S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/15/2016 - 04:26

ఖమ్మం, మే 14: దేశంలో అవినీతి అంటే తొలుత గుర్తుకు వచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని ఆ పార్టీ నేతలు మానవత్వం, అవినీతి అంటూ పెద్ద మాటలు మాట్లాడుతున్నారని రాష్ట్ర మంత్రి కెటిఆర్ ఎద్దేవా చేశారు. శనివారం ఖమ్మంలో విలేఖరులతో మాట్లాడుతూ అవినీతి ఊబిలో కూరుకుపోయిన కాంగ్రెస్ నేతలు ప్రజల సంక్షేమం కోసం ప్రయత్నిస్తున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం దారుణమన్నారు.

05/15/2016 - 04:03

ఖమ్మం, మే 14: ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక చివరి అంకానికి చేరింది. సోమవారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారానికి తెరదింపి ప్రలోభాలతో ఓటర్లకు ఎరవేయడానికి ఉపక్రమించాయి.

05/15/2016 - 04:02

విజయపురిసౌత్, మే 14: శ్రీశైలం జలాశయం నుండి నాగార్జున సాగర్‌కు శనివారం సాయంత్రం 4659 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం నాగార్జున సాగర్ జలాశయం నీటిమట్టం 507.60 అడుగుల వద్ద నిలకడగా ఉంది. ఇది 127.6327 టీఎంసీలకు సమానం. జంట నగరాలకు మంచి నీటి అవసరాల నిమిత్తం సాగర్ జలాశయం నుండి 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. టోటల్ అవుట్ ఫ్లోగా 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

05/15/2016 - 03:59

విజయవాడ, మే 14: జన్ ధన్ యోజన, ఆధార్, మొబైల్ యాప్ ట్రాన్జాన్షన్స్ (జామ్)ను అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి స్థానంలో ఉందని ఆధార్ డైరెక్టర్ జనరల్ అజయ్ భూషణ్ పాండే తెలియచేశారు.

05/15/2016 - 03:42

హైదరాబాద్, మే 14: తెలంగాణ ఎంసెట్ 2016కు ఉభయ రాష్ట్రాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయ. ఆదివారం నిర్వహించనున్న పరీక్షకు 2,46,522 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. పరీక్ష హాలులోకి గంటముందు నుంచి అనుమతిస్తారని, పరీక్ష సమయానికి నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించేది లేదని ఎంసెట్ కన్వీనర్ ప్రకటించారు. ఈసారి జరిగే ఎంసెట్‌కు అనేక ప్రత్యేకతలున్నాయి. గతంలో ప్రైవేటు విద్యాసంస్థల్లో ఎంసెట్ పరీక్షలు నిర్వహించేవారు.

05/15/2016 - 03:41

హైదరాబాద్, మే 14: బీబీనగర్‌లోని నిమ్స్‌లో 1160 పోస్టులు భర్తీ చేయాలని నిమ్స్ పాలక మండలి నిర్ణయించింది. వైద్య మంత్రి లక్ష్మారెడ్డి నేతృత్వంలో శనివారం నిమ్స్ పాలక మండలి సమావేశం జరిగింది. నిమ్స్‌కు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బీబీనగర్‌లో నిర్మిస్తున్న నిమ్స్ వైద్యశాలలో అన్ని రకాల టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు మొత్తం 1160 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

05/15/2016 - 03:40

నిర్మల్, మే 14: ఆదిలాబాద్ జిల్లాలో శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పది మంది అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా నిజామాబాద్ జిల్లా నవీపేటకు చెందిన ఇటుకబట్టీ కార్మికులు. సారంగాపూర్ సమీపాన ఆరెల్లి మహాపోచమ్మ ఆలయంలో మొక్కులు తీర్చుకునేందుకు 14మంది కార్మికులు శనివారం పొద్దుపోయాక సెవెన్ సీటర్ ఆటోలో బయలుదేరారు.

05/15/2016 - 03:38

హైదరాబాద్, మే 14: గోదావరి నీటి పారుదల ప్రాజెక్టులపై సిఎం కె. చంద్రశేఖర్ రావు మాటల గారడి చేస్తున్నారని గోదావరి నదీ జలాల సద్వినియోగంపై డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్టు నిర్వహించిన సదస్సులో పలువురు వక్తలు విమర్శించారు. 2050 నాటికి పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకుని ప్రణాళిక రూపొందించాలని డిమాండ్ చేశారు.

05/15/2016 - 03:32

హైదరాబాద్/ నార్సింగ్, మే 14: నగర శివారులోని గండిపేట సమీపంలోని ఓ ఫాంహౌస్‌లో శుక్రవారం అర్ధరాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. కత్తులతో బెదిరించి ఓ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

05/15/2016 - 03:23

విశాఖపట్నం, మే 14: నైరుతి బంగాళాఖాతం అనుకుని హిందూ మహాసముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శనివారం రాత్రి తెలిపారు. ఇది రాగల 48 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు చోట్ల చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

Pages