S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/21/2019 - 23:25

హైదరాబాద్, మే 21: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక ఐరన్ లెగ్ అని జాతీయ స్థాయిలో విపక్ష పార్టీలు బాబు ఉచ్చులో చిక్కుకోవద్దని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు ఎస్ విష్ణువర్దన్ రెడ్డి హితవు చెప్పారు. మంగళవారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని రకరకాల సర్వేలు చెప్పాయన్నారు. ఏపీలో టీడీపీ ఓటమి తథ్యమని ఆయన చెప్పారు.

05/22/2019 - 01:47

తిరుపతి, మే 21: టీటీడీ నిర్వహిస్తున్న శ్రీవారి ట్రస్ట్‌లకు 1.23కోట్ల రూపాయలను విరాళంగా అందించారు. ఇందులో ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు 24లక్షలు, ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్‌కు 10లక్షలు, బర్డ్ ట్రస్ట్‌కు 5లక్షలు, శ్రీబాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీమ్ (స్విమ్స్)కు 74లక్షలు, ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు 10లక్షల రూపాయలను భక్తులు విరాళంగా ఇచ్చారు.

05/21/2019 - 23:09

గద్వాల, మే 21: నారాయణపుర ప్రాజెక్టు గేట్లు మంగళవారం మూ సివేశారని అధికారులు తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల తాగునీటి అవసరాల కోసం తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కర్నాటక ప్రభుత్వం నారాయణపుర ప్రాజెక్టు నుంచి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు 2.50 టీఎంసీల వరద నీరు విడుదల చేశారు.

05/21/2019 - 04:54

సహర్ ఉదయం 4:22 గంటలకు
ఇఫ్తార్ సాయంత్రం 6:45 గంటలకు

05/21/2019 - 04:49

హైదరాబాద్, మే 20: వరి మొక్కపై జాంతోమోనస్ ఒరిజే అనే సూక్ష్మక్రిమి దాడి చేసినపుడు మొక్క అవలంభించే దాడి నిరోధక పద్ధతిలో ఒక రకం మార్పును తాము కనుగొన్నామని సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీకి చెందిన సీనియర్ శాస్తవ్రేత్త డాక్టర్ హితేంద్ర కే పటేల్, డాక్టర్ రమేశ్ వీ శొంటిలు తెలిపారు.

05/21/2019 - 03:46

హైదరాబాద్, మే 20: ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని వృత్తి, సాంకేతిక విద్యాకోర్సులకు ఏక రూప ఫీజులను ఖరారు చేయాలని యాజమాన్యాల సంఘం రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను కోరింది. ఫీజులు కోర్సుల వారీ ఉండాలే తప్ప, కాలేజీల వారీ కాదని వారు సూచించారు.

05/21/2019 - 01:32

హైదరాబాద్, మే 20: పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం దాటికి ఇద్దరు చంద్రుల ఫ్రంట్ల టెంట్లు లేచిపోవడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ జోస్యం చెప్పారు. ఈ నెల 23న ఫలితాల తర్వాత తెలుగు రాష్ట్రాలకు పట్టిన చంద్రగ్రహణాలు వీడనున్నాయని ఆయన ఎద్దేవా చేశారు.

05/21/2019 - 01:29

హైదరాబాద్, మే 20: లోక్‌సభ ఓట్ల లెక్కింపు సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారులైన (డీఈఓ) జిల్లా కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులు (ఆర్‌ఓ), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు (ఏఆర్‌ఓ) అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) రజత్ కుమార్, ఈసీఐ సీనియర్ కన్సల్టెంట్ భన్వర్‌లాల్ సూచించారు.

05/21/2019 - 01:26

హైదరాబాద్: లోక్‌సభ ఓట్ల లెక్కింపు సందర్భంగా సాంకేతిక కారణాలతో ఈవీఎంలలోని ఓట్లతో వీవీప్యాట్లలోని ఓట్లు సరిపోకపోతే ఏం చేయాలన్న అనుమానం కౌంటింగ్ సిబ్బందిలో చాలా మందికి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) రజత్ కుమార్ నేతృత్వంలో సోమవారం ఇక్కడి హోటల్ తాజ్‌కృష్ణలో జిల్లా కలెక్టర్లు, కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.

05/21/2019 - 01:25

హైదరాబాద్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల టైమ్‌టేబుల్‌ను బోర్డు అధికారులు రీ షెడ్యూలు చేశారు. ఫస్టియర్ పరీక్షలు జూన్ 7 నుండి ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకూ జరుగుతాయి. అదే రోజు సాయంత్రం 2.30 నుండి 5.30 వరకూ సెకండియర్ పరీక్షలు మొదలవుతాయి. ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 15 నుండి 18వ తేదీ వరకూ జరుగుతాయి.

Pages