S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/31/2018 - 05:03

రాజమహేంద్రవరం, జూలై 30: ఇటు పారిశ్రామికంగా శరవేగంగా విస్తరిస్తున్న విశాఖ, అటు రాజధాని విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టు నడుమవున్న రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టు ఆంధ్రప్రదేశ్‌కు కీలకమైన ఎయిర్‌పోర్టుగా ప్రాధాన్యత సంతరించుకుంది. శరవేగంగా ఈ ఎయిర్‌పోర్టు విస్తరణ పనులు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి.

07/31/2018 - 02:11

బళ్ళారి, జూలై 30: ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తుంగభద్ర జలాశయానికి వరద సగానికి సగం తగ్గిపోయింది. సోమవారం జలాశయానికి 33,375 క్యూసెక్కుల నీరు మాత్రమే వచ్చింది. దీంతో జలాశయం 10క్రస్ట్ గేట్లు రెండు అడుగుర మేర ఎత్తి దిగువ నదిలోకి 26,092 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. జలాశయంలో ప్రస్తుతం 94.61 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నీటిమట్టం 1631.35 అడుగులుగా నమోదైంది.

07/31/2018 - 05:07

అమరావతి, జూలై 30: పార్లమెంటులో హామీలిచ్చి, ఇప్పుడు ఏమీ చేయలేమని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన దగాకోరు కేంద్రాన్ని వదలొద్దని టీడీపీ ఎంపీలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. సోమవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఢిల్లీలో ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒంగోలు ధర్మపోరాటం విజయవంతమైందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఐదుకోట్ల మంది ప్రజల ఆశలన్నీ పార్లమెంటుపైనే ఉన్నాయి..

07/31/2018 - 05:13

విశాఖపట్నం, జూలై 30: రాష్ట్రంలో పాలనను మరింత సులభతరం చేయడానికి హెల్త్‌టెక్, అగ్రిటెక్‌లను అందుబాటులోకి తీసుకురానున్నామని ముఖ్యమంత్రి ఐటీ సలహాదారు జేఏ చౌదరి తెలిపారు. త్వరలో కొత్త ఐటీ విధానాన్ని తీసుకురానున్నామని ఆయన అన్నారు. వారం రోజులపాటు విశాఖలో జరిగే వైజాగ్ స్టార్టప్ సమ్మిట్ 2.0 సదస్సును ఆయన సోమవారం ప్రారంభించారు.

07/31/2018 - 05:18

విశాఖ (జగదాంబ), జూలై 30: మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్‌పరం చేయడాన్ని నిరసిస్తూ ఈ పథకం కార్మికులు విశాఖలోని మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటిని సోమవారం ముట్టడించారు. స్థానిక ఎంవీపీ కాలనీలో ఉన్న మంత్రి ఇంటి వద్దకు అధిక సంఖ్యలో చేరుకున్న మధ్యాహ్న భోజన కార్మికులు ప్రభుత్వం చేపడుతున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ధర్నా నిర్వహించారు.

07/31/2018 - 05:10

హైదరాబాద్, జూలై 30: సికింద్రాబాద్ మహంకాళి బోనాల జాతరలో అందరూ ఉత్కంఠ భరితంగా ఎదురుచూసిన రంగం ఈసారి అంతే ప్రత్యేకతను సంతరించుకుంది. బంగారు బోనం సమర్పించినందుకు సంతోషించావా అని ఆలయ ప్రధాన పూజారి ప్రశ్నించినప్పుడు ‘నాబోనం నాకిచ్చారు? మీరు చేసిందేమిటి’ అని అమ్మమాటగా భవిష్యవాణిని వినిపించిన స్వర్ణలత అన్నారు. తన బంగారంతో బోనం సమర్పించారని, ఎవరూ సొంతంగా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

07/31/2018 - 01:21

హైదరాబాద్, జూలై 30: ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో 433 కాంట్రాక్టు లెక్చరర్ల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాటితోపాటు 145 మంది కాంట్రాక్టు వర్కుషాప్ అటెండర్లు, 37 జూనియర్ అసిస్టెంట్లు, 162 మంది ఆఫీసు సబార్డినేట్లు నియమించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నియామకాలు త్వరలోనే పూర్తిచేస్తామని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ చెప్పారు.

07/30/2018 - 21:50

హైదరాబాద్, జూలై 30: దేశవ్యాప్తంగా ఆరు విశ్వవిద్యాలయాలకు ఉత్కృష్ట విద్యాసంస్థల హోదా లభించింది. కనీసం 20 విద్యాసంస్థలను ఎంపిక చేసి వాటి అభివృద్ధికి వెయ్యి కోట్లు ఇవ్వాలని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. అయితే ఈ పోటీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏ విశ్వవిద్యాలయం కనీసం దరిదాపులలో లేదు. దేశవ్యాప్తంగా 800 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.

07/30/2018 - 21:49

హైదరాబాద్, జూలై 30: రైతుల ఆదాయం 2022 వరకు రెట్టింపు అయ్యేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు హైదరాబాద్‌లో మంగళవారం ప్రాంతీయ సదస్సు ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి తెలిపారు. మంగళవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఈ వర్క్‌షాప్‌ను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి అమర్‌జిత్ సింగ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.కే.

07/31/2018 - 05:12

హైదరాబాద్, జూలై 30: టీఆర్‌ఎస్ నేతలు చాలా మంది తనతో టచ్‌లో ఉన్నారని టీ.పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌లో చాలా మంది నేతలు అభద్రతా భావంతో ఉన్నారని ఆయన సోమవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ అన్నారు. కాంగ్రెస్‌లో చేరేందుకు ముందుకు వస్తున్న వారిని చేర్చుకుంటామని ఆయన తెలిపారు. పేర్లు చెప్పేందుకు ఆయన నిరాకరించారు.

Pages