S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/24/2018 - 00:37

అమరావతి, జూలై 23: విభజన హక్కుల సాధన కోసం ఎంపీలతో కేంద్రంపై పారాటం చేయిస్తూనే అభివృద్ధి కోసం ఆరాట పడుతున్నామని ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులోనూ కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. సుస్థిర ఆర్థికాభివృద్ధి లక్ష్యం కావాలని, నాలుగేళ్లలో వ్యవస్థలన్నింటినీ పటిష్ఠం చేశామని ఉద్ఘాటించారు. వీటిని సమర్థవంతంగా వినియోగించుకుని సత్ఫలితాలను సాధించాలన్నారు.

07/23/2018 - 17:43

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబుతో ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలను జేసీ ఆయన దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిసింది. రాజీనామా తదితర విషయాలపైనా కూడా వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది.

07/23/2018 - 13:46

తిరుపతి: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పద్మావతిపురం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకో జరిగింది. కార్యకర్తలు వాహనాలను నిలిపివేశారు. సీపీఐ కార్యదర్శి రామకృష్ణ కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. మండిపడ్డారు. తిరుపతిలోని పద్మావతిపురం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించిన రాస్తారోకోలో సీపీఎం జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీనివాసరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు.

07/23/2018 - 13:43

హైదరాబాద్: నగరంలోని జీడిమెట్ల సుభాష్‌నగర్‌లో ప్లాస్టిక్ ప్రింటింగ్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలధాటికి పరిశ్రమ గోడలు కుప్పకూలాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది.

07/23/2018 - 13:42

అమరావతి: రేపటి నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీళ్లు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. శ్రీశైలం నుంచి రాయలసీమకు నీళ్లిస్తామన్నారు. గోదావరిలో ఇప్పటికే 419 టీఎంసీలు సముద్రంలో కలిసిందని, మరో పదిరోజుల్లో శ్రీశైలం రిజర్వాయర్ నిండుతుందన్నారు.

07/23/2018 - 04:27

విజయవాడ (ఇంద్రకీలాద్రి): నగరంలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన ఆదిపరాశక్తి శ్రీ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ శ్రీ మహంకాళీ జాతర బోనాల ఉత్సవ ఊరేగింపు కమిటీ సభ్యులు ఆదివారం ఉదయం బంగారు బిందెతో బోనాలు సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు.

07/23/2018 - 01:20

విశాఖపట్నం, జూలై 22: రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు విషయంలో కేంద్ర వైఖరికి నిరసనగా టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో నైతిక విజయం మాకే దక్కిందని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖలో పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

07/23/2018 - 01:22

తిరుపతి, జూలై 22: తిరుమలేశుని ఆభరణాలు ఎన్ని ఉన్నోయో లెక్కలు తేల్చి భక్తులకు వివరించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేయాలని శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతి, విశ్వధర్మ పరిరక్షణ వేదిక అధ్యక్షులు శివస్వామి డిమాండ్ చేశారు.

07/23/2018 - 01:22

కాకినాడ, జూలై 22: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి 218 రోజు ప్రజాసంకల్ప యాత్ర ఆదివారం ఉదయం జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని అచ్చంపేట నుండి భారీ జన సందోహం మధ్య ప్రారంభమయ్యింది. అచ్చంపేట జంక్షన్ శిబిరంలో జగన్‌ను కలిసేందుకు వివిధ వర్గాల ప్రజలు పోటెత్తారు. అచ్చంపేట, గొంచర్ల, బ్రహ్మానందపురం, పి వేమవరం క్రాస్ మీదుగా ఉండూరు శివా రు వరకు పాదయాత్ర కొనసాగింది.

07/23/2018 - 01:00

హైదరాబాద్: అమెరికాలో నిర్వహించనున్న ప్రపంచ పర్యావరణ సదస్సు (గ్లోబల్ క్లైమెట్ యాక్షన్ సమిట్)కు రావాల్సిందిగా కాలిఫోర్నియా గవర్నర్ నుంచి ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు ఆహ్వానం అందింది. సదస్సులో పాల్గొనాలంటూ కాలిఫోర్నియా గవర్నర్ ఎడ్మండ్ జి బ్రౌన్ కేటీఆర్‌కు లేఖ రాసారు. సెప్టెంబర్ 12 నుంచి 14 వరకు కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ఫ్రాన్సిస్కోలో సదస్సు జరుగుతుందని అందులో పేర్కొన్నారు.

Pages