S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/30/2018 - 03:19

విజయవాడ, జూలై 29: తాజాగా కేంద్ర హోం శాఖ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌పై టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఆదివారం నాడిక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పార్లమెంట్‌లో ప్రభుత్వంపై తాము అవిశ్వాస తీర్మానం పెట్టి వారంరోజులు గడవక ముందే మోదీ మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేశారన్నారు.

07/30/2018 - 03:18

విజయవాడ, జూలై 29: రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చితీరుతుందని, దీనికోసం ఎవ్వరూ ప్రాణత్యాగాలకు పాల్పడవద్దని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్ తులసిరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

07/30/2018 - 03:56

హైదరాబాద్: పంచాయతీ ఎన్నికలు సకాలంలో నిర్వహించడంలో విఫలమైనందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ జాతీయ నాయకుడు, లోక్‌సభ సభ్యుడు బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. ఎన్నికలు నిర్వహించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన ఆదివారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు.

07/30/2018 - 01:33

బోనాల పండగ సందర్భగా సికింద్రాబాద్‌లోని ఉజ్జయనీ మహాకాళీ అమ్మవారిని
దర్శించుకునేందుకు వస్తున్న ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్

07/30/2018 - 01:19

తిరుపతి, జూలై 29: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం పెద్దజీయ్యంగార్ నేతృత్వంలో చాతుర్మాస దీక్ష సంకల్పం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పెద్దజీయ్యంగార్ మాట్లాడుతూ ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్లి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారని తెలిపారు. ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాసం అంటారని తెలిపారు.

07/30/2018 - 03:36

హైదరాబాద్, జూలై 29: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన, చేపడుతున్న పథకాలు, కార్యక్రమాలన్నీ 2019 ఎన్నికల్లో లబ్ధిపొందాలన్న దృష్టితో ముఖ్యమంత్రి, తెరాస అధినేత కే. చంద్రశేఖరరావు ఒక ప్రణాళిక రూపొందించారని రాజకీయ, ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా కేసీఆర్ పక్కాగా ప్రణాళిక రూపొందించుకుని అమలు చేస్తున్నారని భావిస్తున్నారు.

07/30/2018 - 00:57

హైదరాబాద్, జూలై 29: రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధిక సీట్లు కైవసం చేసుకుని అధికారంలోకి రావడం ఖాయమని తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

07/30/2018 - 01:07

హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సర్వే సత్యనారాయణ జోస్యం చెప్పారు. అదే విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ ఒక్కటయ్యే అవకాశం ఉందని చెప్పారు. బోడుప్పల్‌లో కాంగ్రెస్ సభలో

07/30/2018 - 01:14

హైదరాబాద్: ముందస్తు ఎన్నికలకు వెళ్లినా, వెళ్లకపోయినా వచ్చే ఎన్నికల వ్యూహంపై టీఆర్‌ఎస్ అధిష్ఠానం ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై ఇప్పటికే మూడు దఫాలుగా సర్వే నివేదికలు తెప్పించుకున్న పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వచ్చే ఎన్నికలకు సిట్టింగ్‌లను సమాయత్తం చేస్తూనే ఉన్నారు.

07/30/2018 - 04:19

హైదరాబాద్, జూలై 29: సికిందరాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ముఖ్యమంత్రి కేసీఆర్‌సహా పలువురు ప్రముఖులు ఆదివారం బోనం సమర్పించుకున్నారు. పార్లమెంటు సభ్యురాలు కవిత బంగారు బోనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బీజేపీ సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జనసేన నేత పవన్ కళ్యాణ్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.

Pages