలించారు.

03/19/2020 - 05:42

హైదరాబాద్, మార్చి 18: ప్రజలను భయభ్రాంతుల్ని చేస్తున్న కరోనా( కోవిడ్-19)పై రైల్వే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని దక్షిణ మధ్య రైల్వే అలర్ట్ ప్రకటించింది. రైల్లో ప్రయాణించే ఏసీ ప్రయాణికులు సొంతంగా దుప్పట్లను తెచ్చుకుంటే మంచిదని అధికారులు సూచించారు. జోన్ పరిధిలో అన్ని జోన్లలో రైల్వే సిబ్బంది ప్రయాణికులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని రైల్వే పేర్కొంది.

03/19/2020 - 05:28

విశాఖపట్నం, మార్చి 18: ఉత్తర కోస్తాలో మరో నాలుగు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్ర పేర్కొంది. దక్షిణ గాలులకు నైరుతి గాలులు కలవడం ద్వారా చోటుచేసుకునే పరిణామాలతో క్యుములోనింబస్ మేఘాల ఏర్పాటుతో వర్షాలు కురుస్తాయి. ఈ పరిస్థితులు ఉత్తర కోస్తాలో మరో నాలుగు రోజుల పాటు ఉంటాయి. బుధవారం సాయంత్రం హఠాత్తుగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.

03/19/2020 - 01:43

హైదరాబాద్, మార్చి 18: దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఏప్రిల్ 5 నుం చి నాలుగు రోజుల పాటు జరగాల్సిన జేఈఈ మెయిన్స్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది. అయితే వాయిదా పడిన పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది మార్చి 31న ప్రకటిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం తెలిపింది.

03/18/2020 - 06:25

విశాఖపట్నం: కరోనా ప్రభావం రైళ్ళపై పడింది. ఫలితంగా ప్రయాణికులు లేకపోవడంతో ఎనిమిది ఎక్స్‌ప్రెస్ రైళ్ళను రద్దు చేస్తూ ఆ శాఖ నిర్ణయం తీసుకుంది.

03/18/2020 - 21:50

హైదరాబాద్: ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలపై సస్పెన్షన్‌కు గురైన ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్)లో చుక్కెదురైంది. తన సస్పెన్షన్‌ను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని దాఖలు చేసిన పిటిషన్‌ను క్యాట్ కొట్టివేసింది. ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించింది.

03/17/2020 - 06:28

ఆదోని: ఉగాది వస్తోందంటే చాలు.. కర్నాటక భక్తులు శ్రీశైలం దారి పడతారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఓర్చుకుంటూ కాలినడకన మల్లన్న సన్నిధికి చేరుకుంటారు. శ్రీశైలంలో కొలువుతీరిన భ్రమరాంబికను ఆడపడుచుగా, మల్లికార్జునస్వామిని అల్లుడిగా భావించే కన్నడిగులు ఉగాది రోజు వారికి చీర, సారే తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. ఉగాది రోజు శ్రీశైలం చేరుకుని మల్లికార్జున స్వామిని కొలవడం కర్నాడిగుల ఆచారం.

03/17/2020 - 06:26

కొత్తగూడెం, మార్చి 16: పోలీసు వ్యవస్థను మరింత పటిష్టపరిచేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో పోలీసులను భాగస్వాముల్ని చేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని సింగరేణి క్లబ్‌లో మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

03/17/2020 - 06:19

హైదరాబాద్, మార్చి 16: కోవిడ్ మహమ్మారిని నివారించే క్రమంలో కేంద్రప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా హైదరాబాద్ బర్కత్‌పురలోని ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) కార్యాలయంలో వాటాదారుల సందర్శనను తగ్గించాలని నిర్ణయించినట్టు రీజనల్ పీఎఫ్ కమిషనర్ విపిన్ కుమార్ శరణ్ తెలిపారు.

03/17/2020 - 01:44

తిరుపతి, మార్చి 16: శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి వచ్చే సామాన్య భక్తులు ఒక రోజులోనే రెండు మూడు పర్యాయాలు దర్శనం చేసుకుంటున్నారు. ఇది నిజమేనా అని అనుకుంటున్నారా.. కరోనా సాక్షిగా ఇది అక్షర సత్యం.

Pages