S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/10/2018 - 01:02

తల్లి ప్రేమకు కోటి భావాల దృశ్యమిది. మాటలెన్ని చెప్పినా.. అమ్మను ఎంతగా వర్ణించినా.. వర్ణనాతీతమైన జీవన గీతే అమ్మ అని చెప్పే అద్భుతమిది. అమ్మప్రేమకు కొలమానం లేదు. పేదరికమూ లేదు. అందుకే అమ్మ ఉంటే ఓ ధీమా.. జీవితానికీ భీమా.. నడవలేని కొడుకు.. సత్తువ లేని జీవితం.. రెండూ బాధిస్తున్నా.. పేదరికం వేధిస్తున్నా.. ఈ తల్లి ప్రేమను అధిగమించలేకపోయాయి. నగర వీధుల్లో కార్లు షికార్లు చేస్తున్నా..

09/10/2018 - 00:58

విజయవాడ, సెప్టెంబర్ 9: పర్యాటక రంగానికి సంబంధించి త్వరలో మైస్ సిటీగా విశాఖ మారనుందని ఏపీ పర్యాటక సాధికార సంస్థ (ఏపీటీఏ) సీఈవో హిమాన్షు శుక్లా వెల్లడించారు. విశాఖలో మూడు రోజులు జరిగిన భారతీయ టూర్ ఆపరేటర్ల అసోసియేషన్ వార్షిక సదస్సు రాష్ట్ర పర్యాటక ప్రయోజనాలకు కొత్త ఊపిరులు ఊదింది. జాతీయ స్థాయి ప్రముఖ పర్యాటక టూర్ ఆపరేటర్లను ఏపీ వైపు ఆకర్షించడంలో సఫలమైంది.

09/10/2018 - 00:49

హైదరాబాద్: దివంగత మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య సతీమణి మణెమ్మ ఆదివారం కన్నుమూశారు. కొంత కాలంగా ఆమె అస్వస్థతతో ఉన్నారు. కుటుంబ సభ్యులు ఆమెను అపోలో ఆసుపత్రిలో చేర్చించగా, చికిత్స పొందుతూ మరణించారు. 2008లో ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మణెమ్మ మృతి పట్ల అపద్ధర్మ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.

09/10/2018 - 00:51

హైదరాబాద్: తెలంగాణ ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్న శాసనసభ ఎన్నికలకు సంబందించి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ సోమవారం ప్రారంభమవుతోంది. తెలంగాణ రాష్ట్ర తొలిశాసనసభ ఈ నెల 6న రద్దు కావడంతో ఎన్నికలు జరపాల్సి వస్తోంది. 2018 నవంబర్ లేదా డిసెంబర్‌లో ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ అధికారి (సీఈఓ) రజత్ కుమార్ షెడ్యూల్ ప్రకటించారు.

09/10/2018 - 00:48

హైదరాబాద్: తెలంగాణ శాసనసభకు ఎన్నికల ప్రక్రియ అత్యంత మెరుపువేగంతో సాగుతోంది. సెప్టెంబర్ 6న శాసనసభ రద్దుకాగానే, రాష్ట్ర రాజధానితో పాటు దేశ రాజధానిలో కూడా హల్‌చల్ మొదలైంది. ఒకవైపు రాజకీయ పార్టీలు తమ వ్యూహాలు రూపొందించుకుంటూ ఉండగా, మరోవైపు అధికారికంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది.

09/10/2018 - 00:47

హైదరాబాద్: ‘తెలంగాణ.. కల్వకుంట్ల ఇల్లా?’ అని తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ చేసిన విమర్శ తిరిగి ఆమె మెడకే చుట్టుకున్నట్టు అయింది. మరి ‘వరంగల్ జిల్లా.. కొండా ఇల్లా?’ అని టీఆర్‌ఎస్ శ్రేణులు తీవ్రస్థాయిలో ఎదురుదాడికి దిగాయి. టీఆర్‌ఎస్‌లో కొండా సురేఖ చేరేనాటికే తెలంగాణ ఉద్యమంలో పార్టీ అధినేత కేసీఆర్ కుటుంబం చురుకైన పాత్ర పోషించిందని శ్రేణులు గుర్తు చేస్తున్నాయి.

09/10/2018 - 00:29

హైదరాబాద్, సెప్టెంబర్ 9: సర్వే నివేదికల ఆధారంగానే వచ్చే ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేశారా? లేక ఉత్తుత్తి సర్వేలతో హడావుడి చేసి, అభ్యర్థులను ఇతరత్రా కారణాలతో ఎంపిక చేశారా? అనే అనుమానాలు టీఆర్‌ఎస్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. అదే వాస్తవమైతే, తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న కొందరికి టిక్కెట్లు ఎలా వచ్చాయని ఈ అనుమానాలు వ్యక్తం చేస్తున్న వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

09/10/2018 - 00:24

హైదరాబాద్, సెప్టెంబర్ 9: ముందస్తు ఎన్నికలను సమర్థంగా ఎదుర్కోవడానికి జరుగుతున్న కసరత్తులో విపక్షాలు ముందడుగు వేశాయి. టీఆర్‌ఎస్‌ను గద్దె దింపాలన్న ఏకైక లక్ష్యంతో పార్టీల సిద్ధాంతాలను పక్కన పెట్టి ‘మహాకూటమి’ ఏర్పాటుకు సంసిద్ధమయ్యాయి. ఇందుకు తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనతో ఆ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఎల్. రమణ చొరవ తీసుకున్నారు.

09/10/2018 - 00:17

కడప, సెప్టెంబర్ 9: కడప నగరంలోని జడ్పీ హాల్‌లో ఆదివారం నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వల్ల ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేకపోగా వ్యక్తిగత విమర్శలకు వేదికైంది. కడప నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ హాలులో జడ్పీ చైర్మన్ గూడూరు రవి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

09/10/2018 - 00:14

విశాఖపట్నం, సెప్టెంబర్ 9: కాపు రిజర్వేషన్లకు సంబంధించి కేంద్రానికి పంపిన బిల్లును ఉపసంహరించుకుని, కొత్తగా 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు పెట్టి, గవర్నర్ ఆమోదంతో వాటిని అమలు చేయాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. విశాఖలో ఆదివారం నిర్వహించిన కాపు నాయకుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు.

Pages