S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/07/2018 - 00:52

హైదరాబాద్, సెప్టెంబర్ 6:

09/07/2018 - 00:49

చాలాకాలంగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. రాష్ట్ర అసెంబ్లీ రద్దుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో కేబినెట్ ఏకవాక్య తీర్మానాన్ని ఆమోదించడంతో రాజకీయ సందడి మొదలైంది. 105 మంది అభ్యర్థులను కూడా ప్రకటించిన కేసీఆర్ అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. అభ్యర్థులంతా తమ నియోజకవర్గాలకు వెళ్లి, ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశించారు.

09/07/2018 - 00:46

విశాఖపట్నం (జగదాంబ), సెప్టెంబర్ 6: వైసీపీ అధికారంలోకి వస్తే రైతాంగం సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. ప్రజా సంకల్పయాత్ర 256వ రోజు విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలోని అమృతపురంలో గురువారం కొనసాగింది. ఈ సందర్భంగా జగన్ ప్రజలకు అభివాదం చేస్తూ, రైతులు, స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

09/07/2018 - 01:08

కర్నూలు: ప్రజల్ని ఆకట్టుకునే రీతిలో ఎన్నికల హామీలు ప్రకటించడంలో మిగతా రాజకీయ పక్షాల కంటే కాంగ్రెస్ పార్టీ ముందుంది. రానున్న ఎన్నికల్లో గెలిస్తే ప్రజలకు ఇచ్చే వరాలను ప్రకటించడమే కాకుండా ఈనెల 18న పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటనను పురస్కరించుకుని ఎన్నికల శంఖారావం చేయనుంది. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హామీల్లో రైతులకు రూ.

09/07/2018 - 00:43

కర్నూలు, సెప్టెంబర్ 6: దేశంలో భారతీయ జనతా పార్టీ శకం ముగిసిపోయిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్ చాందీ అన్నారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పాల్గొననున్న కర్నూలు బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించడానికి వచ్చిన ఊమెన్ చాందీ గురువారం విలేఖరులతో మాట్లాడారు.

09/07/2018 - 00:35

అమరావతి, సెప్టెంబర్ 6: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన రెండు డీఏల్లో ఒకదానిని చెల్లించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత ఏడాది జనవరి 7వ తేదీ నుండి వర్తించే విధంగా డీఏ చెల్లింపులు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది.

09/07/2018 - 00:33

అమరావతి, సెప్టెంబర్ 6: ఆకలి దప్పులులేని ఆంధ్రప్రదేశ్ తమ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. రాష్ట్ర శాసనసభ 12వ సమావేశాలు గురువారం ప్రారంభమైన సందర్భంగా మాట్లాడిన ఆయన తొలిరోజు ప్రశ్నోత్తరాల అనంతరం దివంగత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి మృతిపట్ల సంతాప తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. దాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించి రెండు నిమిషాలు వౌనం పాటించారు.

09/07/2018 - 00:30

హైదరాబాద్, సెప్టెంబర్ 6: తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్ర తొలి శాసనసభ గురువారం రద్దు కావడంతో అటు అధికార టీఆర్‌ఎస్, ఇటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీల్లోనూ ఎన్నికల హడావుడి కనిపిస్తున్నది. అసెంబ్లీ రద్దుతో రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వ పాలన మొదలైంది.

09/06/2018 - 12:36

అమరావతి: అసెంబ్లీ సమావేశాలను వైకాపా బహిష్కరించింది. పార్టీ ఫిరాయంచిన 22 మంది ఎమ్మెల్యేలపై వేటు వేస్తే తక్షంమే సమావేశాలకు హాజరవుతామని పేర్కొంటూ వైకాపా సమావేశాలను బహిష్కరించింది.

09/06/2018 - 12:26

అమరావతి: ఏపీ వర్షాకాల శాసనసభ సమావేశాలు గురువారంనాడు ఆరంభమయ్యాయి. స్పీకర్ కొడెల శివప్రసాదరావు ఆధ్వర్యంలో తొలుత బీఏసీ సమావేశం జరిగింది. ఏడురోజుల పాటు జరుగనున్న ఈ సమావేశాల్లో స్పీకర్ తొలుత ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. కాగా బీజేపీ సభ్యులు అమరావతి కట్టడాలు లీకుల మయంగా ఉందని, వెయ్యి కోట్ల ప్రజాధనం వృథా అంటూ గొడుగులు వేసుకుని వచ్చారు.

Pages