S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/31/2018 - 21:32

హైదరాబాద్, జూలై 31:ప్రపంచాభివృద్ధికి ఐటీనే మూలాధారమని జెఎన్‌టీయూహెచ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. జెఎన్‌టీయూలో ఈ ఏడాది డిసెంబర్ 28, 29 తేదీల్లో కంప్యుటేషనల్ ఇంటిలిజెన్స్ అండ్ ఇన్ఫర్మేటిక్స్‌పై నిర్వహించే అంతర్జాతీయ సదస్సు సన్నాహక సమావేశంలో వీసీ మంగళవారం నాడు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పోస్టర్‌ను ఆవిష్కరించారు.

07/31/2018 - 21:31

హైదరాబాద్, జూలై 31: పాఠశాల పూర్వ విద్య స్ధాయి నుండి జూనియర్ కాలేజీ వరకూ పటిష్టం చేసేందుకు ప్రస్తుతం అమలు చేస్తున్న మూడు కీలక పథకాల స్థానే కొత్త పథకాన్ని అమలులోకి తెచ్చింది. ఇంతకాలం సర్వ శిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఎ), రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఎ), టీచర్ ఎడ్యుకేషన్ (టిఈ) పథకాల స్థానే సమగ్ర శిక్షా అభియాన్‌ను తెచ్చింది.

07/31/2018 - 13:52

హైదరాబాద్ : అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు కాంగ్రెస్‌ నాయకులు అడ్డుపడుతున్నారని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెరాస అధికారంలోకి వచ్చినప్పటు నుంచి కాంగ్రెస్‌ తట్టుకోలేకపోతుందని, కాళేశ్వరం నీళ్లు వస్తే పుట్టగతులుండవని ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని తెలిపారు.

07/31/2018 - 13:41

హైదరాబాద్ :గవర్నర్ నరసింహన్ అబిడ్స్‌లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్‌ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు గవర్నర్ సమాధానం చెప్పారు. తాను కూడా ఐదో తరగతి వరకు ఇదే స్కూల్‌లో చదువుకున్నానని గుర్తు చేశారు. జీవితంలో డబ్బులు ముఖ్యం కాదు, చదువు ముఖ్యమని ఆ దిశగా విద్యార్థులు ముందుకు సాగాలని గవర్నర్ సూచన చేశారు.

07/31/2018 - 13:36

కర్నూల్ : నంద్యాల చెక్‌పోస్టు సమీపంలో బండరాయి తొలగిస్తుండగా.. బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతులను స్థిరాస్తి వ్యాపారులు రాజశేఖర్‌రెడ్డి, మల్లికార్జునరెడ్డిగా పోలీసులు గుర్తించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు..

07/31/2018 - 13:03

హైదరాబాద్: ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత కె. రాఘవ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వయసు 105 సంవత్సరాలు. అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చేరిన ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారు. సుఖదుంఖాలు, జగత్‌కిలాడీలు, తాతామనవడు, ఇంట్లోరామయ్య వీధిలో కృష్ణయ్య వంటి ఎన్నో సినిమాలను తీశారు. ఆయనకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.

07/31/2018 - 12:56

గుంటూరు: జిల్లాలోని సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల నుంచి వేలాది మంది రైతులతో కలిసి స్పీకర్ కోడెల శివప్రసాదరావు పోలవరం సందర్శనకు బయలుదేరి వెళ్లారు. దాదాపు 53 బస్సులు, వంద కార్లలో మూడు వేలమంది రైతులతో కలిసి ఆయన పోలవరాన్ని సందర్శించనున్నారు. పోలవరం పూర్తయితే నవ్యాంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుందని అన్నారు.

07/31/2018 - 06:14

న్యూఢిల్లీ, జూలై 30: బంజారా, లంబడా, సుగాలీలను ఎస్టీ జాబితాలో చేర్చడం రాజ్యాంగ విరుద్ధమని, ఈ కులాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలంటూ దాఖలైన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని తెలుగు రాష్ట్రాలకు, కర్ణాటక, మహారాష్ట్ర, కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

07/31/2018 - 05:43

కేపిహెచ్‌బీకాలనీ, జూలై 30: తాను ప్రిన్సిపల్ సెక్రెటరీని నంటూ ప్రభుత్వ అధికారులను మోసగిస్తున్న వ్యక్తిని కూకట్‌పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డీసీపీ వెంకటేశ్వరరావు వివరాలను వెల్లడించారు. ఇందిరాపార్క్ ఎల్‌ఐసీ కాలనీలో నివాసం ఉండే విజయ్ కుమార్ (42) గతంలో సత్యం కంప్యూటర్స్‌ర్‌లో ఉన్నత ఉద్యోగిగా విధులు నిర్వహించాడు.

07/31/2018 - 02:15

కొత్తపేట, జూలై 30: కాపులను బీసీల్లో చేర్చే విషయంలో జగన్ ఏ విధమైన వైఖరితో ఉన్నారో మరోసారి స్పష్టంచేయాలని ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప డిమాండ్‌చేశారు. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేమని జగ్గంపేట సభలో జగన్ కచ్చితంగా చెప్పారని, దానిని తెలుగుదేశం వక్రీకరిస్తోందని వైసీపీ నేతలు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

Pages