S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/11/2018 - 01:42

హైదరాబాద్, సెప్టెంబర్ 10: భారత ప్రధాని నరేంద్రమోదీ విద్యార్థులను ఉద్ధేశించి చేసిన ప్రసంగాల సంపుటి ‘పరీక్షల యోధులు’ తెలుగు అనువాదాన్ని కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాష్ జవదేకర్ ఆవిష్కరించనున్నారు.

09/11/2018 - 01:04

భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 10: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం కనుముక్కల గ్రామంలో చేనేత పార్కులో 25మీటర్ల పొడువు గల చేనేత శాలువను కళాకారులు నెల రోజుల పాటు శ్రమించి కళాత్మకంగా రూపొందించారు. హైద్రాబాద్ ఖైరాతాబాద్‌లోని ప్రతిష్ఠించే భారీ వినాయకుడికి చేనేత శాలువను సమర్పించేందుకు పార్క్ యాజమాన్యం ఈ శాలువను పంపించనున్నారు.

09/11/2018 - 03:48

నల్లగొండ, సెప్టెంబర్ 10: టీఆర్‌ఎస్ అధినేత, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ప్రకటించిన పార్టీ అభ్యర్థులపై రోజురోజుకు అసమ్మతి భగ్గుమంటోంది. టికెట్ ఆశించి భంగపడిన నాయకులు, అభ్యర్థులపై అసంతృప్తితో ఉన్న నాయకులు, కార్యకర్తలు అసమ్మతి శిబిరాల నిర్వహణతో అభ్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు.

09/11/2018 - 00:43

హైదరాబాద్, సెప్టెంబర్ 10: పెట్రోలు, డీజీలు ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఏఐసీసీ ఇచ్చిన భారత్ బంద్ సోమవారం తెలంగాణలో విజయవంతమైంది. కాంగ్రెస్ సారధ్యంలో జరిగిన బంద్‌కు టీడీపీ, వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. నాయకులు, కార్యకర్తలు ఉదయమే పార్టీ జెండాలు చేబూని రోడ్లపైకి వచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బైక్ ర్యాలీలు నిర్వహిస్తూ దుకాణాలను మూయించారు.

09/11/2018 - 00:38

హైదరాబాద్, సెప్టెంబర్ 10: దుర్మార్గపు, దుష్ట పాలన అంతమొందించేందుకు భావసారూప్యగల పార్టీలు, ప్రజా సంఘాలు తమతో కలిసి రావాలని టీ.పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం భారత్ బంద్‌లో పాల్గొన్న అనంతరం ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ ఆర్‌సీ కుంతియా, ఇతర నాయకులు కే.

09/11/2018 - 00:36

హైదరాబాద్, సెప్టెంబర్ 10: అభ్యర్థుల ఖరారుతో టీఆర్‌ఎస్ పార్టీలో రేగిన ఎగిసిన అసంతృప్తి సెగలను ఆర్పడానికి పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. టికెట్ ఆశించి భంగపడిన నేతలను ఒకోక్కరిని స్వయంగా పిలిపించుకుని చర్చించే బాధ్యతను మంత్రి కేటీఆర్‌కు పార్టీ అధినేత కేసీఆర్ అప్పగించారు.

09/11/2018 - 03:12

విజయవాడ, సెప్టెంబర్ 10: పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలను నియంత్రించడంలో నరేంద్ర మోదీ ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ వేర్వేరుగా సోమవారం పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్ పాక్షికంగా జరిగింది. అధికార పక్ష తెలుగుదేశం, ప్రతిపక్ష వైకాపాలు బంద్‌కు దూరంగా ఉండడం కూడా దీనికి ఓ కారణంగా చెప్పుకోవచ్చు. బంద్ సందర్భంగా ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం వరకు తిరగలేదు.

09/11/2018 - 00:25

విజయవాడ, సెప్టెంబర్ 10: నాలుగున్నర సంవత్సరాల నరేంద్ర మోదీ పాలనలో రూ. 11.50 లక్షల కోట్లు ప్రభుత్వం దోచుకుందని, ఇది పబ్లిక్ దోపిడీ అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా జరిగిన భారత్ బంద్‌ను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 8 గంటలకు విజయవాడలో రఘువీరారెడ్డి ప్రారంభించారు.

09/11/2018 - 00:23

విశాఖపట్నం, సెప్టెంబర్ 10: దైవం అంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు భయం-భక్తి రెండూ లేవని, తన రాజకీయ స్వార్థం కోసం భగవంతుడిని కూడా వాడుకుని వదిలేయగల మోసగాడంటూ వైసీపీ అధినేత జగన్ ఘాటుగా విమర్శించారు. బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులతో విశాఖలో సోమవారం జరిగిన ఆత్మీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ తన దోపిడీకి భగవంతుడ్ని కూడా వదిలిపెట్టలేదన్నారు.

09/11/2018 - 00:20

విజయవాడ, సెప్టెంబర్ 10: పెట్రోల్, డీజల్‌పై లీటరుకు 2 రూపాయలు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ప్రకటన చేశారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించి మనసున్న వ్యక్తిగా కొంత మేరకు పెట్రో భారాన్ని తగ్గించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Pages