S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/20/2018 - 05:21

హైదరాబాద్, జూలై 19: దళితులు, గిరిజనులపై జరుగుతున్న దాడులను యావత్ ప్రపంచం దృష్టికి తీసుకువెళ్లేందుకు సిరిసిల్లలో ఆత్మగౌరవను నిర్వహించనున్నట్టు టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. జూలై నెలాఖరు, ఆగస్టు మొదటి వారంలో నిర్వహించనున్న ఈ దళిత, గిరిజన ఆత్మగౌరవ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరవుతారని ప్రకటించారు.

07/19/2018 - 22:29

సామర్లకోట, జూలై 19: విశాఖపట్నం నుండి విజయవాడ వైపు వెడుతున్న సత్రాగఛ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీ నుండి పొగలు రావడంతో గురువారం రాత్రి 20 నిమిషాలపాటు సామర్లకోట రైల్వేస్టేషన్‌లో ఆగిపోయింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

07/19/2018 - 17:24

విజయవాడ: డీజిల్ ధరల నియంత్రణ, టోల్ ట్యాక్స్‌ల క్రమబద్ధీకరణ, వాహన భీమా ప్రీమియం తగ్గింపువంటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దేశవ్యాప్తంగా లారీ యజమానులు రేపటి నుంచి సమ్మెకు దిగనున్నారు. ఏపీ, తెలంగాణలలో కలిపి ఐదున్నర లక్షల లారీలు గ్యారేజీకే పరిమితం కానున్నాయి.

07/19/2018 - 13:37

అమరావతి: తాను అవిశ్వాస తీర్మానంపై చర్చ రోజు పార్లమెంట్‌కు వెళ్లబోనని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి స్పష్టంచేశారు.ప్రభుత్వం ఎలాగూ కూలిపోదు.. అయినా నాకు ఇంగ్లిష్ రాదు.. హిందీ రాదు.. ఇక నేను సభకు వెళ్లినా, వెళ్లకపోయినా పెద్దగా నష్టమేమీ లేదు. సభలో బాగా మాట్లాడేవాళ్లు చాలా మంది ఉన్నారు. వాళ్లు చూసుకుంటారు అని జేసీ అనడం గమనార్హం.

07/19/2018 - 06:32

విజయవాడ (క్రైం), జూలై 18: అక్రమాస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖాధికారులు ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరు ఇళ్లపై బుధవారం దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో లక్షల రూపాయలు విలువైన అక్రమాస్తులు, బంగారం, నగదు గుర్తించినట్లు ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు.

07/19/2018 - 02:22

న్యూఢిల్లీ, జూలై 18: ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలంటూ రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ అవరణలో విడివిడిగా ఆందోళనలు నిర్వహించారు.

07/19/2018 - 05:07

ఆదిలాబాద్, జూలై 18: దశాబ్దకాలంగా అందరినోట నానుతూ వస్తున్న ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు కథ ఇక కంచికి చేరినట్టే.

07/19/2018 - 02:00

తిరుపతి, జూలై 18: తిరుమలలోని శ్రీవారి ఆలయంలో వచ్చేనెల్లో జరుగనున్న అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ సమయంలో అనుసరించాల్సిన దర్శన విధానంపై సూచనలు, సలహాలు ఇవ్వాలని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేస్తోంది.

07/19/2018 - 01:59

మహబూబ్‌నగర్, జూలై 18: రాష్ట్రంలో కృష్ణానదిపై ఉన్న మొదటి ప్రాజెక్టు జూరాల జలాశయం నుండి కృష్ణా జలాలను బుధవారం ఎత్తిపోసే కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. ఆల్మట్టి గేట్లు ఎత్తివేయడంతో నారాయణపూర్ ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుడడంతో ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి ప్రారంభమైంది.

07/19/2018 - 01:56

కర్నూలు, జూలై 18: కర్నూలు, అనంతపురం జిల్లా రైతుల మధ్య ప్రభుత్వం మరో జల యుద్ధానికి తెరలేపింది. తుంగభద్ర జలాల్లో కేసీ కాలువకు కేటాయించిన 15 టీఎంసీల నికర జలాలను అనంతపురం జిల్లాకు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం కేసీ కాలువకు ప్రాణాధారమైన సుంకేసుల జలాశయం ఎగువన మరో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి అక్కడి నుంచి అనంతపురం జిల్లాకు నీటిని తరలించేందుకు ప్రతిపాదించింది.

Pages