S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/10/2018 - 00:10

విశాఖపట్నం, సెప్టెంబర్ 9: గడచిన నాలుగున్నరేళ్ళలో టీడీపీ నాయకులు విశాఖలోని వేలాది ఎకరాల భూములను కబ్జా చేశారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. పాదయాత్రలో భాగంగా విశాఖ నగరంలోని కంచరపాలెంలో ఆదివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. విశాఖలో కనిపించిన భూములన్నింటినీ టీడీపీ నేతలు కబ్జా చేశారని అన్నారు. విశాఖలో పేదల భూములను లాక్కుని, తమ వారికి, తమ బినామీలకు కట్టబెట్టారని విమర్శించారు.

09/10/2018 - 00:06

విజయవాడ, సెప్టెంబర్ 9: ప్రజా రాజధాని అమరావతిని ప్రపంచంలోనే ఐదు అత్యుత్తమ ప్రపంచ శ్రేణి జీవనయోగ్య నగరాల్లో ఒకటిగా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. ఇందుకోసం ‘ది ఎనర్జీ అండ్ రిసోర్స్ ఇన్‌స్టిట్యూట్’ (టీఈఆర్‌ఐ) లాంటి అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేయాలని రాష్ట్ర రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) అధికారులను ఆదేశించారు.

09/10/2018 - 04:23

వరంగల్, సెప్టెంబర్ 9: రైతు సమస్యలు రాజకీయాల ద్వారానే సాధ్యమనుకుంటే కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తానని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. నగరంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో ఆదివారం సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహించిన జాతి నిర్మాణంలో సేవ-మన పాత్ర అనే అంశంపై జరిగిన సెమినార్‌లో లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

09/10/2018 - 04:23

కరీంనగర్, సెప్టెంబర్ 9: గతంలో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ బ్యారెల్ ధర 120 డాలర్లు ఉన్నప్పుడు పెట్రోల్ రూ.68, డీజిల్ రూ.53 ఉందని, ఇప్పుడు బ్యారెల్ ధర 69.02 డాలర్లు తగ్గిందని, వాటికి అనుగుణంగా ధరలను తగ్గించకుండా అధికంగా పెట్రోల్ రూ.85.23, డీజిల్ రూ.78.39లకు ధరలు పెరిగాయని ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసన్ కృష్ణన్ అన్నారు.

09/10/2018 - 04:24

మెదక్, సెప్టెంబర్ 9: ‘ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ పరిపాలన, అవినీతి పరిపాలన ముగిసింది. తెలంగాణలో రాబోయే ధర్మ పాలనకు ప్రజలు పట్టం కట్టబోతున్నారని’ తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆదివారం మెదక్ టీఎన్‌జీవో భవన్‌లో ‘మా ప్రశ్నకు బదులేది, రచ్చబండ, రౌండ్ టేబుల్ సమావేశం’లో కోదండరాం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

09/09/2018 - 21:31

13వ తేదీ వినాయక చవితి సందర్భంగా
‘వినాయక వ్రతకల్పం’
నేటి ఆదివారం అనుబంధంలో

09/09/2018 - 04:16

విజయవాడ(సిటీ), సెప్టెంబర్ 8: రాష్ట్రం పైనా, ముఖ్యమంత్రి చంద్రబాబుపైనా కక్ష కట్టిన కొన్ని శక్తులు ప్రారంభించిన ఆపరేషన్ గరుడ తన రూపం మార్చుకుని మరోసారి దాడికి సిద్ధమయిందని సినీనటుడు శివాజీ పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునే టార్గెట్ చేసుకున్న జాతీయ పార్టీ మరో సారి తన పంజా విసిరేందుకు సిద్ధమయిందన్నారు.

09/09/2018 - 03:26

కొత్తగూడెం, సెప్టెంబర్ 8: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు, రానున్న ఎన్నికల్లో పొత్తులతో బరిలోకి దిగుతామని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు.

09/09/2018 - 03:25

తిరుపతి, సెప్టెంబర్ 8: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో బంగారు వాకిలి నుంచి గర్భాలయంలోనికి మలయప్ప స్వామి విగ్రహాన్ని తీసుకువెడుతున్న సమయంలో అర్చకుని కాలు మడతపడి విగ్రహం నేల తాకిన సంఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారు ఎన్‌ఎకే సుందర వరద భట్టాచార్యులు సూచనలు మేరకు ప్రాయశ్చిత్తంగా శ్రీవారి యాగశాలలో వైఖానసాగమోక్తంగా లఘు సంప్రోక్షణ నిర్వహించారు.

09/09/2018 - 03:12

నసరుల్లాబాద్, సెప్టెంబర్ 8: రాష్ట్రంలో కేసీఆర్ హాయంలోనే ఆలయాలు అభివృద్ధి చెందాయని మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం నిజాబాద్ జిల్లా బీర్కూర్, నసరుల్లాబాద్ మండలాల్లో గల తెలంగాణ తిరుమల ఆలయం, సోమాలింగేశ్వరాలయం, జోడిలింగాలయాల ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆనంతరం పోచారం తనయకుడు పోచారం సురేందర్‌రెడ్డి నిర్వహించిన మహా అన్నదానంలో పాల్గొన్నారు.

Pages