S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/09/2018 - 02:58

చార్మినార్, సెప్టెంబర్ 8: ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీలు ఐక్యమై ఎన్నికల్లో పాల్గొనాలని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంటు అధ్యక్షుడు ఇనుగాల భీంరావు పిల్పునిచ్చారు.

09/09/2018 - 02:57

నాగార్జునసాగర్, సెప్టెంబర్ 8: తెలంగాణ టూరిజం శాఖ నాగార్జునసాగర్ నుండి శ్రీశైలానికి లాంచీ ప్రయాణాన్ని శనివారం నాడు ప్రారంభించారు. రెండు రోజుల పాటు కొనసాగించే ఈ టూరులో మొదటి రోజు హైద్రాబాద్ నుండి టూరిజం బస్సులో సాగర్ వచ్చి సాగర్ నుండి బయలుదేరి సాయంత్రానికి శ్రీశైలానికి చేరుకొని రాత్రి అక్కడ బస చేసిన అనంతరం మరుసటి రోజు దైవదర్శన అనంతరం సాయంత్రానికి తిరిగి సాగర్ చేరుకుంటారు.

09/09/2018 - 02:54

ఆదిలాబాద్, సెప్టెంబర్ 8: తెరాస టికెట్ ఖరారైన అపద్ధర్మ మంత్రి జోగురామన్న శనివారం వివిధ కుల సంఘాలు, మహిళా సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తూ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షిస్తూ బిజీ బిజీగా గడిపారు. ఉదయం జోగురామన్న పట్టణంలో పెండింగ్‌లో ఉన్న రోడ్లు, అభివృద్ధి పనులపై మున్సిపల్ అధికారులు, కాంట్రాక్టర్లతో ఫారెస్ట్ గెస్ట్ హౌస్‌లో సమావేశమై వాటిని సత్వరమే పూర్తిచేయాలని సూచించారు.

09/09/2018 - 02:53

హైదరాబాద్, సెప్టెంబర్ 8: లోక్‌సభ ఎన్నికల అనంతర పరిణామాలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) నేతలతో సయోధ్య కుదుర్చుకుందనే చర్చ జోరుగా జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల అనంతరం కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యలో ఎంపీల మద్దతు కూటగట్టుకునే క్రమంలో టీఆర్‌ఎస్‌తో సానుకూల వైఖరినే కొనసాగించాలని బీజేపీ అగ్రనాయకులు భావిస్తున్నారని సమాచారం.

09/09/2018 - 01:49

విశాఖపట్నం, సెప్టెంబర్ 8: చైనా పర్యాటకులను ఆకర్షించడం ద్వారా భారత పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతుందని కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ సత్యజిత్ రాజన్ అభిప్రాయపడ్డారు. విశాఖలో మూడు రోజులుగా జరుగుతున్న ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ (ఐఏటీవో) 34వ కనె్వన్షన్ ముగింపు కార్యక్రమం శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటకానికి చైనా అతిపెద్ద మార్కెట్‌గా పేర్కొన్నారు.

09/09/2018 - 01:47

విజయవాడ (ఇంద్రకీలాద్రి) సెప్టెంబర్ 8: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న అమ్మవారి సన్నిధిలో శనివారం పాము కలకలం రేపింది. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో అమ్మవారి ముఖమండప దర్శనానికి వెళుతున్న భక్తుడొకరికి పాము కనిపించటంతో అతడు గట్టిగా కేకలు వేశాడు. దీంతో భక్తులందరూ భయంతో పరుగులు తీశారు. ఈ కారణంగా సుమారు రెండు గంటల పాటు దర్శనాలు నిలిపివేశారు.

09/09/2018 - 01:43

హైదరాబాద్, సెప్టెంబర్ 8: తెలంగాణ రాష్ట్ర సమితి తరపున అసెంబ్లీకి పోటీ చేసేందుకు టిక్కెట్లు ఆశించి భంగపడిన నాయకులు పార్టీ నాయకత్వంపై తిరుగుబావుటా ఎగురు వేస్తున్నారు. వరంగల్ తూర్పు టిక్కెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖకు టిక్కెట్లు లభించలేదు. దీంతో ఆమె శనివారం మీడియాతో మాట్లాడుతూ తాము చేసిన తప్పేమిటో 24 గంటల్లో చెప్పాలని అధిష్టానానికి సవాల్ విసిరారు.

09/09/2018 - 01:42

హైదరాబాద్, సెప్టెంబర్ 8: ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటీరియం రిలీఫ్ (ఐఆర్) ఇచ్చే అంశంపై ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో ప్రభుత్వం రెండు మూడురోజుల్లో చర్చలు జరపాలని నిర్ణయించినట్టు తెలిసింది. దాంతో శనివారం జరగాల్సిన జేఏసి సమావేశం రద్దయిందని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ ఉద్యోగులకు, టీచర్లకు ఐఆర్ ప్రకటించకుండానే ఎన్నికలు వెళుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల జేఏసీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు.

09/09/2018 - 01:41

హైదరాబాద్, సెప్టెంబర్ 8: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతంగా పెంచి ప్రజలను, రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలంగాణ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాల విధానాలకు నిరసనగా ఈనెల 10వ తేదీన భారత్ బంద్ పాటించాలని వారు ప్రజలకు పిలుపు ఇచ్చారు.

09/09/2018 - 01:26

హైదరాబాద్, సెప్టెంబర్ 8: రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల విద్యుత్తు ఇవ్వలేదని, ఒకవేళ ఇస్తే తాను గులాబీ కండువా కప్పుకుంటానని ఎప్పుడూ చెప్పలేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కే. జానారెడ్డి అన్నారు. అబద్దాలతో రాజకీయాల్లో విలువలు తగ్గించవద్దని కేసీఆర్‌కు హితవు పలికారు.

Pages