S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/20/2019 - 04:05

హైదరాబాద్, మార్చి 19: దేశంలో నగదు సమతుల్యతను సాధించడం ఆర్‌బీఐ ముందుండే అతి పెద్ద సవాల్ అని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ డాక్టర్ దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నారు.

03/20/2019 - 03:23

హిందూపురం, మార్చి 19: నందమూరి వారి కుటుంబాన్ని అక్కున చేర్చుకుని ఆదరిస్తున్న నియోజకవర్గంగా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ కుటుంబం నుంచి ఎన్నికల్లో ఎవరు పోటీచేసినా గెలిపిస్తూ వచ్చిన ఘనత పురం ఓటర్లకు దక్కుతుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఆ పార్టీ విజయ పరంపర అప్రతిహాతంగా సాగుతోంది.

03/20/2019 - 03:52

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) లోక్‌సభ అభ్యర్థుల జాబితాను బుధవారం ప్రకటించాలని పార్టీ అధినేత, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. అభ్యర్థుల ఎంపికకు కసరత్తు పూర్తి అయినప్పటికీ బుధవారం చతుర్దశి కావడంతో గురువారం పౌర్ణమి మంచి తిథి ఉండటంతో ఆ రోజు అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని టీఆర్‌ఎస్ అధిష్టానం నిర్ణయించినట్టు సమాచారం.

03/20/2019 - 00:45

హైదరాబాద్, మార్చి 19: కాంగ్రెస్ నాయకురాలు, మూడు మార్లు గద్వాల నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన డీకే అరుణ బీజేపీలో చేరిక ఖరారైంది. అయితే పార్టీ మార్పిడిని అరుణ నిర్ధారించలేదు. బీజేపీ నేతలు మాత్రం తమతో అరుణ టచ్‌లో ఉన్నారని చెబుతున్నారు. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అరుణ గద్వాల నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం అరుణ నాగర్‌కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు.

03/20/2019 - 00:42

హైదరాబాద్/ వనస్థలిపురం, మార్చి 19: ప్రతిపక్షం లేకుండా చేయడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి తన పార్టీలో చేర్చుకుంటున్న కేసీఆర్‌కు దమ్ముంటే తనపై మల్కాజిగిరిలో పోటీ చేయాలని పీసీసీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్ధి రేవంత్ రెడ్డి సవాల్ చేశారు.

03/20/2019 - 00:38

హైదరాబాద్/శంషాబాద్, మార్చి 19: ఎత్తిపోతల ప్రాజెక్టు పథకం పూర్తి చేసి రెండు సంవత్సరాల్లో రంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేయ్యడమే కేసీఆర్ లక్ష్యమని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంగళవారం శంషాబాద్‌లో జరిగిన టీఆర్‌ఎస్ ఎన్నికల సభలో మాజీ మంత్రి సబిత తనయుడు కార్తీక్ రెడ్డి.. కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

03/20/2019 - 00:34

నిజామాబాద్, మార్చి 19: తెలంగాణ ప్రజలు నిండుగా దీవెనలు అందించి పార్లమెంటు ఎన్నికల్లో 16స్థానాల్లో గెలిపిస్తే, దేశానికి మార్గదర్శనం చేస్తానని టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. కేంద్రంలో కాంగ్రెస్, భాజపాయేతర పార్టీల పాలనతోనే దేశం ప్రగతిపథంలో పయనిస్తుందని, ఈ దిశగా ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు కోసం ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

03/20/2019 - 00:51

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ జాతీయ పొలిట్‌బ్యూరో పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మాజీ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు తన రాజీనామా లేఖను నామా మంగళవారం పంపించారు.

03/20/2019 - 00:21

సబ్బవరం, మార్చి 19: విశాఖ జిల్లా సబ్బవరం మండలం పెదనాయుడుపాలెం పాత రోడ్డు చెక్‌పోస్ట్ వద్ద మంగళవారం విశాఖ నుంచి పాడేరు వెళ్తున్న కారులో తరలిస్తున్న కోటి రూపాయల నగదును స్థానిక పోలీసులు, ఎన్నికల సంఘం నియమించిన స్టేటస్టికల్ సర్వవైల్ టీమ్ అధికారి షేక్ బాబూరావు పట్టుకున్నారు.

03/20/2019 - 00:18

విజయవాడ (సిటీ), మార్చి 19: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాల నుండి పోటీ చేయనున్నారు. 21న గాజువాకలో 22న భీమవరంలో నామినేషన్ వేస్తారు. పార్టీ జనరల్ బాడీ రాష్ట్ర వ్యాప్తంగా చేసిన సర్వే ఫలితంగా, వారి సూచన మేరకు పవన్‌కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా భీమవరం, విశాఖ నగర పరిధిలోని గాజువాక అసెంబ్లీ స్థానాలకు పోటీలో నిలవనున్నట్లు ప్రకటించారు.

Pages