S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/21/2018 - 13:13

విశాఖపట్నం: విభజన చట్టం ప్రకారం హామీ ఇచ్చిన 11 సంస్థల్లో ఇప్పటికే 10 మంజూరు చేశామని బీజేపీ ఎంపీ హరిబాబు స్పష్టం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన హోదాతో వచ్చే అన్ని ప్రయోజనాలు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తాను ఏంపీగా ఉండగానే ఏపీకి రైల్వేజోన్ వస్తుందని స్పష్టం చేశారు. .. ఏపీకి ఎంత న్యాయం చేయాలో అంతకంటే ఎక్కువ చేస్తామని చెప్పారు.

07/21/2018 - 12:30

శ్రీకాకుళం: జిల్లాలోని సంతబొమ్మాలి వద్ద సముద్రతీరంలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మత్స్యకారులు ఒడ్డుకు చేరుకున్నారు. మరికొంతమంది గల్లంతయ్యారు. ఉమిలాడ తీరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరా తీశారు. గల్లంతయిన వారికోసం గాలింపు చర్యలు చేపట్టాలని కోరారు.

07/21/2018 - 12:37

కర్నూలు: ఎగువ నుంచి వస్తున్న వరద నీటి ఉధృతి వల్ల తుంగభద్ర రిజర్వాయర్‌కు చెందిన 10 గేట్లను ఎత్తివేసి నీటిని దిగువనకు వదిలారు. ఇన్‌ఫ్లో 61 వేల క్యూసెక్కులుగా కాగా ఔట్ ఫ్లో 60 వేల క్యూసెక్కులుగా ఉంది.

07/21/2018 - 12:24

విజయవాడ: తెలుగుదేశం పార్టీపై మరోసారి జనసేన అధినేత మండిపడ్డారు. అవిశ్వాస తీర్మానంపై లోకసభలో నిన్న వివిధ పార్టీలు వ్యక్తంచేసిన అభిప్రాయాలను తెలియజేస్తూ ఆయన ట్విట్టర్‌లో స్పందించారు. ప్రత్యేక హోదాను నీరుగార్చింది ఎవరు అని ప్రశ్నించారు. టీడీపీ ఒక్కసారి గతాన్ని గుర్తుచేసుకోవాలని అన్నారు. మీరు మాట్లాడే ప్రతి మాట, ప్రతి చర్య ఐదుకోట్ల మంది ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలని అన్నారు.

07/21/2018 - 12:33

విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఈనెల 27న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్నోహన్ రెడ్డి తెలిపారు. ఆయన శనివారంనాడు మీడియాతో మాట్లాడుతూ.. లోకసభలో అవిశ్వాసంపై జరిగిన చర్చలో పాల్గొన్న అన్నీ పార్టీలు కూడా తమ అజెండాలను వివరించారేగానీ ప్రత్యేక హోదాను ప్రస్తావించలేదని విమర్శించారు.

07/21/2018 - 02:47

అమరావతి, జూలై 20: కేంద్రం మాటల్లో నిజాయితీలేదు.. రాష్ట్రానికి ఏంచేశారో పునస్సమీక్ష జరిపినట్లులేదు.. పాతపాటే పాడుతున్నారు.. వాస్తవాలు చెప్పేవరకు వదలొద్దని పార్టీ ఎంపీలకు ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం కేంద్రంపై అవిశ్వాసం సందర్భంగా విభజన అంశాలన్నింటినీ లోక్‌సభలో ప్రస్తావించిన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ను అభినందించారు.

07/21/2018 - 02:46

హైదరాబాద్, జూలై 20: దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు తమ స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో అనుసరిస్తున్న విధానాల వల్ల అనేక వివాదాలు చెలరేగుతున్న నేపథ్యంలో పరీక్షల సంస్కరణలకు కేంద్రప్రభుత్వం నడుం బిగించింది. రాజస్థాన్ సెంట్రల్ యూనివర్శిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎం ఎం సాలుంఖే అధ్యక్షతన కమిటీని నియమించింది. ఈ కమిటీ తన నివేదికను అక్టోబర్ నాటికి అందజేస్తుంది.

07/21/2018 - 05:04

అమరావతి, జూలై 20: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా రాష్టమ్రంతటా ఉత్కంఠ నెలకొంది. విభజన అంశాల అమలులో కేంద్ర తీరుకు నిరసనగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఎంపీల ప్రసంగాలు.. రాష్ట్ర ప్రయోజనాలు రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు రాష్ట్రానికి ప్రత్యేకహోదా తదితర అంశాలపై కేంద్రం నుంచి స్పష్టత వస్తుందనే భావన ప్రజల్లో నెలకొంది.

07/21/2018 - 05:06

హైదరాబాద్, జూలై 20: కాళేశ్వరం ప్రాజెక్టు తరహాలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చెప్పారు. కొన్ని రాజకీయ పక్షాలు కోర్టుల్లో కేసులతో ఈ ప్రాజెక్టును అడ్డుకుంటున్నాయని అన్నారు. కోర్టు కేసులు ఓ కొలిక్కి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు మాదిరిగా ఈ ప్రాజెక్టును కూడా వేగవంతంగా పూర్తి చేస్తామన్నారు.

07/20/2018 - 22:01

హైదరాబాద్, జూలై 20:తనను హైదరాబాద్ నగరం నుంచి 6 నెలలు పాటు బహిష్కంచిన పోలీస్ కమిషనర్‌ల ఉత్తర్వులను సవాల్ చేస్తూ పరిపూర్ణానంద స్వామి శుక్రవారం హైకోర్టును ఆశ్రయించారు. తాను ప్రశాతంగా పాదయాత్ర చేస్తున్న తనపై పొలీసులు బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేయడాన్ని స్వామి తప్పుపట్టారు. స్వామి తన ఫిటీషన్‌లో హైదరాబాద్, సైబరాబాద్,రాచకొండ పోలీసు కమిషనర్లను విచారించాలని కోరారు.

Pages