S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/20/2018 - 21:59

హైదరాబాద్, జూలై 20: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కేంద్రంపై వత్తిడి తెచ్చేందుకు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట ధర్నా చేస్తామని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తెలిపారు. విభజన హామీలను అమలు చేయాలని కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పోరాటం చేయడం లేదని ఆయన శుక్రవారం విలేఖరుల సమావేశంలో ప్రశ్నించారు. సిబిఐ కేసు ఉందని ముఖ్యమంత్రి కే.

07/20/2018 - 21:50

హైదరాబాద్, జూలై 20: తెలంగాణ రాష్ట్రానికి చెందిన డాక్టర్ ఆన్‌లైన్ సంస్థ తన సేవలను విస్తరించింది. బెంగళూరు కేంద్రంగా కర్నాటక రాష్ట్ర ప్రజలకు తమ సేవలను ప్రారంభించినట్టు సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. కర్నాటక రాష్ట్రానికి చెందిన ప్రజలు తమ ఆరోగ్య సమస్యల కోసం తమ వెబ్‌సైట్ ద్వారా వైద్యులను సంప్రదించవచ్చునని తెలిపింది. నాన్ ఎమర్జెన్సీ, ప్రివెంటివ్ హెల్త్‌కేర్ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

07/20/2018 - 21:49

హైదరాబాద్, జూలై 20: హరితహారం పేరుతో పోడు భూముల జోలికి వస్తే సీపీఎం పార్టీ చూస్తూ ఊరుకోదని, బాధితులతో కలిసి ఉద్యమిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనీ వీరభద్రం హెచ్చరించారు. గురువారం ఎంబీ భవన్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ హరితహారం పేరుతో ప్రభుత్వం పోడు భూములను స్వాధీనం చేసే కుట్రలు చేస్తోందని మండిపడ్డారు.

07/20/2018 - 21:42

హైదరాబాద్, జూలై 20: మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి శుక్రవారం బేగంపేట క్యాంపు కార్యాలయంలో మంత్రి కల్వకుంట్ల తారకరామారావును కలిసారు. ఈ నెల 25న రవీంద్రభారతిలో జరగనున్న ఇన్నిటెక్ అవార్డ్స్ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా కేటీఆర్‌ను మమ్ముట్టి ఆహ్వానించారు.

07/20/2018 - 21:36

హైదరాబాద్, జూలై 20: లోక్‌సభలో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ ఆంధ్రప్రదేశ్ ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ మాదాసు గంగాధరం అన్నారు. టీడీపీ, బీజేపీ , కాంగ్రెస్ పార్టీలు ఈ చర్చలో వ్యవహరించిన తీరును తప్పుపట్టారు.

07/20/2018 - 21:31

హైదరాబాద్, జూలై 20: దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు తమ స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో అనుసరిస్తున్న విధానాల వల్ల అనేక వివాదాలు చెలరేగుతున్న నేపథ్యంలో పరీక్షల సంస్కరణలకు కేంద్రప్రభుత్వం నడుం బిగించింది. రాజస్థాన్ సెంట్రల్ యూనివర్శిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎం ఎం సాలుంఖే అధ్యక్షతన కమిటీని నియమించింది. ఈ కమిటీ తన నివేదికను అక్టోబర్ నాటికి అందజేస్తుంది.

07/20/2018 - 16:28

విజయవాడ: ఏపీ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని తెలుగుదేశం, బీజేపీ పార్టీలు వృథా చేశాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ మేరక ట్విట్టర్ ద్వారా స్పందించారు. ప్రజల విలువైన సమయం, డబ్బు, వేదనను రాజకీయ నాటకాలకు తెరతీయకుండా ప్రజలకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని అన్నారు.

07/20/2018 - 16:25

అమరావతి: లోకసభలో అవిశ్వాస తీర్మానంపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ చేసిన ప్రసంగాన్ని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభినందించారు. విభజన సందర్భంగా ఏపీకి జరిగిన అన్యాయాన్ని దేశ ప్రజల దృష్టికి తీసుకువెళ్లారని అన్నారు.

07/20/2018 - 05:03

కర్నూలు, జూలై 19: శ్రీశైలం జలాశయం జలకళను సంతరించుకుంటోంది. కృష్ణానది నుంచి వస్తున్న వరద జలాలు జలాశయానికి చేరుకోగా తుంగభద్ర నుంచి శుక్రవారం ఉదయానికి రానున్నాయి. గత ఏడాది జూలై చివరి వారంలో శ్రీశైలం జలాశయానికి నీటి చేరిక ప్రారంభం కాగా ఈ ఏడాది రెండు వారాలు ముందుగానే రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

07/20/2018 - 05:04

కేంద్రంలోని ఎన్‌డీఏ సర్కారుపై లోక్‌సభలో తెలుగుదేశం ప్రవేశపెట్టిన అవిశ్వాసంపై జయాపజయాలు ఎలావున్నా, బీజేపీకి, టీడీపీకి మధ్య జరగబోయే మాటల యుద్ధమే అందరినీ ఆకట్టుకోనుంది. అవిశ్వాసానికి మద్దతు ఇవ్వకూడదని
టీఆర్‌ఎస్ ఇప్పటికే నిర్ణయించుకున్న నేపథ్యంలో, ‘అవిశ్వాసం’ పేరుతో బీజేపీ
ప్రభుత్వాన్ని ఎండగట్టాలని టీడీపీ ఎదురుచూస్తోంది. ప్రత్యేక హోదా విషయానే్న

Pages