S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/23/2018 - 05:13

హైదరాబాద్, ఆగస్టు 22: రాష్ట్ర సచివాలయంలోని ప్రధాన రోడ్డే అపరిశుభ్రతకు నిలయంగా మారితే, మిగతా ప్రాంతాల విషయం ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, ఇతర అధికారులు రోజూ తిరిగే రోడ్డు పక్కనే విరిగిన కుర్చీలు, బల్లలు, బీరువాలు పడి ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ చెత్తాచెదారం అందరికీ స్పష్టంగానే కనిపిస్తోంది.

08/23/2018 - 05:17

హైదరాబాద్, ఆగస్టు 22: గత వారం, పదిరోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తెలంగాణలో దాదాపు 10 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లి ఉంటుందని అధికార యంత్రాంగం అంచనా వేసింది. అయితే స్పష్టమైన వివరాలు మాత్రం వ్యవసాయ శాఖకు కానీ, స్టాటిస్టికల్ శాఖకు కానీ రాలేదు. పంటలకు జరిగిన నష్టం వివరాలను పంటల వారీగా, సర్వేనెంబర్ వారీగా, గ్రామాల వారీగా పంపించాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

08/23/2018 - 02:20

* జాతీయ ప్రవేశ పరీక్షల షెడ్యూలు ఖరారు

08/23/2018 - 05:21

హైదరాబాద్: మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్‌ను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నేతలను ఆదేశించారు. ప్రజల మన్ననలు పొందుతున్న మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్‌ను ప్రజలకు మరింత చేరువుగా తీసుకువెళ్లాలని పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీని పవన్ ఆదేశించారు. 12 అంశాలతో కూడిన పార్టీ విజన్ డాక్యుమెంట్ ఈ నెల 14వ తేదీన పవన్ విడుదల చేశారు.

08/22/2018 - 22:38

హైదరాబాద్: నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ జాతీయ ప్రవేశపరీక్షల షెడ్యూలును ఖరారు చేసింది. నీట్ యూజీని మే 5వ తేదీన నిర్వహిస్తారు. దాని ఫలితాలు జూన్ 5న ప్రకటిస్తారు. నవంబర్ 1 నుండి రిజిస్ట్రేషన్ మొదలవుతుంది. ఏప్రిల్ 15 నుండి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక యూజీసీ నెట్ రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 1 నుండి ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 30 వరకూ అవకాశం కల్పిస్తారు.

08/22/2018 - 22:35

హైదరాబాద్: పిల్లలకు కళలపై అవగాహన కల్పించేందుకే బాలోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఉపాధ్యాయ సంఘాలు, ఉత్తమ ఉపాధ్యాయ సంఘం సంయుక్తంగా నవంబర్ 10, 11 తేదీల్లో నిర్వహిస్తున్న ఆట బాలోత్సవ్ బ్రోచర్‌ను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మంత్రుల నివాస ప్రాంగణంలో ఆవిష్కరించారు.

08/22/2018 - 22:22

హైదరాబాద్, ఆగస్టు 22: కరీంనగర్ జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు తమ ఒక నెల జీతాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు కేరళ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి 6.80 లక్షల చెక్క్‌ను కరీంనగర్ జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ సీఎం కేసీఆర్‌ను కలిసి అందజేసారు.

08/22/2018 - 17:22

హైదరాబాద్: సీఏం కేసీఆర్ మంత్రులతో ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మంత్రులతో రాజకీయ పరిణామాలు, ప్రగతి నివేదన సభపై చర్చ జరుపనున్నారు.

08/22/2018 - 17:16

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వరద ప్రాంతాల్లో బుధవారంనాడు ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు రూ.600 కోట్ల నష్టం వాటిల్లినట్లు వెల్లడించారు. రెండు జిల్లాల్లో 19 మండలాల్లో 45 గ్రామాలు వరద తాకిడికి గురయ్యాయని అన్నారు. పంటలు నష్టపోయిన రైతులకు ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేందుకు వీలుగా పరిహారం అందజేస్తామని వెల్లడించారు.

08/22/2018 - 17:15

ఏలూరు: తన వద్ద చదువుకుంటున్న బాలికను గర్భవతిని చేశాడని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి నగ్నంగా ఊరేగించారు. వీధుల్లో నగ్నంగా ఊరేగించి పోలీసులకు అప్పగించారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

Pages