S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/09/2018 - 05:28

ముస్తాబాద్, ఆగస్టు 8: రైతు బీమా పథకం దేశానికే ఆదర్శమనీ, చారిత్రాత్మకమనీ మంత్రి కే. తారక రామారావు అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన 71 ఏళ్లలో ఏ ప్రధానమంత్రి కూడా సాహసించని బృహత్తర పథకాన్ని అమలు చేసిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు. రైతుబీమాతో రైతుకుటుంబానికి ధీమా ఉంటుందన్నారు. ప్రతి రైతు రైతుబీమా పథకంలో తమపేరు నమోదు చేసుకోవాలని సూచించారు.

08/09/2018 - 01:31

ఆదోని, ఆగస్టు 8: కర్నూలు జిల్లాలో జరిగిన క్వారీ పేలుళ్లకు సంబంధించి నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఆలూరు మండలం హత్తిబెళగల్ గ్రామ సమీపంలోని క్వారీలో శుక్రవారం జరిగిన పేలుళ్ల సంఘటనలో 11మంది కూలీల మృతికి కారణమైన ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్టు డీఎస్పీ ప్రసాద్ తెలిపారు.

08/09/2018 - 05:13

* ప్రధాని మోదీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ నివాళి * రాజాజీ హాల్ వద్ద తొక్కిసలాట.. ఇద్దరు మృతి

08/09/2018 - 05:20

హైదరాబాద్, ఆగస్టు 8: నేడు దేశంలో, వివిధ రాష్ట్రాల్లో మహిళలు, బాలికలపై జరుగుతున్న దురదృష్టకర సంఘటనలు తెలంగాణలోని వర్శిటీల్లో, కాలేజీల్లో జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ వైస్ ఛాన్సలర్లకు సూచించారు. బుధవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్శిటీలో వైస్ ఛాన్సలర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టీ.

08/09/2018 - 00:55

చాగలమర్రి, ఆగస్టు 8: ఒంగోలు గిత్త లక్షల రూపాయల ధర పలికి ఆశ్చర్యం కలిగించింది. కర్నూలు జిల్లా చాగలమర్రికి చెందిన రైతు ముల్లా అలాంసాగారి వౌలాలి తన వద్ద ఒంగోలు గిత్తను రూ.5.25 లక్షలకు విక్రయించాడు. కడప జిల్లా మైదుకూరు మండలం మల్లాయిపల్లెకు చెందిన రైతు గోవిందరెడ్డి ఈ గిత్తను రూ.5.25 లక్షలకు బుధవారం కొనుగోలు చేశాడు. ఐదేళ్ల వయసున్న ఈ కోడెను చిన్నప్పటి నుంచి ప్రేమగా సాకినట్టు వౌలాలి తెలిపాడు.

08/09/2018 - 00:54

విజయవాడ, ఆగస్టు 8: సరకుల విక్రయానికి తోడు అదనంగా బాధ్యతలు అప్పగించడంపై రేషన్ డీలర్లు మండిపడుతున్నారు. తమకు సంబంధం లేని పనులు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రంలో రేషన్ దుకాణాల ద్వారా సరకుల పంపిణీపై కొన్ని జిల్లాల్లో సంతృప్తి శాతం 60 శాతానికి మించకపోవడం, బియ్యం అక్రమంగా తరలింపు తదితర అంశాలపై పౌరసరఫరా శాఖ సీరియస్‌గా ఉంది.

08/09/2018 - 05:19

భద్రాచలం టౌన్, ఆగస్టు 8: ‘మావోయిస్టులు భీకర యుద్ధానికి సిద్ధమవుతున్నారు. పట్టున్న ప్రాంతాల్లోనే కాదు.. తమకు పట్టులేని ప్రాంతాల్లోనూ గెరిల్లా తరహా భారీ దాడులకు తెగబడే ప్రమాదముంది. అక్కడా, ఇక్కడా అని కాకుండా.. మొత్తం అప్రమత్తంగా ఉండండి. శత్రువు పైచేయి సాధించక ముందే పసిగట్టి ఫలితం సాధించండి..

08/09/2018 - 05:16

న్యూఢిల్లీ, ఆగస్టు 8: కరుణానిధి మృతికి నివాళులర్పించిన తర్వాత పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడ్డాయి. అదే విధంగా ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలను ఒక రోజు వాయిదా వేశారు. వేరే రాష్ట్రానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి మరణిస్తే అసెంబ్లీని ఒక రోజు వాయిదా వేసిన సందర్భం అరుదు. పార్లమెంటు, రాష్టప్రతి భవన్‌పై జాతీయ పతాకాలను అవనతం చేసి, దివంగత నేతకు దేశం నివాళులర్పించింది.
ముంబయిలో తమిళ పాఠశాలకు చేయూత

08/08/2018 - 22:16

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఈనెల 13,14,15వ తేదీల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తీసుకుంటున్న చర్యలు ఎమర్జెన్సీ పరిస్థితులను తలపిస్తున్నాయి. హైదరాబాద్‌లో భారీగా పోలీసు బలగాలను మొహరింపచేయడానికి పోలీస్ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈనెల 13,14వ తేదీల్లో జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటన, 15న స్వాతంత్య్ర దినోత్సవం కీలకంగా మారాయి.

08/09/2018 - 05:18

హైదరాబాద్. ఆగస్టు 8: ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నెల 13, 14న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నందున, రాహుల్ పాల్గొనే కార్యక్రమాల ఏర్పాట్లను పార్టీ రాష్ట్ర నాయకులు పరిశీలించారు. బుధవారం ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ ఆర్‌సి కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఎన్.

Pages