S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/30/2018 - 01:12

కాకినాడ (సర్పవరం జంక్షన్): కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేమని, అది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న అంశమని తేల్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డికి వారి ఓట్లు అడిగే హక్కులేదని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌కు కాపులు ఇక ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు.

07/30/2018 - 01:10

రామచంద్రపురం: విధి నిర్వహణలో నిర్లక్ష్యం, ఆశ్రీత పక్షపాతం, అవినీతి, క్విడ్ ప్రోకో వంటి ఆరోపణలొచ్చిన న్యాయాధికారులపై వేటు వేయడానికి రంగం సిద్ధమయ్యింది. రాష్టవ్య్రాప్తంగా ఇలాంటి ఆరోపణలొచ్చిన 43మంది న్యాయాధికారులతో స్వచ్ఛంద పదవీ విరమణ చేయించడానికి ఉమ్మడి హైకోర్టు ఇప్పటికే ఉత్తర్వులు జారీచేసినట్టు విశ్వసనీయంగా తెలియవచ్చింది.

07/30/2018 - 00:27

అమరావతి, జూలై 29: అమరావతి రాజధాని ప్రాజెక్టుకు అంతర్జాతీయ సంస్థల నుంచి విశేష స్పందన లభిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జాతీయ స్థాయి వర్క్‌షాపులు ఏర్పాటు చేసి అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలను వివరించాలని రాష్ట్ర రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) అధికారులను ఆదేశించారు.

07/30/2018 - 01:09

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టు అంటూ సర్కారు ఆర్భాటం చేస్తున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం దేశ చరిత్రలోనే విఫల ప్రాజెక్టుగా నిలిచిపోనుందని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టులు ఎలా కట్టకూడదో నేర్చుకునేందుకు, విద్యార్థులకు వివరించేందుకు ఉదాహరణగా ఉండబోతుందని ఎద్దేవా చేశారు.

07/29/2018 - 04:15

గద్వాల, జూలై 28: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుండి వస్తున్న వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. శనివారం సాయంత్రం నాటికి జూరాల జలాశయంలో 318.310 మీటర్ల స్థాయి లో 9.234 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, ఎగువ ప్రాంతం నుండి 46 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో శనివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జూరాల అధికారులు ప్రాజెక్టు గేట్లన్నింటిని మూసివేశారు.

07/29/2018 - 03:44

హైదరాబాద్, జూలై 28: ప్రముఖ తెలుగు కవి డాక్టర్ సి. నారాయణరెడ్డి పేరుతో జాతీయ సాహిత్య అవార్డు ఇవ్వాలని సినారే కుటుంబ సభ్యులు నిర్ణయించారు. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో ఉన్న భారతీయ భాషలకు సంబంధించిన ప్రముఖ కవి ఒకరిని ఏటా ఎంపిక చేసి అవార్డు అందచేస్తారు. అవార్డు కింద మూడులక్షల నగదు పారితోషికం, మొమెంటో, శాలువా బహూకరిస్తారు.

07/29/2018 - 03:38

యాదగిరిగుట్ట, జూలై 28: సంపూర్ణ చంద్రగ్రహం సందర్భంగా మూసివేసిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని చంద్ర గ్రహణ పరిసమాప్తమైన తర్వాత శనివారం ఉదయం తెరిచారు. ఉదయం ఐదుగంటలకు బాల ఆలయం ద్వారాలు అర్చక బృందం తెరిచి, శాస్తయ్రుక్తంగా ఆలయ శుద్ధి, మహా సంప్రోక్షణ ప్రక్రియలను నిర్వహించారు. అనంతరం ఆస్థానపరంగానే నిత్యరాధనలు, నిత్య పూజలు, సేవోత్సవాలకు శ్రీకారం చుట్టారు.

07/29/2018 - 03:36

నల్లగొండ, జూలై 28: రాష్ట్ర ప్రభుత్వం గొల్ల, కురుమల సహకార సంఘాలకు అందిస్తున్న సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకంలో అక్రమ రవాణా.. రీస్లైకింగ్ దందాలకు అడ్డుకట్ట వేయడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోంది. జిల్లాలో ఎక్కడో ఒకచోట సబ్సిడీ గొర్రెలను లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసి జిల్లా సరిహద్దులు దాటించే క్రమంలో పట్టుబడుతున్న ఘటనలు సాధారణంగా మారిన తీరు సమస్య తీవ్రతను చాటుతుంది.

07/29/2018 - 03:31

న్యూఢిల్లీ, జూలై 28: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ దేశ రాజధానిలో ఆగస్టు 8న దళిత గిరిజన సింహగర్జన మహాసభను నిర్వస్తామని ఎమ్మార్పీస్ వ్యవస్థపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ స్పష్టం చేశారు.

07/29/2018 - 03:30

రాజమహేంద్రవరం, జూలై 28: గోదావరి డెల్టాలో పశ్చిమ బెంగాల్ తరహా వరినాట్లు పడుతున్నాయి. గత రెండేళ్ల నుంచి పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన కూలీలు గోదావరి జిల్లాల్లో వరి ఊడ్పుల పనుల్లో నిమగ్నమవుతున్నారు. ఉపాధి హామీ పథకం కారణంగా కూలీల కొరత ఏర్పడింది. ఈ నేపధ్యంలో ఇక్కడి కూలీలు అధిక కూలీ తీసుకుంటున్నారని రైతుల్లో వ్యవసాయ ఖర్చులపై బెంగపట్టుకుంది.

Pages