S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/19/2015 - 06:31

హైదరాబాద్, డిసెంబర్ 18: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉద్దేశపూర్వకంగా ఓటర్లను జాబితా నుంచి తొలగించినట్టు వచ్చిన అభియాగాల్లో వాస్తవం లేదని ఎన్నికల కమిషన్ హైక్టోరుకు తెలియజేసింది.

12/19/2015 - 06:22

విశాఖపట్నం, డిసెంబర్ 18: పరవస్తు పద్యపీఠం ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి మూడు రోజుల పాటు తెలుగు తిరునాళ్లు పేరిట భారీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు పరవస్తు పద్యపీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు పరవస్తు ఫణిశయన సూరి తెలిపారు.

12/19/2015 - 06:22

రాజమండ్రి, డిసెంబర్ 18: నదుల అనుసంధానంలో భాగంగా మహానది-గోదావరి అనుసంధానం ప్రాజెక్టులో త్వరలో ముందడుగు పడబోతోంది. దశాబ్దాలుగా సాధ్యాసాధ్యాల నివేదికను రూపొందించటంతోనే కాలం గడిచి పోతున్న నేపథ్యంలో త్వరలో డిటైల్డ్ ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్)ను రూపొందించే అత్యంత కీలకమైన పరిణామం చోటుచేసుకోబోతోంది.

12/19/2015 - 06:21

హైదరాబాద్, డిసెంబర్ 18: కాల్‌మనీ వ్యవహారంలో నిందితులు ఎంత పెద్దవారైనా, ఏ పార్టీ వారైనా వదిలిపెట్టే ప్రసక్తిలేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం శాసనసభలో ప్రకటించారు. శాసనసభలో కాల్‌మనీ రాకెట్‌కు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ఆయన ఒక ప్రకటన చేశారు. చంద్రబాబు ప్రకటన సారాంశం చదువుతుండగా, వైకాపా ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

12/19/2015 - 06:19

హైదరాబాద్, డిసెంబర్ 18: కాల్‌మనీ సెక్స్ రాకెట్ అంశంపై వరుసగా రెండో రోజు కూడా ఆంధ్ర అసెంబ్లీ దద్దరిల్లింది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా 58 మంది వైకాపా ఎమ్మెల్యేలను సభ నుంచి అంబేద్కర్ జయంతిపై చర్చ ముగిసేంతవరకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

12/19/2015 - 06:19

హైదరాబాద్, డిసెంబర్ 18: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి శీతాకాల సమావేశం రెండోరోజైన శుక్రవారం పలు అంశాలపై అసక్తికరమైన చర్చ జరిగింది. అసెంబ్లీ సమావేశాలను కుదిపేసిన అంగన్‌వాడి వర్కర్ల సమస్యలు, కాల్‌మనీ వ్యవహారంపై మండలిలోనూ చర్చ జరగాలని విపక్షాలకు చెందిన సభ్యులు పట్టుబట్టారు. అంతేగాక, స్పీకర్ పొడియం వద్దకు దూసుకెళ్లేందుకు యత్నించడంతో కాస్త ఉద్రిక్తత చోటుచేసుకుంది.

12/19/2015 - 02:56

హైదరాబాద్, డిసెంబర్ 18: విజయవాడ కాల్‌మనీ రాకెట్ వ్యవహారంపై ఆంధ్ర అసెంబ్లీలో రచ్చ రచ్చ జరిగింది. ఈ అంశంపై అధికార, ప్రతిపక్ష పార్టీలు పట్టువిడుపులు లేకుండా తమ వైఖరులకే కట్టుబడి ఉండటంతో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. చివరకు విపక్ష పార్టీల సస్పెన్షన్ల మధ్య ముగిసింది. ఈ గందరగోళం మధ్యే ముఖ్యమంత్రి చంద్రబాబు కాల్‌మనీ రాకెట్‌పై ప్రకటన చేశారు.

12/19/2015 - 02:10

హైదరాబాద్, డిసెంబర్ 18: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 10నుంచి 15 ఎకరాల విస్తీర్ణంలో అంబేద్కర్ స్ఫూర్త్భివన్ నిర్మించనున్నట్టు సిఎం చంద్రబాబు ప్రకటించారు. శుక్రవారం శాసనసభలో అంబేద్కర్ జయంత్యుత్సవాలపై జరిగిన చర్చకు బాబు బదులిచ్చారు. అంబేద్కర్ అందించిన సేవలను వివరిస్తూ అతి పెద్ద మ్యూజియం ఏర్పాటు చేస్తామన్నారు.

12/19/2015 - 02:03

హైదరాబాద్, డిసెంబర్ 18: విజయవాడలో వెలుగుచూసిన కాల్‌మనీ, దానివెనుకవున్న సెక్స్ రాకెట్‌తో ముఖ్యమంత్రి, తెదేపా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు సంబంధం ఉందని శాసనసభలో ప్రతిపక్ష నేత జగన్ ఆరోపించారు. రెండోరోజైన శుక్రవారం కాల్‌మనీ వ్యవహారం అసెంబ్లీని కుదిపేసింది. కాల్‌మనీపై స్పీకర్ కోడెల చర్చ ప్రారంభిస్తూ ప్రతిపక్ష నేత జగన్‌కు అవకాశం ఇచ్చారు.

12/18/2015 - 18:17

హైదరాబాద్: భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి హకీంపేటలో ఘనస్వాగతం లభించింది. ఇవాళ ఆయన వాయుసేనకు చెందిన విమానంలో ఢిల్లీ నుంచి హకీంపేటకు చేరుకున్నారు. అక్కడ ఆయనకు గవర్నర్ నరసింహన్, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్ మధుసూధనాచారి, ఇతర ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. కాగా, శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి నగరానికి చేరుకున్న విషయం తెలిసిందే.

Pages