S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/23/2018 - 00:53

హైదరాబాద్, జూలై 22: సార్వత్రిక ఎన్నికలకు చాలా రోజుల ముందుగానే అభ్యర్థుల ఎంపికలో జాప్యం చేయకుండా ముందుగానే ప్రకటించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి పార్టీ అధిష్టానాన్ని కోరారు. రాహుల్ గాంధీ ఎఐసిసి అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆదివారం ఢిల్లీలో తొలిసారి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) విస్తృత స్థాయి సమావేశం జరిగింది.

07/23/2018 - 00:52

హైదరాబాద్: అన్ని గ్రామ పంచాయతీలకు పంచాయతీ కార్యదర్శులను నియమించనున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఇప్పటికే పని చేస్తోన్న పంచాయతీ కార్శదర్శులకు అదనంగా 9,200 మంది కార్శదర్శులను నియమిస్తామని సీఎం అన్నారు. ఈ ప్రక్రియను వారం రోజుల్లో ప్రారంభించి రెండు నెలల్లో పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

07/23/2018 - 04:02

హైదరాబాద్, జూలై 22: ‘రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదు, అందుకే విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలపై పార్లమెంట్‌లో తమ నిరసన గళాన్ని కేంద్రానికి వినిపించాం’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్‌కు చెప్పారు. ‘మాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అందుకే కేంద్రంతో ఘర్షణ వైఖరి తగదనే ఓటింగ్‌కు దూరంగా ఉన్నాం’ అని కూడా వ్యాఖ్యానించినట్టు సమాచారం.

07/23/2018 - 01:24

మహబూబ్‌నగర్, జూలై 22: కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల ద్వారా వస్తున్న వరద యథాతథంగా జూరాల ప్రాజెక్టులోకి వస్తోంది. దాదాపు 1.85 లక్షల క్యూసెక్కుల వరద అధికార వర్గాల సమాచారం. దీంతో రెండు రోజుల నుండి జూరాల ప్రాజెక్టు 15 గేట్లను ఎత్తివేసి దిగువ ఉన్న శ్రీశైలం ప్రాజెక్టులోకి నీటిని నిరంతరాయంగా వదులుతున్నారు.

07/23/2018 - 04:11

విజయవాడ, జూలై 22: పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వానివి, ప్రచారం మాత్రం చంద్రబాబుదని, ఇదంతా సొమ్మొకరిది, సోకొకరిది అన్నట్లుగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. రాష్ట్రంపై ఉన్న అభిమానంతో ఎంత ఖర్చయినా వెనుకాడకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నిధులిస్తుంటే అందులోనూ చంద్రబాబు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.

07/23/2018 - 01:04

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాపాడుకోవటంలో అధికారపక్ష తెలుగుదేశంతో పాటు ప్రతిపక్షాలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని మాజీ మంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారు. ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని, ఒక పార్టీని ద్వేషించాలని కాని, మరో పార్టీని ప్రశంసించాలనే ఆలోచన తనకు లేదన్నారు. అయితే సమజానికి చెడు జరుగుతుందంటే గొంతు వినిపించాలన్నదే తన అభిమతమన్నారు.

07/23/2018 - 00:27

అమరావతి, జూలై 22: ‘రాజధానికి ఎన్ని వేల ఎకరాల భూములు కావాలి?. ఇప్పటికే 53వేల 800 ఎకరాలు సమీకరించారు. 120 రకాల పంటలు పండే పచ్చని భూములను ధ్వంసం చేస్తున్నారు. ఇంకా భూసేకరణ పేరుతో రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. మీ భూదాహానికి అంతం లేదా? ఇకపై మీ ఆటలు సాగవు’ అని జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ ప్రభుత్వ తీరును తూర్పారబట్టారు. నిర్బంధ భూసేకరణను ప్రతిఘటించాలని రైతులకు పిలుపునిచ్చారు.

07/23/2018 - 00:23

అమరావతి, జూలై 22: రాష్ట్రంలో రానున్నకాలంలో విద్యుత్ వినియోగం మరింత పెరుగుతుందని, భవిష్యత్ అవసరాల దృష్ట్యా విద్యుత్ స్థాపిత సామర్థ్యాన్ని పెంచేందుకు నిర్దిష్ట కార్యాచరణ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పెరుగుదలకు అనుగుణంగా విద్యుత్ అవసరాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు.

07/22/2018 - 06:18

మార్కాపురం: తవ్వకాల్లో వెలుగుచూసిన పురాతన నాణేలు పంపకాలలో భేదాలు రావడంతో గుట్టురట్టై అధికారుల చెంతకు చేరిన సంఘటన ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలోని సానికవరం గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది.

07/22/2018 - 05:12

విశాఖపట్నం, జూలై 21: రసాయన పదార్థాలు రెండు వైపులా పదునున్న కత్తి లాంటివని, వాటిని మానవహితంగా పారిశ్రామిక అవసరాలకు వాడుకుంటున్న తరుణంలో ఉగ్రవాదుల చేతికంది రసాయన ఆయుధాలుగా మారకుండా ముందస్తు భద్రత పాటించాలని పసిఫిక్ నార్త్‌వెస్ట్ నేషనల్ లేబొరేటరీ ప్రధాన శాస్తవ్రేత్త క్లిఫర్డ్ గ్లంజ్ అభిప్రాయపడ్డారు.

Pages