S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/24/2018 - 02:17

అమరావతి, జూలై 23: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక అడ్డుకునేందుకే ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బంద్‌కు పిలుపునిచ్చారని గిరిజన, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనంద్‌బాబు ఆరోపించారు.

07/24/2018 - 02:16

విజయవాడ, జూలై 23: ప్రతిపక్ష నేత జగన్, జనసేన అధినేత పవన్ రాజకీయ బఫూన్లని, వారికి రాష్ట్ర ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలే ముఖ్యమని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ మండిపడ్డారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని టీడీపీ మోసం చేసిందని పవన్ కళ్యాణ్ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

07/24/2018 - 01:52

హైదరాబాద్, జూలై 23: సార్వత్రిక ఎన్నికల సమయంలో అభ్యర్థులను ప్రకటించడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నదని, ఇకమీదట ముందే పేర్లు ప్రకటిస్తే బాగుంటుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి పార్టీ అధిష్టానానికి చేసిన సూచన ఆచరణ సాధ్యమేనా?

07/24/2018 - 01:46

కొత్తగూడెం, జూలై 23: రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని సీట్లకు ఒంటరిగా పోటీచేస్తామని తెలంగాణ జనసమితి (టీజేఎస్) అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. అభ్యర్థులను ముందుగా ప్రకటించడంతో పాటు సమర్థులకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం అన్ని రాజకీయ పార్టీలతో కలిసి పోరాటం చేస్తామని ప్రకటించారు.

07/24/2018 - 01:43

అమరావతి, జూలై 23: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో వౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి ప్రదీప్‌కుమార్ ఆదేశించారు. దేశంలోని వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో టెలీకమ్యూనికేషన్స్, రహదార్ల వ్యవస్థ, వౌలిక సదుపాయాల అభివృద్ధి విషయమై సోమవారం ఢిల్లీ నుండి రాష్ట్ర ప్రభుత్వాల ప్రధానకార్యదర్శులు, డీజీపీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

07/24/2018 - 01:42

చిన్నగొట్టిగల్లు, జూలై 23: అడివి పందుల బారి నుంచి వేరుశనగ పంటను రక్షించుకోవడానికి వెళ్లిన ఓ యువ రైతు గజరాజుల బారిన పడి మృతి చెందిన సంఘటన సోమవారం తెల్లవారు జామున చిత్తూరు జిల్లాలో జరిగింది. ఎర్రావారి పాల్యెం, కొటకాడి పల్లికి చెందిన రైతు వెంకటయ్య (42) ఆదివారం రాత్రి తన పొలంలో కాపలాకు వెళ్లి నిద్రించారు.

07/24/2018 - 02:27

కర్నూలు, జూలై 23: నల్లమల అటవీ ప్రాంతంలోని కర్నూలు జిల్లా కొత్తపల్లె మండలంలోని లలితా సంగమేశ్వరుడు సోమవారం గంగ ఒడికి చేరుకున్నాడు. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 851 అడుగులకు చేరుకోవడంతో కేవలం ఆలయ శిఖర భాగం మాత్రమే కనిపిస్తోంది. మంగళవారం ఉదయానికి అదికూడా పూర్తిగా నీట మునిగే అవకాశముంది. ఈ ఏడాది ఫిబ్రవరి 13వ తేదీ శ్రీశైల జలాల నుంచి బయటపడిన సంగమేశ్వరుడు ప్రత్యేక పూజలందుకుంటున్నాడు.

07/24/2018 - 01:08

హైదరాబాద్, జూలై 23: రాష్ట్రంలో గోదావరి, కృష్ణా నదులు నిండు కుండల్లా కనిపిస్తున్నాయి. మొదట గోదావరి ప్రాజెక్టులకు జలకళ సంతరించుకోగా ప్రస్తుతం కృష్ణా ప్రాజెక్టులు వరద ప్రవాహంతో ఉరకలు వేస్తోన్నాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది ముందుగానే ప్రాజెక్టుల్లోకి నీరు వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టుల కింద పూర్తి ఆయకట్టు సాగులోకి వస్తుందని రైతన్నలు సంబరపడుతున్నారు.

07/24/2018 - 02:55

రాజమహేంద్రవరం, జూలై 23: గోదావరి వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. కాటన్ బ్యారేజి నుంచి లక్షల క్యూసెక్కుల జలాలు సముద్రంపాలవుతున్నాయి. ఈ ఖరీఫ్ సీజన్ మొదలైనప్పటి నుంచి బ్యారేజి నుంచి ఇప్పటివరకు 419.84 టీఎంసీల జలాలు వృథాగా సముద్రంలోకి పోయాయి.

07/24/2018 - 01:21

అనంతపురం: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని, తమ పొత్తు నేరుగా ప్రజలతోనేనని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఊమెన్ చాందీ అన్నారు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలు, ఇబ్బందులు, అవసరాలు తెలుసుకోవడమే తమ ముందు ఉన్న లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

Pages