S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/15/2017 - 02:22

హైదరాబాద్, మే 14: నైరుతి రుతుపవనాలు నికోబార్ ద్వీపాలను తాకాయి. దక్షిణ అండమాన్ సముద్రంలో విస్తరించాయి. సాధారణ గడువుకు మూడు రోజుల ముందే నైరుతి రుతుపవనాలు పలకరించాయని భారత వాతావరణ శాఖ(ఐఎండి) ప్రకటించింది. రుతుపవనాలు బలంగా ఉండటంతో పాటు నైరుతీవైపు గాలులు బలంగా ఉండటంతో నికోబార్ ఐలాండ్స్, బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు ఇవి వేగంగా విస్తరిస్తున్నాయి.

05/15/2017 - 02:21

హైదరాబాద్, మే 14: తెలంగాణలో పట్టణీకరణ వేగం పుంజుకుంటోంది. కొత్త జిల్లాల ఏర్పాటు ఇందుకు బలమైన కారణంగా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు రాష్ట్రంలో 82 పట్టణాలు మాత్రమే ఉండగా వీటి సంఖ్య ప్రస్తుతం 158కి చేరుకుంది. రాష్ట్రంలో పట్టణీకరణ వృద్ధి రేటు 92.7 శాతంగా తాజా సర్వేలో తేలింది.

05/15/2017 - 02:15

విశాఖపట్నం, మే 14: డొల్ల కంపెనీలను సృష్టించి, వందల కోట్ల రూపాయలను విదేశాలకు తరలించిన హవాలా కేసును ప్రభుత్వం సిఐడికి అప్పగించింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి వడ్డి మహేష్‌ను అరెస్టు చేసినట్టు పోలీసులు ప్రకటించారు. అతనిని కోల్‌కతానుంచి ఆదివారం విశాఖకు తీసుకొచ్చారు. మహేష్‌తోపాటు అతని తండ్రి శ్రీనివాస్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తోంది.

05/15/2017 - 02:14

మార్తి సుబ్రహ్మణ్యం

05/15/2017 - 02:12

అనంతపురం, మే 14:అనంతపురం జిల్లాలో ఆదివారం పిడుగుపాటుకు గురై ఐదుగురు మరణించారు. గుమ్మఘట్ట మండలం కలుగోడు గ్రామంలో సాయంత్రం 4.30 గంటల సమయంలో భారీ వర్షం కురిసింది. దీంతో గొర్రెల కాపరులు, రైతులు గ్రామంలోని పాఠశాల సమీపంలో ఉన్న ఓ రేకులషెడ్డులోకి చేరుకున్నారు. ఆ సమయంలో హఠాత్తుగా భారీ శబ్దంతో పిడుగు పడింది.

05/15/2017 - 02:09

హైదరాబాద్, మే 14: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వచ్చే మూడు, నాలుగు రోజుల్లో సాధారణం కంటే మూడు, నాలుగు డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తాయని, మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు.

05/15/2017 - 02:05

అమరావతి, మే 14: గ్రామాల్లో మంచినీటి సమస్యపై వస్తున్న ఫిర్యాదుల పరిష్కారం కోసం ఐటి, పంచాయతీరాజ్ మంత్రి లోకేష్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటున్నారు. దీనికోసం రియల్ టైం వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. మంచినీటి సమస్యలపై వివిధ పత్రికలు, వార్త్ఛానళ్లలో వస్తున్న కథనాలను కూడా ఫిర్యాదులుగా స్వీకరించి ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్నారు.

05/15/2017 - 02:03

విజయవాడ, మే 14: రాజధాని ప్రాంతంలో తొలివిడతగా 1691 ఎకరాల్లో ప్రతిపాదించిన స్టార్టప్ ఏరియా అభివృద్ధికి సోమవారం మధ్యాహ్నం 2.35 నిమిషాలకు మందడం గ్రామంలో భూమిపూజ జరగబోతోంది. ఇందుకోసం పరిసర గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలను సమీకరిస్తున్నారు. దీనికి ముందుగా విజయవాడ నగరంలో సింగపూర్ కన్సార్టియం సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది.

05/15/2017 - 01:54

నల్లగొండ, మే 14: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫ్లోరైడ్ పీడిత నల్లగొండ జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం పనుల పురోగతికి కాంట్రాక్టర్ల కరువొచ్చింది. ఉమ్మడి జిల్లాలో మిషన్ భగీరథ పథకంలోని ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంకుల నిర్మాణాలకు ఒక్కో ట్యాంకును ఒక్కో ప్యాకేజిగా చేసి 600 ట్యాంకుల నిర్మాణాలకు గత ఏప్రిల్ 8 నుండి నామినేషన్ పద్ధతిలో టెండర్లు పిలిచారు.

05/14/2017 - 04:14

ఖమ్మం, మే 13: ప్రజలందరికీ న్యాయం చేయడం కోసం తాము ప్రయత్నిస్తున్నామని, ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన వారసులం తామేనని తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం ఖమ్మంలో విలేఖరులతో మాట్లాడుతూ పార్టీని భ్రష్టుపట్టించిన నేతలు, తనను ఓడించేందుకు కుట్రపన్నిన నాయకులు ఇప్పుడు ఏదో చేస్తామని ప్రజలకు మాయమాటలు చెబుతున్నారన్నారు.

Pages