S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/04/2016 - 13:21

మహానంది: కర్నూలు జిల్లా మహానందిలోని శ్రీ కామేశ్వరి దేవి సహిత మహా నందీశ్వరుడి ఆలయాన్ని తెలుగు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ సోమవారం ఉదయం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి చీర బహుకరించారు.

01/04/2016 - 12:51

హైదరాబాద్: తెలుగురాష్ట్రాల్లో రైతు ఆత్మహత్యలపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. రైతు ఆత్మహత్యల నివారణకు పూర్తిస్థాయి చర్యలు తసుకోవాలని, ఆరు వారాల్లో ఆత్మహత్యలపై సమగ్ర నివేదిక అందించాలని ఇరు రాష్ట్రాలకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

01/04/2016 - 08:48

విజయవాడ (ఇంద్రకీలాద్రి), జనవరి 3: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న ఆదిపరాశక్తి, శ్రీ జగన్మాత శ్రీకనకదుర్గమ్మ సన్నిధిలో ఆదివారం వేకువ జామున సుమారు లక్ష మంది భవానీలు భక్తిశ్రద్ధలతో దీక్ష విరమించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దీక్ష స్వీకరించిన భవానీలు 41 రోజుల పాటు నియమనిష్ఠలతో ఆచరించి శనివారం రాత్రి నగరానికి చేరుకున్నారు.

01/04/2016 - 08:46

అనకాపల్లిరూరల్, జనవరి 3: సినీహీరో పవన్‌కల్యాణ్ చొరవతోనే తమకు మంత్రి పదవులు వచ్చాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పి. మాణిక్యాలరావు స్పష్టం చేశారు. స్థానిక సత్యనారాయణమూర్తి దేవస్థానం వద్ద ఆదివారం జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడారు. టిడిపి విజయానికి పవన్‌కల్యాణ్ ఎంతో తోడ్పాటు అందజేశారని పేర్కొన్నారు.

01/04/2016 - 08:45

హిందూపురం, జనవరి 3: ఆంధ్ర, కర్నాటక రాష్ట్రాల నడుమ ఆర్టీసీ బస్సుల పర్మిట్ల రగడ చినికి చినికి గాలివానలా తయారైంది. అంతర్రాష్ట్ర పర్మిట్ల కాలపరిమితి మునిగినా రెన్యూవల్ చేసుకోకుండా కెఎస్‌ఆర్‌టిసి బస్సులను నడపడం పసిగట్టిన అనంతపురం ఆర్డీఏ అధికారులు కర్నాటక అధికారులకు సూచించారు. అయితీ దీన్ని అవమానంగా భావించిన కర్నాటక అధికారులను ఆంధ్ర బస్సులను సరిహద్దులో నిలివేస్తున్నారు.

01/04/2016 - 08:44

విశాఖపట్నం, జనవరి 3: రాష్ట్రంలో నూతన ఇసుక విధానాన్ని వచ్చే నెల 15 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్టు ఆర్థిక శాఖ మంత్రి, ఇసుక విధానంపై ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉపసంఘం అధ్యక్షుడు యనమల రామకృష్ణుడు వెల్లడించారు.

01/04/2016 - 08:44

కాకినాడ, జనవరి 3: తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని పోర్టుకు సంబంధించిన కోట్లాది రూపాయల విలువైన భూములు ట్యాంపరింగ్ అయినట్టు తెలుస్తోంది. పోర్టుకు సంబంధించి 17 సర్వే నెంబర్ల పరిధిలో విలువైన భూములను కొందరు కబ్జాదారులు ట్యాంపరింగ్ చేసి, ఆక్రమించుకున్నట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీంతో ఈ అక్రమాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు.

01/04/2016 - 08:41

విశాఖపట్నం, జనవరి 3: రాష్ట్రంలో సాంకేతిక విప్లవం రాబోతోందని, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కాగిత రహిత పాలన అమలు కానుందని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సమాచార శాఖల మంత్రి పల్లె రఘునాథ రెడ్డి తెలిపారు. విశాఖ శివారు మధురవాడలోని ఐటి కంపెనీల ప్రతినిధులతో ఆదివారం ఆయన సమావేశం నిర్వహించారు.

01/04/2016 - 08:31

తిరుమల, జనవరి 3: తిరుమలలో లడ్డూ దళారీని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.
చిత్తూరుకు చెందిన సురేష్ అనే దళారి లడ్డూ కౌంటర్ల వద్ద భక్తులకు అధిక ధరలకు లడ్డూలను విక్రయిస్తుండగా విజిలెన్స్ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి 30 శ్రీవారి లడ్డూలతో పాటు 40 లడ్డూ టోకెన్లను స్వాధీనం చేసుకున్నారు.

01/04/2016 - 08:12

హైదరాబాద్, జనవరి 3 : న్యాయవిద్యతోపాటు అన్ని విద్యాసంస్థల్లో పోటీతత్త్వం వల్ల విద్యార్థులు, అభ్యర్థులలో ప్రతిభ పెరుగుతుందని ఆంధ్రప్రదేశ్ జుడిషియల్ అకాడమీ అధ్యక్షుడు జస్టిస్ చంద్రయ్య అన్నారు. సికింద్రాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ జుడిషియల్ అకాడమీలో ఆదివారం ఏర్పాటు చేసిన జస్టిస్ ఎంఎన్ రావు గోల్డ్‌మెడల్స్, జస్టిస్ టిహెచ్‌బి చలపతి మెమోరియల్ గోల్డ్ అండ్ సిల్వర్ మెడల్స్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.

Pages