S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/19/2018 - 06:10

కాకినాడ: శాసన మండలి ఉభయ గోదావరి జిల్లాల పట్ట భద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి జరిగే ఎన్నికలపై రాజకీయ వర్గాలు దృష్టి సారించాయి. 2019 జనవరి నెలాఖరు లేక ఫిబ్రవరి మొదటి వారంలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్ట్భద్రుల నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ సెప్టెంబరు మొదటి వారంలో విడుదల కానున్నట్టు సమాచారం.

08/19/2018 - 05:43

అమరావతి, ఆగస్టు 18: జిల్లాల్లో చేపట్టిన జలసంరక్షణ కార్యక్రమాల వల్ల చెరువుల్లో నీటిని నిల్వచేసి సంక్షోభం నుంచి బయటపడే ప్రయత్నాలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్దేశించారు. గ్రామ, వార్డు వికాసం కార్యక్రమాలపై ఉండవల్లిలోని తన నివాసం నుంచి శనివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

08/19/2018 - 05:45

శ్రీశైలం ప్రాజెక్టు, ఆగస్టు 18: కృష్ణా నది ఎగువ ప్రాంతం నుండి భారీగా వరద నీరు రావడంతో శ్రీశైలం జలాశయం నుండి శనివారం నీటిని దిగువకు విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి ఉమా మహేశ్వ ర్‌రావు శనివారం ఉదయం 8 గంటల 30 నిమిషాలకు డ్యామ్ వద్ద పూజలు చేసి నాలుగు గేట్ల ద్వారా దిగువన ఉన్న నాగర్జునసాగర్‌కు నీటిని విడుదల చేశారు.

08/19/2018 - 04:53

హైదరాబాద్, ఆగస్టు 18: దేవాలయాల నిర్మాణానికి, మరమ్మతులకు దేవాదాయ, ధర్మాదాయ శాఖ 80 శాతం నిధులను ఇచ్చేందుకు నిర్ణయించింది. దేవాలయాల కమిటీ లేదా భక్తులు 20 శాతం నిధులు భరిస్తే సరిపోతుంది. ఈ మేరకు శనివారం జీఓ జారీ చేశారు. కొత్తగా ఆలయాలు నిర్మించుకునేందుకు, పాత ఆలయాల పునరుద్ధరణ కోసం దేవాదాయ, ధర్మాదాయ శాఖ కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) నుండి నిధులిస్తుంది.

08/19/2018 - 04:52

హైదరాబాద్, ఆగస్టు 18: దేశంలో మెడికల్, డెంటల్ కాలేజీల్లో యూజీ ప్రవేశానికి నీట్ - యూజీ 2019 నిర్వహణ బాధ్యతను నేషనల్ టెస్టింగ్ ఏజన్సీకి అప్పగించినా, వివాదాలు మాత్రం వీడలేదు. గత ఏడేళ్ల నుండి అనేక వివాదాలతో సతమతమవుతున్న నీట్ నిర్వహణను ప్రత్యేకించి జాతీయ స్థాయి సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ (ఎన్‌టీఏ)కి కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ అప్పగించిన విషయం తెలిసిందే.

08/18/2018 - 13:56

హైదరాబాద్‌: కేరళ చిన్నారుల ఆకలిబాధలు తీర్చేందుకు రూ.52.5 లక్షల విలువ చేసే వంద మెట్రిక్‌ టన్నుల బాలామృతం ఆహారాన్నితెలంగాణ ప్రభుత్వం కేరళకు తరలించనుంది. ముఖ్యమంత్రి ఆదేశానుసారం పౌష్టికాహారాన్ని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక సైనిక విమానంలో కేరళకు తరలిస్తున్నారు.

08/18/2018 - 13:55

విశాఖ: ఆంధ్రవిశ్వవిద్యాలయంలో మంత్రి గంటా శ్రీనివాసరావు ఏపీ సెట్‌-2018 ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షలో 2,481 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. అంతకుముందు యూరోపియన్‌ యూనియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ పోస్టర్‌ను మంత్రి గంటా విడుదల చేశారు.

08/18/2018 - 13:54

శ్రీశైలం: శ్రీశైలం జలాశయం గేట్లు తెరుచుకున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా చేరుతున్న వరద నీటితో జలాశయం జలకళ సంతరించుకుంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 881 అడుగులకు నీరు చేరింది. దీంతో నాలుగు గేట్ల ద్వారా లక్షా 4వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

08/18/2018 - 12:36

విజయవాడ: మాజీ కాంగ్రెస్ ఎంపీ, సామాజిక కార్యకర్త చెన్నుపాటి విద్య శనివారం తెల్లవారు జామున హఠాన్మరణం చెందారు. గత కొంత కాలం నుంచి ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రసిద్ధి సంఘ సంస్కర్త గోపరాజు రామచంద్రరావు(గోరా) కుమార్తె. 84 సంవత్సరాల వయసున్న విద్య కాంగ్రెస్ పార్టీ తరపున ఆమె రెండుసార్లు ఎంపీగా గెలిచారు. వాసవ్య మహిళామండలిని స్థాపించి మహిళలు, పిల్లలుకు సేవాకార్యక్రమాలు అందించారు.

08/18/2018 - 12:35

ధవళేశ్వరం: గోదావరి ఉగ్రరూపం దాల్చటంతో వరద ముంపులోనే లంక గ్రామాలు బిక్కుబిక్కుమంటున్నాయి. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహం 14.6 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ధవళేశ్వరం వద్ద నీటి ప్రవాహం పెరుగుతుండటంతో దిగువకు 14.16లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని వదిలేస్తున్నారు. ప్రజలు నాటు పడవల్లో ప్రయాణించటం సురక్షితం కాదని అధికారులు వెల్లడించారు.

Pages