S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/09/2018 - 01:24

హైదరాబాద్, సెప్టెంబర్ 8: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కసరత్తు యుద్ధప్రాతిపదికన జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు 2018 జనవరిలో ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారమే జరుగుతాయని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ డాక్టర్ రజత్‌కుమార్ ప్రకటించారు.

09/09/2018 - 01:23

హైదరాబాద్, సెప్టెంబర్ 8: కొండా దంపతులను పార్టీలో చేర్చుకోవద్దు, మళ్ళీ వారికి రాజకీయ ‘జీవం’ పోయవద్దని ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు పార్టీ రాష్ట్ర నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పలువురు ముఖ్య నాయకులు శనివారం హైదరాబాద్‌కు వచ్చి పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని, ఇతర పెద్దలను కలిసి కొండా దంపతులను చేర్చుకోరాదని కోరారు.

09/09/2018 - 01:22

హైదరాబాద్/ఖైరతాబాద్, సెప్టెంబర్ 8: తెలంగాణ అంటే కల్వకుంట్ల వారి ఇల్లు కాదని కొండా దంపతులు ధ్వజమెత్తారు. తాము చేసిన తప్పేమిటో చెప్పాలని నిలదీశారు. మంత్రి కేటీఆర్ తమకు టికెట్ రాకుండా అడ్డుకుంటున్నారని, ఆయన కోటగిరీ కోసం రాష్ట్రాన్ని ఆగమాగం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ పార్టీ ప్రకటించిన మొదటి జాబితాలో పేరు లేకపోవడం తీవ్ర అసంతృప్తికి, మనోవేదనకు గురిచేసిందని కొండా దంపతులు అన్నారు.

09/09/2018 - 01:09

గోపాలపట్నం (విశాఖపట్నం), సెప్టెంబర్ 8: వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర విశాఖ నగరంలో ప్రవేశించింది. పెందుర్తి నియోజకవర్గ పరిధి జెర్రిపోతులపాలెంలో శనివారం పాదయాత్ర ప్రారంభించిన జగన్ మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) పర్యటనకు శ్రీకారం చుట్టారు. అక్కడి నుంచి పెదనరవ, కోటనరవ, కొత్తపాలెం మీదుగా గోపాలపట్నం పాదయాత్ర చేరుకుంది. అక్కడ్నుంచి విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో జగన్ యాత్ర కొనసాగింది.

09/09/2018 - 04:28

రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్‌లో విలీన మండలాల ఓటర్లు తొలిసారిగా రానున్న ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలవరం ఆర్డినెన్స్‌తో తెలంగాణ ఖమ్మం జిల్లా నుంచి ఏపీలో విలీనమైన వేలేరుపాడు, కుకునూరు, ఎటపాక, చింతూరు, విఆర్ పురం, కూనవరం మండలాల్లో ప్రజలు ఈ సారి ఏపీలో ఓట్ల వల్లనైనా తమ పరిస్థితులు కుదుటపడే పరిస్థితి కనబడటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

09/09/2018 - 04:27

రేణిగుంట: రేణిగుంట తహశీల్దార్ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ రద్దు చేసుకుని విధుల్లో చేరాలంటూ చిత్తూరు జిల్లా రేణిగుంట మండల వ్యాప్తంగా నాలుగు రోజులుగా మండల పరిధిలోని గ్రామస్థులు ఆందోళన చేస్తున్నారు. రేణిగుంట తహశీల్దార్ నరసింహులు నాయుడు స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు ప్రభుత్వానికి ఇటీవల దరఖాస్తు చేసుకున్నారు.

09/09/2018 - 04:26

కర్నూలు: కర్నూలులో హైకోర్టు బెంచి ఏర్పాటు అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. శనివారం శ్రీశైలంలో శ్రీభ్రమరాంబిక, మల్లికార్జునస్వామి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం విలేఖరులతో మాట్లాడిన ఆయన హైకోర్టు బెంచి ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని, త్వరలో తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

09/09/2018 - 01:02

హైదరాబాద్, సెప్టెంబర్ 8: ‘తెలంగాణలో పార్టీని అధికారం దిశగా నడిపించేందుకు అవసరమైన ఎత్తులు, పొత్తులు మీ ఇష్టం..’ అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఎపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ పార్టీ నాయకులకు సూచించారు. ముందస్తు ఎన్నికల హడావుడి నేపథ్యంలో చంద్రబాబు శనివారం అమరావతి నుంచి హైదరాబాద్‌కు చేరుకుని పార్టీ కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ కార్యవర్గంతో సమావేశమై చర్చించారు.

09/08/2018 - 16:43

హైదరాబాద్: తెరాసా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో తమ పేరు లేకుండా చేసి బీసీ మహిళనైన తనను అవమానించారని కొండా సురేఖ అన్నారు. ఆమె తన భర్త కొండా మురళితో కలిసి సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ మాటలు విని తాను పరకాల వదులుకుని వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి యాభై వేల ఓట్ల మెజార్టీతో గెలిచానని అన్నారు. తెలంగాణ అనేది కల్వకుంట్లవారి ఇల్లు కాదు అని అన్నారు.

09/08/2018 - 16:43

హైదరాబాద్:కార్యకర్తలే టీడీపీకి సంపద అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన ఈరోజు లెక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నేతలతో సమావేశమయ్యారు. కమ్యూనిస్టులు, కోదండరామ్ పార్టీల వైఖరిని నేతలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తెలంగాణలో తెలుగుదేశం ఓటింగ్ చెక్కుచెదరలేదని అన్నారు.

Pages